Rai Rai Raa Raa Song Lyrics : ట్రెండింగ్‌లో రయ్ రయ్ రా రా - చెర్రీ ఎనర్జిటికల్ స్టెప్స్ విత్ మాస్ ఫిలాసిఫికల్ లిరిక్స్
Peddi Rai Rai Raa Raa : రామ్ చరణ్ 'పెద్ది' రయ్ రయ్ రా రా సాంగ్ ట్రెండ్ అవుతోంది. చరణ్ ఎనర్జిటికల్ స్టెప్స్‌తో పాటు ఇన్‌స్పిరేషనల్ లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

Ram Charan's Peddi Rai Rai Raa Raa Song Telugu Lyrics : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' రెండో సాంగ్ 'రయ్ రయ్ రా రా' యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. 'చికిరి చికిరి' సాంగ్‌ను మించేలా చరణ్ హుక్ స్టెప్ అదిరిపోయింది. మాస్ స్టెప్పులతో అదరగొడుతూనే యూత్‌కు ఇన్‌స్పిరేషన్‌లా ఉన్న సాంగ్ లిరిక్స్ వేరే లెవల్. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తో పాటు స్వయంగా ఈ పాటను పాడారు. అనంత శ్రీరామ్ ఫిలాసిఫికల్ లిరిక్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మరి ఆ లిరిక్స్ ఓసారి చూస్తే...
'రయ్ రయ్ రా రా' సాంగ్ లిరిక్స్
పల్లవి
రయ్ రయ్ రా రా... రయ్ రయ్ రా రా...
అడ్డే లేని దారై రా రా...
రయ్ రయ్ రా రా... రయ్ రయ్ రా రా...
హద్దే లేని తీరై రా రా...
దూకేటి జోరై రా... పోరాడేటి పోరైరా...
నీలో ఆరు నూరైరా... మందల్లోంచి వేరైరా...
భయ్యం పీకి పారైరా... సిగ్గుంటే సీరైరా... జై కొట్టేటి పేరైరా..
నీ రాక చూసి లోకం చేసే హోరై హోరై హోరై రా రా...
రయ్ రయ్ రా రా... రయ్ రయ్ రా రా...
అడ్డే లేని దారై రా రా...
రయ్ రయ్ రా రా... రయ్ రయ్ రా రా...
హద్దే లేని తీరై రా రా...
బెరుగ్గా హా బెరుగ్గా... ఇరుగ్గా హా ఇరుగ్గా...
పాతేసుకోకోయ్ అలా నువ్ నిన్నే నీ లోపలా...
హే పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా...
చరణం 1
నిన్నటిలాగే రేపున్నదంటే ఈ రోజేం పీకావనే
నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావని..
మొండెంలో తల దించే కత్తైతే... మొలతాడెందుక్ కట్టావ్ తెంచేసేయ్...
నువ్వు మొత్తం రక్తం మార్చుకొనిచ్చేసెయ్...
రయ్ రయ్ రా రా... రయ్ రయ్ రా రా...
అడ్డే లేని దారై రా రా...
చరణం 2
ఆటనుకోకుయ్... ఆటంటే బతుకోయ్..
నీ ఆట బతకాలిరోయ్..
మాటకనుకోకొయ్... గెలుపంటే వెలుగోయ్...
గెలుపై నువ్ వెలగాలిరోయ్... మండే గుండె నీలో లేదంటే...
కాలు చెయ్యీ ఉన్నా లేనట్టే... నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే...
రయ్ రయ్ రా రా... రయ్ రయ్ రా రా...
అడ్డే లేని దారై రా రా...
రయ్ రయ్ రా రా... రయ్ రయ్ రా రా...
హద్దే లేని తీరై రా రా...
బెరుగ్గా హా బెరుగ్గా... ఇరుగ్గా హా ఇరుగ్గా...
పాతేసుకోకోయ్ అలా నువ్ నిన్నే నీ లోపలా...
హే పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా...
Also Read : ముందుగానే పవర్ స్టార్ ఊచకోత - ఉగాదికే థియేటర్లలోకి ఉస్తాద్ భగత్ సింగ్... ఇట్స్ అఫీషియల్
'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా... కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న సినిమా వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రెండింగ్ వార్తలు
























