MS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP Desam
నిన్న జరిగిన చెన్నై వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ధోనికి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి. అలాంటి మూమెంట్స్ కోసమే మ్యాచ్ కి వచ్చే ధోని అభిమానులకు అవి నిజంగా పండుగ లాంటివనే చెప్పాలి. ముందుగా మ్యాచ్ కి ముందు ధోని చెపాక్ స్టేడియంలో కలియ తిరుగుతూ ఫుట్ బాల్ ఆడాడు. ధోనీ అందరిలా మ్యాచ్ కి ముందు క్రికెట్ ప్రాక్టీస్ చేయడు. కాసేపు ఫుట్ బాల్ తో ప్రాక్టీస్ చేసి తర్వాత వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేసి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోతాడు. నిన్న మ్యాచ్ లో ముంబై చెన్నైపై పూర్తిగా విఫలమైనా ఇద్దరు మాత్రం చెన్నైను కాస్త ఇబ్బంది పెట్టారు. వాళ్లే బ్యాటింగ్ లో దీపక్ చాహర్ బౌలింగ్ లో యంగ్ స్పిన్నర్ విఘ్నేశ్ పుత్తూరు. కనీసం 120 అయినా దాటుతుందా అన్న డౌట్ ఉన్న ముంబై ఇండియన్స్ స్కోరు...155 పరుగులకు చేరుకుందంటే రీజన్ దీపక్ చాహర్. మొన్నటి దాకా సీఎస్కేలోనే ఉన్న దీపక్ చాహర్ ఈ సీజన్ నుంచి ముంబైకి ఆడుతున్నాడు. ఆడుతున్న ఫస్ట్ మ్యాచ్ లోనే 15 బాల్స్ లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 పరుగులు చేసి ముంబైకి కాస్త గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు చెర్రీ. బౌలింగ్ లోనూ రాహుల్ త్రిపాఠీని అవుట్ చేసి కాస్త వైల్డ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు చాహర్. ఇవన్నీ గమనిస్తూనే ఉన్న ధోని మ్యాచ్ అయిపోయాక అందరూ ఫ్రెండ్లీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు కదా అప్పుడు దీపక్ చాహర్ కు బ్యాట్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. తన బ్యాట్ తో చాహర్ ను ఒక్కటిస్తాను అన్నట్లు బెదిరించి నవ్వించాడు ధోనీ. మరో వైపు సీఎస్కే ఛేజింగ్ లో కాస్త టెన్షన్ పడేలా చేసి మూడు వికెట్లు తీసి ముంబై బౌలర్లలో పర్వాలేదనిపించిన యంగ్ స్పిన్నర్ విఘ్నేశ్ పుత్తూరు ను ధోని ప్రత్యేకంగా అభినందించాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వటానికి వచ్చిన విఘ్నేశ్ ను భుజం మీద తడుతూ చాలా బాగా బౌలింగ్ చేశావ్ కీప్ ఇట్ అప్ అంటూ అప్రిషియేట్ చేశాడు. ధోని లాంటి లెజెండ్ నుంచి అలాంటి ప్రశంసలు రావటంతో ఫుల్ ఖుష్ అయిపోయాడు విఘ్నేశ్. ఆ కేరళ యువ స్పిన్నర్ కి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ ఇది. తన బ్యాటింగ్ చూద్దామని వచ్చిన అభిమానులను ఎంటర్ టైన్ చేయటానికి బ్యాటింగ్ కూ దిగిన ధోని.,కేవలం రెండు బాల్ే ఆడినా రెండింటినీ డాట్ చేశాడు. కానీ ధోనీ క్రీజులోకి రాగానే చెపాక్ స్టేడియం హోరెత్తి పోయింది. 122 డెసిబల్స్ గా సౌండ్ మీటర్ లో ధోని కోసం ఫ్యాన్స్ అరిచిన అరుపులు రికార్డ్ అయ్యాయి. సో అదీ ధోని అంటే అవీ ధోని ఫ్యాన్స్ కి అందించే క్యూట్ మూమెంట్స్ అంటే





















