Battula Prabhakar: రూ.3 కోట్లు, 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేయడమే టార్గెట్ - టాటూ ఆధారంగా ట్రేస్, వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు
Hyderabad News: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. అతని ఛాతీపై టాటూల ఆధారంగా పోలీసులు కీలక విషయాలు గుర్తించారు.

Police Found Sensational Issues In Wanted Criminal Battula Prabhakar Case: తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌కు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు జైలుకు తరలించారు. ఈ కేసు విచారణలో పోలీసులకు విస్తుపోయే అంశాలు తెలిశాయి. ప్రభాకర్ ఛాతీపై ఉన్న టాటూ ఆధారంగా కీలక విషయాలు ఛేదించారు. ఇంజినీరింగ్ కాలేజీలే టార్గెట్‌గా ప్రభాకర్ చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. సుమారు రూ.రెండున్నర కోట్ల వరకూ కాజేయగా.. రూ.3 కోట్లు చోరీ చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. 9 పేర్లు మార్చుకుని కొట్టేసిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న ప్రభాకర్.. దాదాపు 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. చోరీల విషయంలో ఎవరైనా తనకు అడ్డొస్తే కాల్పులు జరిపేందుకు హైదరాబాద్ శివారులో షూటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు విచారణలో తేలింది. తన టార్గెట్స్ అన్నింటినీ సినిమా లెవల్లో బోర్డుపై స్క్రిప్ట్ రాసుకుని మరీ ప్లాన్ అమలు చేసినట్లు పోలీసులు తేల్చారు.
రూ.3 వేల నుంచి మొదలై..
చిత్తూరు జిల్లా (Chittor District) ఇరికిపెంటకు చెందిన ప్రభాకర్ 8వ తరగతిలోనే చదువు ఆపేసి దొంగతనాలు మొదలుపెట్టాడు. తొలుత రూ.3 వేల దొంగతనంతో మొదలైన అతని క్రైమ్ హిస్టరీ నేడు రూ.కోట్లకు పడగలెత్తింది. విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండటం, అమ్మాయిలతో డేటింగ్, స్నేహితుల పేర్లతో రిజిస్టర్ చేయించి హై-ఎండ్ కార్లను వాడినట్లు విచారణలో తేలింది. నార్సింగిలోని అతని ఫ్లాట్‌లో రూ.50,000 విలువైన మద్యం, జిమ్ సెటప్, ఖరీదైన గాడ్జెట్లను పోలీసులు గుర్తించారు. 2022 మార్చిలో విశాఖ జైలు నుంచి పరారైన అతనిపై ఏపీ, తెలంగాణ సహా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 80కి పైగా కేసులున్నాయి. కేవలం 11 చోరీల్లోనే రూ.2.5 కోట్లు కొట్టేశాడు. మూడేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నిందితుడు ప్రభాకర్‌ను 2 రోజుల క్రితం ప్రిజం పబ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 4 తుపాకీలు, 450 బులెట్లు స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే.?
హైదరాబాద్‌లోని మొయినాబాద్, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోరీలకి సంబంధించి విచారణ చేపట్టిన అధికారులు.. ఘటనాస్థలిలో లభించిన వేలిముద్రలు, సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ కేసులో అనుమానితుడు 2023 నుంచి పరారీలో ఉన్న ఓ కరడుగట్టిన నేరస్థుడు బత్తుల ప్రభాకర్‌గా నిర్థారించి అతని కదలికలపై నిఘా ఉంచారు. ప్రభాకర్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌కు వస్తాడని తెలుసుకుని ఐటీ కారిడార్‌లోని పబ్‌ల సిబ్బంది, బౌన్సర్లకు నిందితుడి ఫొటోలిచ్చి ఆచూకీ తెలిస్తే సమాచారమివ్వాలని సూచించారు. శనివారం సాయంత్రం నిందితుడు పబ్‌కు వచ్చాడని తెలుసుకుని అక్కడికి వెళ్లి పట్టుకునేందుకు యత్నించగా పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు. రెండు రౌండ్ల కాల్పులు జరపగా.. సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డితో పాటు ఓ బౌన్సర్‌కు గాయాలయ్యాయి. అయినప్పటికీ పోలీసులు ప్రభాకర్‌ను చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడు చోరీ చేసే ముందు రెక్కీ నిర్వహిస్తాడని.. పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్ వీడియోలు చూస్తాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
Also Read: Crime News: సినిమాకు వెళ్లేందుకు డబ్బులివ్వలేదని మైనర్ ఆత్మహత్య - నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















