Patanjali University Shastrotsav: హరిద్వార్‌లో పతంజలి యూనివర్శిటీ శాస్త్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం
Patanjali University Shastrotsav: సంస్కృతం కేవలం ఒక భాష మాత్రమే కాదని రామ్‌దేవ్ బాబా అభిప్రాయపడ్డారు. ఏ రంగంలోనైనా లీడర్లను అందిస్తుందని తెలిపారు.

Uttarakhand CM Dhami Takes Part In Patanjali University Shastrotsav: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని పతంజలి విశ్వవిద్యాలయంలో జరిగిన 62వ అఖిల భారత శాస్త్రోత్సవ ముగింపు వేడుకల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పుష్కర్ సింగ్ ధామి... మన గ్రంథాలు కేవలం పుస్తకాలు మాత్రమే కాదని, విశ్వ రహస్యాలు అర్థం చేసుకునే సాధనాలని అభిప్రాయపడ్డారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయం మూలాలు మన పురాతన గ్రంథాల్లో ఉన్నాయని సిఎం ధామి తెలిపారు. వీటిలో సైన్స్, యోగా, గణితం, వైద్యం, తత్వశాస్త్రంలోని జ్ఞాన నిధి ఉందని వివరించారు. ఋషులు నిర్వహించిన పరిశోధనలు సంరక్షించడమే కాకుండా దానిని కొత్త మార్గాల్లో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. సంస్కృతం, గ్రంథాల జ్ఞానాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడానికి అఖిల భారత శాస్త్రోత్సవం ఉపయోగించాలని కూడా ఆయన సూచించారు.
मुख्यमंत्री श्री पुष्कर सिंह धामी ने आज पतंजलि विश्वविद्यालय हरिद्वार में आयोजित 62वें अखिल भारतीय शास्त्रोत्सव के समापन समारोह में प्रतिभाग किया। इस अवसर पर मुख्यमंत्री ने कहा कि हमारे शास्त्र केवल ग्रंथ या किताब ही नहीं हैं बल्कि इस संपूर्ण सृष्टि के जितने रहस्य हैं उन रहस्यों… pic.twitter.com/AwFQ6eqvN0
— Uttarakhand DIPR (@DIPR_UK) March 21, 2025
సంస్కృతం భాష మాత్రమే కాదు : రాందేవ్
పతంజలి విశ్వవిద్యాలయ ఛాన్సలర్, యోగా గురువు బాబా రాందేవ్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. "సంస్కృతం కేవలం ఒక భాష కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ రంగంలోనైనా మంచి విషయాలను, మంచి నాయకత్వాన్ని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సనాతన ధర్మం, ప్రాచీన భారతీయ గ్రంథాలు ప్రపంచంలోని అన్ని విభాగాలకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి" అని ఆయన అన్నారు.
అఖిల భారత శాస్త్రోత్సవాన్ని సంస్కృతం, సంస్కృతి కలయికగా అవర్ణించిన స్వామి రాందేవ్, అన్ని మూల భాషలు సంస్కృతం నుంచి ఉద్భవించాయని గుర్తు చేశారు. మనమందరం ఈ విషయంలో గర్వపడాలని అన్నారు. సంస్కృత భాష ప్రచారాన్ని ప్రోత్సహించాలని చెప్పుకొచ్చారు. భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని పునర్‌వ్యాప్తి చేయాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.
భారతీయ సంస్కృతియే సంస్కృత: ఆచార్య బాలకృష్ణ
పతంజలి విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఆచార్య బాలకృష్ణ, సంస్కృతం ప్రాముఖ్యతను హైలైట్ చేశారు, దీనిని ఆధ్యాత్మిక యాత్రతో పోల్చారు. ఇది మన సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసేదిగా అభిప్రాయపడ్డారు. భారతీయ గ్రంథాల ప్రాముఖ్యత ప్రజలకు మరింతగా తెలియజేయడానికి చేసే ప్రయత్నాలు ఇకపై కూడా కొనసాగించాలని దేశవ్యాప్తంగా ఉన్న పండితులు, విద్యార్థులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
30 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర విద్యా మంత్రి రమేష్ పోఖ్రియాల్ కూడా 'నిశాంక్' వేడుకలో పాల్గొన్నారు. అక్కడ మాట్మలాడుతూ సంస్కృతంలో చాలా జ్ఞానం, సైన్స్, సాంకేతిక అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో సంస్కృతానికి రాజభాష హోదా కల్పించడంతోపాటు ఈ విషయంలో సాధించిన మరికొన్ని విజయాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో 30 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ముగింపు వేడుకల సందర్భంగా వారందర్నీ సత్కరించారు.





















