By: Arun Kumar Veera | Updated at : 24 Mar 2025 10:33 AM (IST)
ఈ రోజు బంగారం, వెండి ధరలు 24 మార్చి 2025 ( Image Source : Other )
Latest Gold-Silver Prices Today: అమెరికన్ డాలర్ బలపడడంతో పాటు ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చన్న అంచనాలతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు చల్లబడింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 3,023 డాలర్ల దగ్గర ఉంది. ఈ రోజు మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 160 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 150 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 120 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి ధర 100 రూపాయలు తగ్గింది. పన్నులతో కలుపుకుని, ప్రస్తుతం, 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ (24K) ధర రూ. 90,600 వద్ద ఉంది & కిలో వెండి రూ. లక్ష ధర పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana) (పన్నులు లేకుండా)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,620 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,150 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 67,220 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,00,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh) (పన్నులు లేకుండా)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,620 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 82,150 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 67,220 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,00,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 89,620 | ₹ 82,150 | ₹ 67,220 | ₹ 1,00,000 |
విజయవాడ | ₹ 89,620 | ₹ 82,150 | ₹ 67,220 | ₹ 1,00,000 |
విశాఖపట్నం | ₹ 89,620 | ₹ 82,150 | ₹ 67,220 | ₹ 1,00,000 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 8,215 | ₹ 8,962 |
ముంబయి | ₹ 8,215 | ₹ 8,962 |
పుణె | ₹ 8,215 | ₹ 8,962 |
దిల్లీ | ₹ 8,230 | ₹ 8,977 |
జైపుర్ | ₹ 8,230 | ₹ 8,977 |
లఖ్‌నవూ | ₹ 8,230 | ₹ 8,977 |
కోల్‌కతా | ₹ 8,215 | ₹ 8,962 |
నాగ్‌పుర్ | ₹ 8,215 | ₹ 8,962 |
బెంగళూరు | ₹ 8,215 | ₹ 8,962 |
మైసూరు | ₹ 8,215 | ₹ 8,962 |
కేరళ | ₹ 8,215 | ₹ 8,962 |
భువనేశ్వర్ | ₹ 8,215 | ₹ 8,962 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 7,894 | ₹ 8,526 |
షార్జా (UAE) | ₹ 7,894 | ₹ 8,526 |
అబు ధాబి (UAE) | ₹ 7,894 | ₹ 8,526 |
మస్కట్ (ఒమన్) | ₹ 8,013 | ₹ 8,549 |
కువైట్ | ₹ 7,732 | ₹ 8,433 |
మలేసియా | ₹ 8,196 | ₹ 8,526 |
సింగపూర్ | ₹ 8,082 | ₹ 8,898 |
అమెరికా | ₹ 7,860 | ₹ 8,354 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 10 పెరిగి రూ. 27,040 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
Costly Palace: అంబానీల ఆంటిలియా కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళ - భవనం ప్రత్యేకతలు బోలెడు
Unified Pension Scheme: మరో 10 రోజుల్లో 'ఏకీకృత పింఛను పథకం' - ఇలా దరఖాస్తు చేసుకోండి
Toll Deducted Twice: టోల్ గేట్ దగ్గర రెండుసార్లు డబ్బు కట్ అయ్యిందా? - ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది
Gold-Silver Prices Today 22 Mar: రూ.90,000కు దిగొచ్చిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
UPI Payment: ఏప్రిల్ 1 నుంచి ఈ మొబైల్ నంబర్లలో UPI పని చేయదు, చెల్లింపులన్నీ బంద్
Hyderabad Crime News: ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
Dhoni Magic Stumping: మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
CM Chandrababu: పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy