Ishan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP Desam
నిన్న జరిగిన సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. కేవలం 47 బంతుల్లోనే 11 ఫోర్లు 6 సిక్సర్లతో 225 స్ట్రైక్ రేట్ తో 106 పరుగులు బాదాడు ఇషాన్ కిషన్. ఇది కిషన్ కెరీర్ లో ఫస్ట్ ఐపీఎల్ సెంచరీ. సెంచరీ పూర్తి చేయగానే సింహనాదం చేశాడు. గ్రౌండ్ లో కలియతిరుగుతూ పెద్ద పెద్దగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ముంబై తనను వద్దనుకుని వదిలేసినా తనపై నమ్మకంతో తనను ఆక్షన్ లో పాడుకుని అవకాశం ఇచ్చిన సన్ రైజర్స్ కు థాంక్స్ చెబుతూ డ్రెస్సింగ్ రూమ్ కి ఫ్లైయింగ్ కిసెస్ ఇచ్చాడు. ఇదంతా సరే ఇంతిలా ఇషాన్ కిషన్ సెలబ్రేట్ చేసుకోవటానికి రీజన్ ఇది అతని మొదటి ఐపీఎల్ సెంచరీ అనా. ఆన్సర్ కాదు అంటోంది సోషల్ మీడియా. ఇషాన్ కిషన్ వైల్డ్ సెలబ్రేషన్స్ వెనుక ఉన్నది బీసీసీఐ మీద కోపం. అసలేం జరిగింది ఓ రెండేళ్ల క్రితం జట్టులో స్థిరత్వం కోసం ఇషాన్ కిషన్ కి బ్యాకప్ గా ధృవ్ జురెల్, జితేశ్ శర్మలను తీసుకోవటం మొదలుపెట్టారు. ఇది నచ్చని ఇషాన్ కిషన్ తనకు డిప్రెషన్ వస్తోందని కొంచెం రెస్ట్ కావాలని ఉన్నపళంగా సిరీస్ నుంచి అర్థాంతరంగా వైదొలిగాడు. దీనిపై సీరియస్ అయిన బీసీసీఐ ఇషాన్ కిషన్ మళ్లీ టీమ్ లోకి రావాలంటే దేశవాళీ మ్యాచ్ లు ఆడి ఫిట్ నెస్ ను నిరూపించుకుని రావాలని అల్టిమేటం ఇచ్చింది. ఇది కేవలం ఇషాన్ కిషన్ కే కాదు అప్పట్లో శ్రేయస్ అయ్యర్ కి కూడా ఇచ్చింది. అయినా వాళ్లిద్దరూ దేశవాళీలు మ్యాచ్ లు ఆడకపోవటంతో ఆగ్రహించిన బీసీసీఐ పెద్దలు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ల సెంట్రల్ కాంట్రాక్టులు రద్దు చేశారు. మళ్లీ వాళ్లు తిరిగి టీమ్ లోకి రావాలంటే డొమెస్టిక్ మ్యాచ్ లు ఆడి తీరాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. అయితే శ్రేయస్ అయ్యర్ రంజీలు ఆడేసి తర్వాత టీమ్ లోకి వచ్చేశాడు ఛాంపియన్స్ ట్రోఫీ లాంటివి ఆడేశాడు అది వేరే విషయం. కానీ ఇషాన్ కిషన్ మాత్రం ఇప్పటి వరకూ బీసీసీఐ చెప్పింది చేయలేదు. ఫలితంగా 2024 లో టీ20 వరల్డ్ కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అవకాశాన్ని కోల్పోయాడు ఇషాన్ కిషన్ . రెండేళ్లుగా తనను పక్కనపెట్టిన బీసీసీఐకి తనేంటో చూపించాలనకోవాలనే కసితో రగిలిపోతున్న టైమ్ లో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ దొరికింది. అందుకే వేటకొచ్చిన పులిలా విరుచుకుపడిపోయాడు. కెరీర్ లోనే తొలి సెంచరీ బాది కసితీరా వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. మరి ఐపీఎల్ మరీ ఇరగదీస్తే ఇషాన్ కిషన్ ఆటపై ఇంప్రెస్ బీసీసీఐ ఓ మెట్టు దిగి ఇషాన్ కి మళ్లీ టీమిండియాలో చోటు కల్పిస్తుందా లేదా ఇలానే మొండిగా ఉంటుందా ఈ ఐపీఎల్ లో ఇషాన్ కిషన ఆడే మిగిలిన మ్యాచ్ లు ఓ సమాధానం ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.





















