Gayatri Bhargavi: ఆ థంబ్‌నైల్స్ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
Gayatri Bhargavi Husband Vikram: ఓ మీడియా సంస్థ తీరు పట్ల, ప్రముఖ యాంకర్ నిర్లక్ష్యం పట్ల నటి గాయత్రీ భార్గవి ఆవేదన చెందారు. ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

యూట్యూబ్ వీడియోలకు కొందరు ఉపయోగించే థంబ్ నైల్స్ పట్ల పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ జాబితాలో ఇప్పుడు నటి గాయత్రి భార్గవి చేరారు. ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వగా... మిస్ లీడింగ్ థంబ్ నైల్స్ పెట్టారని, ఇప్పటికి రెండు సార్లు చెప్పినా వినిపించుకోలేదని ఆవిడ ఆవేదన చెందారు. ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
ఇంటర్వ్యూలో చెప్పింది ఒకటి...
భర్త ఫోటోతో థంబ్ నైల్ మ్యాటర్!
గాయత్రి భార్గవి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఇప్పటికీ కొన్ని పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అంతే కాదు... పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. మూడు నాలుగు నెలల క్రితం ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు.
గాయత్రి భార్గవి భర్త పేరు విక్రమ్. ఆయన ఆర్మీ అధికారి. అందువల్ల దేశంతో పాటు ప్రజల రక్షణ కోసం పాటు పడే ఆర్మీ కష్టాలు ఎలా ఉంటాయో ఆమెకు బాగా తెలుసు. ఆర్మీ అధికారులు, జవాన్లలో కొందరు మంచు కొండల్లో విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించిన సందర్భాలు ఆమెకు తెలుసు. అటువంటి ఒక విషాదకర ఘటన గురించి ఇంటర్వ్యూలో గాయత్రి భార్గవి పంచుకున్నారు.
Also Read: అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?
గాయత్రి భార్గవి ఇంటర్వ్యూలో చెప్పింది ఒకటి అయితే... ఆవిడ భర్త విక్రమ్ మరణించినట్లు అర్థం వచ్చేలా మిస్ లీడ్ చేస్తూ థంబ్ నైల్ డిజైన్ చేశారు. కుటుంబంతో పాటు భర్తతో గాయత్రీ భార్గవి దిగిన ఫోటోలు వాడారు. సదరు థంబ్ నైల్ పట్ల ఆవిడ అభ్యంతరం వ్యక్తం చేయక డిలీట్ చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్లీ మిస్ లీడింగ్ థంబ్ నైల్ యూజ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో వాళ్ళ తీరుని ఎండగడతో గాయత్రి భార్గవి ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆర్మీకి మీరిచ్చే గౌరవం ఇదేనా?
మా ఆయన విక్రమ్ బతికే ఉన్నారు
మిస్ లీడింగ్ థంబ్ నైల్స్ పట్ల అసహనం వ్యక్తం చేసిన గాయత్రి భార్గవి వీడియోలో తన భర్తను చూపించారు. ఆర్మీకి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ సదరు మీడియా సంస్థను ప్రశ్నించారు. సారీ విక్రమ్ అంటూ భర్తను క్షమాపణలు కోరారు. ఆర్మీ అంటే సదరు యూట్యూబ్ మీడియా సంస్థకు ఎంత గౌరవం ఉందనేది ఆ వీడియో థంబ్ నైల్ చూస్తే అర్థం అవుతోందని విక్రమ్ చెప్పారు. నిర్మాత ఎస్కేఎన్ సైతం అటువంటి థంబ్ నైల్స్ చూడడం విచారకరమని ట్వీట్ చేశారు.
View this post on Instagram
ఫాల్స్ కంటెంట్ స్ప్రెడ్ చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని గాయత్రి భారవి చెప్పారు. తన అత్తమామలు, అమ్మతో కలిసి జీవిస్తున్నామని, తనది ఉమ్మడి కుటుంబం అని, ఇటువంటి థంబ్ నైల్ పెట్టడం వల్ల రోజుకు 70 నుంచి 100 ఫోన్ కాల్స్ వస్తున్నాయని గాయత్రి భార్గవి తెలిపారు. మీడియాకు జవాబుదారీ తనం ఉండాలని ఆవిడ తెలిపారు.
Also Read: ఎవరీ మహీరా శర్మ? సిరాజ్‌తో డేటింగ్ రూమర్లతో వైరల్... ఆవిడ ఏం చేసిందో తెలుసా?





















