Allu Arjun: బాలీవుడ్ హీరోలెవరు ఇప్పటి వరకు అలా చేయలేదు... అల్లు అర్జునే ఫస్ట్ హీరో
Ganesh Acharya on Allu Arjun: ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య బాలీవుడ్ హీరోలకు, అల్లు అర్జున్ కు మధ్య ఉన్న ఒక వ్యత్యాసాన్ని చెప్పారు. ఆయన మాటలు హిందీ సినిమా వర్గాలలో వైరల్ అవుతున్నాయి.

గణేష్ ఆచార్య (Ganesh Acharya) పేరు తెలుగు ప్రేక్షకులలోనూ కొంత మందికి తెలుసు. ఆయన పాపులర్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'పుష్ప' (Pushpa Movie)లో పాటలకు కూడా కొరియోగ్రఫీ అందించారు. ఇక ఈ నృత్య దర్శకుడు హిందీలో ఎన్ని సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేశారనేది చెబితే పెద్ద లిస్టు ఉంటుంది. ఇప్పుడీ కొరియోగ్రాఫర్ బాలీవుడ్ హీరోలకు, బన్నీకి మధ్య ఉన్న ఒక వ్యత్యాసాన్ని చెప్పారు. ఆయన మాటలు హిందీ సినిమా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలు ఎవరు అలా చేయలేదు!
టాలీవుడ్ టాప్ డాన్సర్స్ లిస్టు తీస్తే... మొదటి ఐదుగురులో అల్లు అర్జున్ (Allu Arjun) పేరు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. తన డాన్స్, తన స్టెప్స్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులు కింద మార్చుకున్నారు. 'పుష్ప', 'పుష్ప 2' సినిమాలతో అల్లు అర్జున్ డాన్స్ ఎలా ఉంటుందనేది హిందీ ప్రేక్షకులకు సైతం తెలిసింది. ఆల్రెడీ కొంత మంది డబ్బింగ్ సినిమాల్లో పాటలు చూసి తెలుసుకున్నారు అనుకోండి. పుష్ప డైరెక్ట్ థియేట్రికల్ రిలీజ్ కనుక మరింత ఎక్కువ మందికి చేరువయ్యింది. ఈ సినిమాలో కొన్ని పాటలకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు.
ఒక హిందీ మీడియా సంస్థకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి గణేష్ ఆచార్య మాట్లాడుతూ... ''నేను పుష్ప సినిమాలో పాటలకు కొరియోగ్రఫీ చేయడం మొదలు పెట్టిన ఐదు రోజులకు అల్లు అర్జున్ నుంచి ఫోన్ వచ్చింది. నా డాన్స్ స్టెప్స్, కొరియోగ్రఫీని ఆయన బాగా మెచ్చుకున్నారు. కొరియోగ్రఫీ ద్వారా మ్యాజిక్ చేశానని చెప్పారు. నా కృషిని ఆయన గుర్తించడం చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలు ఎవరు అలా ఫోన్ చేసి నన్ను అప్రిషియేట్ చేసిన సందర్భం లేదు. అల్లు అర్జున్ ఫస్ట్ హీరో నాకు స్వయంగా ఫోన్ చేసి మెచ్చుకున్నది'' అని చెప్పారు.
'పుష్ప 2 ది రూల్' (Pushpa 2 The Rule) సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు నమోదు చేసింది. కలెక్షన్స్ 1800 కోట్లకు పైగా వచ్చాయి. అంతటి భారీ విజయం సాధించిన తర్వాత ఎవరి దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తారనేది ప్రశ్నగా మిగిలింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ అది ఆలస్యం అవుతోంది. షారుక్ ఖాన్ హీరోగా తీసిన 'జవాన్' సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన దర్శకుడు అట్లీ పేరు వినిపించినప్పటికీ... అది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. బడ్జెట్ కారణాల దృష్ట్యా ఆ సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు. అల్లు అర్జున్ కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అభిమానులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

