Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Robinhood Movie: నితిన్, శ్రీలీల లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నితిన్ మాస్ యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా.. వార్నర్ ఎంట్రీ సీన్ అదిరిపోయింది.

Nithiin's Robinhood Movie Trailer Released: యంగ్ హీరో నితిన్ (Nithiin), స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) లీడ్ రోల్స్‌లో నటించిన అవెయిటెడ్ మూవీ 'రాబిన్ హుడ్' (Robinhood) ట్రైలర్ వచ్చేసింది. ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేతుల మీదుగా మూవీ టీం ట్రైలర్ లాంఛ్ చేసింది. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. నిజానికి ఈ నెల 21న ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది.
ట్రైలర్ చూస్తే గూస్ బంప్సే..
యాక్షన్, కామెడీ, లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో నితిన్ కామెడీ టైమింగ్, డైలాగ్స్ అదిరిపోయాయి. ఈ మూవీలో నితిన్ ఓ ప్రొఫెషనల్ దొంగగా కనిపించనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డుగా పని చేస్తూనే డిఫరెంట్ వేషాలు వేస్తూ.. సైబర్ టెక్నిక్స్ ఉపయోగించి దొంగతనాలు చేస్తుంటాడని అర్థమవుతోంది. మాస్క్ ముసుగులో చాలా తెలివిగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతుంటాడు. సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్‌గా రాజేంద్ర ప్రసాద్ నటిస్తుండగా.. ఓ ప్రముఖ ఫార్మాస్యూటికల్ ఎండీ కుమార్తెగా శ్రీలీల కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది.
Also Read: ఆ థంబ్‌నైల్స్ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
'కరోనా వస్తే 14 రోజులు క్వారంటైన్.. అదే నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్' అంటూ నితిన్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. నితిన్ మాస్ యాక్షన్ వేరే లెవల్‌గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీలకు సెక్యూరిటీ ఇచ్చే బాధ్యతను తీసుకుంటూనే.. మరోవైపు రాబరీస్ చేస్తుంటాడు నితిన్. అసలు ఆ ఫార్మా స్యూటికల్‌కు నితిన్‌కు సంబంధం ఏంటి.?, ఎందుకు రాబరీస్ చేస్తుంటాడు.?, అసలు ఆ ఫార్మా స్యూటికల్ వెనుక ఏం జరుగుతుంది..?. వార్నర్ రోల్ ఏంటి.? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.
వార్నర్ ఎంట్రీ అదుర్స్..
ట్రైలర్‌లో వార్నర్ ఎంట్రీ అదిరిపోయింది. హెలికాఫ్టర్ నుంచి నోట్లో లాలీపాప్ పెట్టుకుని ఫుల్ సెక్యూరిటీతో స్టైలిష్ లుక్‌లో వార్నర్ దిగే సీన్ హైలెట్‌గా నిలిచింది.
ROBINHOOD IS HERE with an explosive package of fun, entertainment and adventure 💥💥#RobinhoodTrailer out now!
— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2025
▶️ https://t.co/h2nhPhMrqE
Don't miss the ending 💥💥#Robinhood GRAND RELEASE WORLDWIDE ON MARCH 28th.@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @davidwarner31… pic.twitter.com/q4x6W1TJcq
'భీష్మ' వంటి హిట్ తర్వాత నితిన్, వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబోలో వస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్, ఫస్ట్ లుక్స్ భారీగా హైప్ పెంచేశాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఆయన ఈ సినిమాతోనే నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. మూవీలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారు. కేతిక శర్మ స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తుండగా.. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై.. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ నెల 28న 'రాబిన్ హుడ్' థియేటర్లలోకి రానుంది.





















