MS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP Desam
ధోని గురించి తెలిసిందేగా. మెరుపు వేగానికి మేనల్లుడు. ధోని వికెట్ల వెనుక ఉండగా క్రీజులో నుంచి కాలు కదిపావా అది బ్యాటర్లకు చావు కిందే లెక్క. ఎందుకంటే కనురెప్ప మూసి తెరిచే లోపు స్టంప్ చేయగల సామర్థ్యం ధోని సొంతం. నిన్న చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ లోనూ అంతే. సూర్య కుమార్ యాదవ్ ను రెప్పపాటు కాలంలో అవుట్ చేసి డగౌట్ కు పంపాడు మాహీ. మొదటి అసలే 36పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ముంబైను తిలక్ వర్మతో కలిసి సూర్య కుమార్ యాదవ్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. 26 బాల్స్ లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ తో 29 పరుగులు చేశాడు. ఈ దశలో నూర్ అహ్మద్ బౌలింగ్ లో మెరుపు స్టంపింగ్ చేశాడు ధోని. సూర్య కుమార్ యాదవ్ నూర్ అహ్మద్ బౌలింగ్ లో క్రీజు వదిలే వెళ్లే అవకాసం ఉందని భావించిన ధోని వికెట్లకు చాలా దగ్గరగా నిలబడ్డాడు. ఇది గమనించని సూర్యా భాయ్ నూర్ అహ్మద్ బౌలింగ్ ను ఎదుర్కొనే ప్రోసెస్ లో కొంచెం ముందుకు వెళ్లి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అంతే బాల్ సూర్య బ్యాట్ ను మిస్ అవ్వటం వెనుకాల ఉన్న ధోని చేతుల్లోకి వెళ్లటం క్షణకాలంలో స్టంప్ అవుట్ చేయటం అన్నీ జరిగిపోయాయి. ధోని ఆ స్టంప్ మీద ఎంత కాన్ఫిడెంట్ అంటే అసలు లెగ్ అంపైర్ కి అప్పీల్ కూడా చేయకుండా బాల్ పక్కన పడేసి సెలబ్రేషన్ కి వెళ్లిపోయాడు. మరో వైపు సూర్య కుమార్ యాదవ్ కూడా అంతే. అంపైర్ డెసిషన్ కోసం వెయిట్ చేయకుండా డగౌట్ వైపు నడక మొదలు పెట్టాడు. అదీ ధోని స్టంపింగ్ పవర్ అంటే. ఇంతకీ ఎంత వేగంతో స్టంప్ అవుట్ చేశాడో ధోని. కేవలం 0.12 సెకన్లు మాత్రమే. కన్ను రెప్ప మూసి తెరవటానికే 3సెకన్ల టైమ్ పడుతుంది అలాంటి సెకన్ లో స్టంపింగ్ అంటే అది కూడా 43ఏళ్ల వయస్సులోనూ ధోని కళ్లు పనిచేస్తున్న వేగానికి చేతికి కంటికి మధ్య సమన్వయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అందుకే ఆయన మెరుపువేగానికి మేనల్లుడు. వికెట్ల వెనుక ఆయన ఉండగా గీత దాటావా ఎంతటి బ్యాటర్ కైనా చావు తప్పదు





















