Patanjali Renogrit: అంతర్జాతీయ పరిశోధన జాబితాలో కిడ్నీ వ్యాధి ఔషధం 'రెనోగ్రిట్' - చారిత్రక విజయమన్న పతంజలి
Patanjali: పతంజలి తయారు చేసినా కిడ్నీ వ్యాధి మందు రెనోగ్రిట్ అంతర్జాతీయ పరిశోధనా జాబితాలో చేరింది. ఇది చారిత్రక విజయమని పతంజలి ప్రకటించింది.

Patanjali News: ఆయుర్వేద ఉత్పత్తులు , సహజ ఔషధాలను ప్రజలకు అదంించే సంస్థ పతంజలి శాస్త్రవేత్తలు పరిశోధన చేసి అభివృద్ధి చేసిన ఆయుర్వేద కిడ్నీ ఔషధం అయిన రెనోగ్రిట్‌తో ఒక ముఖ్యమైన మైలురాయిని అందుకుంది. ఈ ఔషధంపై ప్రపంచ ప్రసిద్ధ పరిశోధనా పత్రిక 'సైంటిఫిక్ రిపోర్ట్స్'పరిశోధనా పత్రం ప్రచురించింది. ఇది 2024 టాప్ 100 పరిశోధనా పత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని పతంజలి ప్రకటించింది. రెనోగ్రిట్ కిడ్నీ చికిత్స విజయం ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ గుర్తింపు లభించే దిశగా ఒక ప్రధాన అడుగు అని పతంజలి ఆచార్య బాలకృష్ణ సంతోషం వ్యక్తంచేశారు.
ఆయుర్వేద పరిశోధనలకు గుర్తింపు
పరిశోధనా పత్రిక సైంటిఫిక్ రిపోర్ట్స్ లో రీనోగ్రిట్ పై పరిశోధనా పత్రం ఇప్పటివరకు 2,568 సార్లు డౌన్‌లోడ్ చేశారు. ఆయుర్వేద మందులు వ్యాధులకు ప్రభావవంతమైన చికిత్సలు మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలలో ఉత్సుకత కలిగించే అంశంగా కూడా మారుతున్నాయని పతంజలి దీని ద్వారా నిరూపించింది. సైంటిఫిక్ రిపోర్ట్స్ 3.8 ఇంపాక్ట్ ఫ్యాక్టర్ కలిగి ఉంది. ప్రపంచంలో వైద్య రంగంలో పరిశోధకులు ఎక్కువగా చదివే 5వ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ . ఈ సంస్థ స్వచ్చందంగా రెనోగ్రిట్ ను పరిశోధించి రిపోర్టు తయారు చేసింది. దీన్ని అనేక మంది పరిశోధకులు చదువుతున్నారు.
'ఆయుర్వేద ఔషధాలకు సర్టిఫికేషన్ లభిస్తోంది': పతంజలి
ఆయుర్వేద మందులు వ్యాధులను నయం చేయడంలో విజయవంతమవుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. ఈ విషయాన్ని పతంజలి గట్టిగా చెబుతోంది. మూలికల నుండి తయారైన ఔషధం ఎటువంటి దుష్ప్రభావం లేకుండా అతిపెద్ద వ్యాధులను కూడా ఎలా నయం చేయగలదో శాస్త్రవేత్తలు ఆలోచించేలా ఆయుర్వేదం చేస్తోందన్నారు. రెనోగ్రిట్ క్యాన్సర్ చికిత్స ఔషధం సిస్ప్లాటిన్ వల్ల దెబ్బతిన్న మూత్రపిండాలను బాగు చేయడమే కాకుండా మూత్రపిండాల కణాలపై ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని పతంజలి ప్రకటించింది.
'ఆయుర్వేదం శాస్త్రీయ ప్రామాణికతకు ప్రపంచ గుర్తింపు': ఆచార్య బాలకృష్ణ
ఆయుర్వేద వైద్య విధానాలపై మన దేశంలో ప్రజలకు మంచి నమ్మకం ఉంది. ఇప్పుడీ వైద్య విధానాలు ప్రపంచవ్యాప్తం అయ్యేఅవకాశాలు ఉన్నాయి. యోగా గురువు బాబా రామ్‌దేవ్ సన్నిహితుడు , పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ "రెనోగ్రిట్ యొక్క ఈ విజయం ఆయుర్వేదాన్ని శాస్త్రీయంగా ధృవీకరించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని సంతోషం వ్యక్తంచేశారు. పురాతన భారతీయ శాస్త్రాన్ని ఆధునిక పద్ధతులతో పరీక్షించినప్పుడు, అద్భుతమైన ఫలితాలు తెరపైకి వస్తాయన్నారు. రెనోగ్రిట్ విజయం ఆయుర్వేదం క శాస్త్రీయ ప్రామాణికతకు ప్రపంచ గుర్తింపు పొందడంలో ఒక ముఖ్యమైన అడుగుగా ఆయన భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

