L2 Empuraan Trailer: 'సలార్' రేంజ్ ఎలివేషన్స్‌తో దుమ్మురేపుతున్న 'ఎల్2 ఎంపురాన్' ట్రైలర్... మోహన్ లాల్, పృథ్వీరాజ్ కుమ్మేశారుగా
L2 Empuraan Trailer : పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న 'L2 ఎంపురాన్'. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు.

2019లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ 'లూసిఫర్'. మూడు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ఈ ఫ్రాంచైజీలో రెండో భాగం 'L2 ఎంపురాన్'. ఫస్ట్ పార్ట్ ను మించిన ట్విస్టులు, టర్నులు, పొలిటికల్ స్ట్రాటజీతో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 27న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా పాన్ ఇండియా భాషల్లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ లో మోహన్ లాల్ నట విశ్వరూపం
శత్రువులందరూ ఏకమై హీరో కాపాడుతున్న రాజ్యంపై యుద్ధానికి సిద్ధమైతే ఏం ఏం జరిగింది? హీరో వీరి పన్నాగాలను ఎలా తిప్పి కొట్టాడు ? అనే క్యూరియాసిటీని పెంచింది ట్రైలర్. అందులో ఉన్న "నా బిడ్డలు కారు నన్ను ఫాలో అయితే.. నన్ను ఫాలో అయినవాళ్లే నా బిడ్డలు... పి.కె.రాందాస్‌గారు మిగిల్చి వెళ్లిన ఈ యుద్ధంలో ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా కూల్చాలని ప్రయత్నించింది నా ముందు నిల్చుని ఎదిరించిన శత్రువులు కాదు... మనుషుల ప్రాణాల కంటే ఓ రక్త సంబంధానికైనా విలువ ఉంటుందని నేను అనుకోను... చీకటి గ్రహాల ఎంపురాన్... కేరళ రాష్ట్రంలో ఓ సాధారణ ఎమ్మెల్యే, అతన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మనకు తెలియంది ఏదో స్టీఫెన్ నెడుంపల్లి కథలో ఉంది... దైవపుత్రుడే అన్యాయం చేస్తున్నప్పుడు సైతాన్ ను కాకుండా ఎవర్ని సాయం అడగగలం" వంటి పవర్ ఫుల్ డైలాగులు, ట్రైలర్ లో ఉన్న దుమ్మురేపే యాక్షన్ సన్నివేశాలు అంచనాలను అమాంతం పెంచాయి. ఇక ఈ మూవీ నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి.
తొలిసారిగా ఐమ్యాక్స్ వెర్షన్‌లో ట్రైలర్
'L2: ఎంపురాన్' ట్రైలర్ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచగా, పృథ్వీరాజ్ సుకుమార్ సృష్టించిన అద్భుతమైన ప్రపంచాన్ని తెరపై చూడటానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఐనాక్స్ మెగాప్లెక్స్, ఇనార్బిట్ మాల్, మలాడ్, ముంబై వేదికలుగా సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే తొలిసారిగా ఐమ్యాక్స్ వెర్షన్ లో ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయడం విశేషం. కాగా ఈ మూవీలో మోహన్ లాల్ ఖురేషి-అబ్రామ్ అలియా స్టీఫెన్ నెడుంపల్లిగా మరోసారి మాస్ అవతార్ లో కన్పించనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, టోవినో థామస్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, ఓ'నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ ఈ మూవీతో ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
'L2: ఎంపురాన్' చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తూనే, ఇందులో కీలక పాత్రను పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ చేయనుంది. హిందీలో ఏఏ ఫిల్మ్స్, కర్ణాటకలో హోంబలే ఫిల్మ్స్, తమిళనాడులో శ్రీ గోకులం మూవీస్ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

