అన్వేషించండి

Satyakumar News: ఇంగ్లీష్ తోనే అభివృద్ధి అనే భావన పిల్లలకు ఎక్కించొద్దు: మంత్రి సత్య కుమార్

ఇంగ్లీష్ తో మాత్రమే అభివృద్ధి సాధిస్తామనే భావన పిల్లల మనసుల్లోకి ఎక్కించొద్దు. తల్లిదండ్రులకు వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ సూచన

Andhra Pradesh News | ప్రధాని  నరేంద్ర మోడీ కలలు కంటున్న వికసిత్ భారత్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలు కంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో విద్యార్ధులు భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.  బాపట్ల జిల్లా రేపల్లె రూరల్ మండలం చాట్రగడ్డ గ్రామంలో సనాతన వేదాంత నిష్టాశ్రమ శ్రీ సరస్వతీ విద్యామందిర్ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో  ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  

మాతృ భాషలో అధ్యయనం కొనసాగించాలి

ఈ సందర్భంగా మంత్రి  సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మాతృ భాషలో అధ్యయనం కొనసాగించాలన్నారు.  ఆంగ్లభాషతో మాత్రమే అభివృద్ధి చెందగలమన్న అపోహను విడనాడాలని హితవు పలికారు.  ఆంగ్లభాష వుంటేనే వున్నత స్థాయికి వెళ్తామన్న అపోహలను పిల్లల మనసుల్లో చొప్పించే ప్రయత్నాలను తల్లిదండ్రులు విరమించాలనీ,  మాతృ భాషలో విద్య అభ్య‌సించిన వారికి సృజనాత్మకత ఉంటుంద‌నీ మంత్రి తెలిపారు. ఆంగ్లభాష కేవలం ఒక సమాచార మాధ్యమం మాత్రమేనని, ఆంగ్లభాషలో చదివినంత మాత్రాన ఎవరూ ఎక్కువ స్థాయికి ఎదగలేరని ఆయన స్పష్టం చేశారు.  మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ,  ప్రధాని నరేంద్రమోడీ వంటి వారు ఇందుకు ఉదాహరణగా నిలుస్తారన్నారు.   జపాన్, చైనా వంటి దేశాలు తమ త‌మ‌ మాతృ భాషలోనే  విద్య అభ్యసించి ఎదిగాయ‌న్నారు.  విద్యాదానం అన్నిదానాల కన్నా గొప్పదన్న సిద్ధాంతాన్ని నమ్మి ఆచరించి సరస్వతీ విద్యా మందిర్ సంస్థకు శతాబ్ది కాలం క్రితమే ఇంత పెద్ద స్థలాన్ని విరాళంగా ఇచ్చి దాత్రుత్వాన్ని చాటుకున్న వీరమాచినేని వీరాంజనేయ శాస్త్రి , మైనేని రాజగోపాలరావు, వెలగపూడి రామక్రుష్ణ , శీతారామయ్య గార్ల సామాజిక సేవా దృక్ప‌ధానికి ప్ర‌ణ‌మిల్లుతున్నాన‌నీ అన్నారు.

ఆస్తుల కబ్జా పెరిగింది

గతంలో విద్య ప్రాశస్త్యాన్ని తెలుసుకుని స్థలం రూపంలో కానీ, ఆర్థిక రూపేణా కానీ సహాయం అందించి వెన్నుదన్నుగా నిలబడిన మహానుభావులెందరో వున్నారన్నారు. ఈ సంస్కృతి కాలక్రమేణా తగ్గుముఖం పట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ సంస్కృతి మళ్ళీ రావాలని తాను కోరుకుంటున్నానన్నారు.   ఇలాంటి తరుణంలో దాతలు విద్యా సంస్థలకు సమకూర్చిన ఆస్తులను కబ్జా చేసే ప్రయత్నాలు గత ఐదేళ్లకాలంలో పెరిగిపోయాయన్నారు. దీన్ని అంతం చేసి విద్యా, వైద్య సౌకర్యాల కోసం దాదలు ముందుకొచ్చే సంస్క్రుతిని తీసుకు రావాల్సిన అవసరం ఎంతయినా వుందన్నారు. ఆంగ్లభాషపై మోజుతో అనేక పాఠశాలలు మూతపడుతున్న తరుణంలో మూతపడిన ఈ పాఠశాలను 2023లో పున:ప్రారంభించి ఆదర్శ పాఠశాలగా అభివ్రుద్ధి చేస్తున్న యాజమాన్యానికి, అందుకు సహకరిస్తున్న గజపతిరావుగారి వంటి విశ్రాంత ఉపాధ్యాయునికి తాను అభినందిస్తున్నాన్నారు.  దీనిని విస్తరించే కార్యక్రమంలో తన‌ను భాగస్వాములను చేసిన యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానన్నారు.  

రేపల్లెలో సౌకర్యాల అభివృద్ధిపై ఫోకస్

సరస్వతి విద్యా మందిర్ మాతృ సంస్థ అయిన విద్యాభారతి సంస్థ దేశంలో 24,128 పాఠశాలల్ని నిర్వహిస్తోందన్నారు. ఇటీవల ఒక అమెరికన్ సంస్థ నిర్వహించిన ఇంపాక్ట్ స్టడీలో సరస్వతీ విద్యా మందిర్ సంస్థలు కొన్ని కోట్ల కుటుంబాలలో వెలుగులు నింపిన విషయం బయటపడిందన్నారు. రేపల్లె ప్రాంతంలో వైద్య సౌకర్యాల అభివృద్ధిపై తాను దృష్టి పెడతానని రెవెన్యూ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ కు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు.
 ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎపిఎస్సార్టీసి చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, క‌మిటీ అధ్య‌క్షులు మ‌రియు క‌ర‌స్పాండెంట్ పి.ర‌మేష్ చంద్ర‌,  స‌ర‌స్వ‌తీ విద్యా పీఠం రాష్ట్ర కార్య‌ద‌ర్శి కొసం జ‌గ‌దీష్ తదితరులు  ఈ ప్రోగ్రాం లో పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget