Thaman On Game Changer: 'గేమ్ ఛేంజర్'లో చరణ్ స్టెప్స్ కంటే ఇవి 1000 రెట్లు బెటర్... తమన్ అంత మాట అనేశాడేంటి?
Thaman : 'గేమ్ ఛేంజర్' మూవీపై ఇప్పటికే తమన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో కంటే ఈ స్టెప్స్ 1000 రెట్లు బెటర్ అంటూ తమన్ ఓ డ్యాన్స్ షోలో కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజియెస్ట్ సంగీత దర్శకులలో ఒకరు. పాన్ ఇండియా సినిమాలకు మోస్ట్ వాంటెడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఓవైపు వరుసగా సినిమాలకు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తూనే... మరోవైపు పలు షోలకి గెస్టుగా కూడా తమన్ హాజరవుతున్నారు. తాజాగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'డాన్స్ ఐకాన్ 2' లేటెస్ట్ షోలో తమన్ మరోసారి 'గేమ్ ఛేంజర్' సాంగ్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "గేమ్ ఛేంజర్ కంటే ఈ స్టెప్స్ 1000 రెట్లు బాగున్నాయి. ఇవే స్టెప్స్ సినిమాలో ఉంటే బాగుండేదని కోరుకుంటున్నాను" అంటూ ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారు.
మరోసారి 'గేమ్ ఛేంజర్'ను టార్గెట్ చేసిన తమన్
తాజాగా తమన్ 'డాన్స్ ఐకాన్ 2' షో లేటెస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వెళ్లారు. ఇందులో తమన్ ఎంట్రీ ఇవ్వగానే శేఖర్ మాస్టర్ "ఫరియా డ్రెస్, మీ డ్రెస్ ఒకేలా ఉంది" అంటూ పంచ్ వేశారు. దీంతో తమన్ "ఎందుకు... ఇది షో తో ఆగదు... ఆ తర్వాత కూడా ఫరియాతో" అంటూ సెటైర్ వేశారు. ఇక తమన్ గెస్ట్ కావడంతో ఆయన బ్లాక్ బస్టర్ సాంగ్స్ కు కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముందుగా 'గుంటూరు కారం' సినిమాలోని 'కుర్చీ మడత పెట్టి' పాటకి ఓ అమ్మాయి వేసిన స్టెప్పులకి తమన్ ఫిదా అయ్యారు. "మీరు పిలవాల్సింది నన్ను కాదు శ్రీలీలని. తప్పకుండా నేను ఈ వీడియో మహేష్ బాబు గారికి చూపిస్తాను" అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
అలాగే ఆయన 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మరో కంటెస్టెంట్ 'గేమ్ ఛేంజర్' సినిమాలోని 'నానా హైరానా' పాటకి డాన్స్ చేసింది. ఆ తర్వాత ఇంకో చిన్నారి 'జరగండి జరగండి' పాటకు స్టెప్పులతో దుమ్మురేపింది. ఈ నేపథ్యంలోనే తమన్ "సినిమాలో ఉన్న స్టెప్స్ కంటే వెయ్యి రెట్లు ఈ స్టెప్స్ బాగున్నాయి.. సినిమాలో కూడా ఇదే డాన్స్ ఉంటే బాగుండేది" అంటూ కామెంట్ చేశారు. 'గేమ్ ఛేంజర్' మూవీలో డాన్స్ బాలేదంటూ తమన్ కామెంట్ చేయడం ఇదే మొదటిసారి. నిన్నటికి నిన్న ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా సాంగ్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Also Read: టెస్లా కారుకు 'మెగాస్టార్'... టెక్సాస్‌లో చిరు వీరాభిమాని డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ రేర్ ఫీట్
'గేమ్ ఛేంజర్'కు కొరియోగ్రఫీ పెద్ద మైనస్
'గేమ్ ఛేంజర్' పాటల గురించి తమన్ మాట్లాడుతూ "ఈ మూవీ మ్యూజిక్ ఫెయిల్యూర్ కు నేనే కారణం అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అసలు కారణం వేరే ఉంది. గేమ్ ఛేంజర్ సాంగ్స్ లో ఒక్క హుక్ స్టెప్ కూడా లేదు. పాటకు తగ్గట్టుగా ఆకట్టుకునే డాన్స్ ఉంటేనే సాంగ్స్ హైలెట్ అవుతాయి. గతంలో నేను చేసిన అల వైకుంఠపురంలో సినిమాలో పాటలు హిట్ అవ్వడానికి మ్యూజిక్ తో పాటు ఆ పాటలో ఉన్న హుక్ స్టెప్స్ కూడా ఒక కారణం. కానీ గేమ్ ఛేంజర్ మూవీలో అది మిస్సయింది. నేను మ్యూజిక్ ద్వారా ప్రతిపాటకు 20 మిలియన్లకు పైగా వ్యూస్ తీసుకురాగలను. కానీ అంతకుమించి వ్యూస్ రావాలంటే అదిరిపోయే స్టెప్పులు ఉండాల్సిందే. అయితే అలా జరగాలంటే అది కొరియోగ్రాఫర్ పైనే ఆధారపడి ఉంటుంది" అంటూ 'గేమ్ ఛేంజర్' మ్యూజిక్ ఫెయిల్యూర్ కి కొరియోగ్రాఫర్ ను బ్లేం చేశారు తమన్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

