Star Maa Serials TRP Ratings: 'జీ తెలుగు'లో చామంతి టాప్... మరి, 'స్టార్ మా'లో? ఈ వీక్ టీఆర్పీ లిస్టులో టాప్ 10 సీరియల్స్ ఏవో తెలుసా?
Telugu Serials TRP Ratings: 'జీ తెలుగు'లో 'చామంతి' సీరియల్ టాప్‌లో ఉంది. మరి, 'స్టార్ మా'లో ఏమున్నాయ్? ఈ వీక్ టీఆర్పీ లిస్టులో టాప్ 10 తెలుగు సీరియల్స్ ఏమిటి? అనేది చూడండి.

Telugu TV serials TRP ratings this week - Check top 10 list: టీఆర్పీ రేటింగ్స్ చూస్తే ప్రతి వారం స్టార్ మా సీరియల్స్ టాప్ ప్లేసులో ఉంటాయి. లిస్టులో ప్రతి వారం టాప్ 5లో ఆ ఛానల్ సీరియల్స్ ఉంటాయి. ఈ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అయితే, 'జీ తెలుగు'లో ఈసారి 'చామంతి' సీరియల్ టాప్‌లో ఉంది. మరి, 'స్టార్ మా'లో టాప్ ప్లేసులో ఏముంది? ఈ వీక్ టీఆర్పీ లిస్టులో టాప్ 10 తెలుగు సీరియల్స్ ఏమిటి? అనేది చూడండి.
13 ప్లస్ టీఆర్పీతో మళ్ళీ టాప్...
'కార్తీక దీపం 2 నవ వసంతం' దూకుడు!
స్టార్ మా ఛానల్ పలు సూపర్ హిట్ సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. వాటిలో ప్రతి వారం నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'కార్తీక దీపం 2: నవ వసంతం' టాప్ ప్లేస్ సొంతం చేసుకుంటూ వస్తుంది. ఈ వీక్ టాప్ ప్లేస్ కూడా ఆ సీరియల్ దక్కించుకుంది.
'కార్తీక దీపం 2' ఈ ఏడాది (2025)లో పదో వారంలో 13.78 టీఆర్పీ సాధించి 'స్టార్ మా'లో మాత్రమే కాదు... తెలుగు సీరియళ్లలో ఈ వారం టాప్ రేటింగ్ సాధించిన సీరియల్ కింద రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత 12.45 టీఆర్పీతో 'బుల్లితెర' మెగాస్టార్ ప్రభాకర్, సీనియర్ హీరోయిన్ ఆమని నటిస్తున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' నిలిచింది. ఆ తర్వాత 12.30 టీఆర్పీతో 'ఇంటింటి రామాయణం', 11.96 టీఆర్పీతో 'గుండె నిండా గుడిగంటలు', 10.04 టీఆర్పీతో 'చిన్ని' సీరియల్ నిలిచాయి. లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ చూస్తే... టాప్ 5 ఇవే.
'స్టార్ మా'లో మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... 'నువ్వుంటే నా జతగా' (8.41), మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'బ్రహ్మముడి' (6.34), 'మగువా ఓ మగువా' (6.28), 'పలుకే బంగారమాయనా' (6.00), 'నిన్ను కోరి' (5.24), 'పాపే మా జీవన జ్యోతి' (4.87) టీఆర్పీ సాధించింది.
'జీ తెలుగు'లో ఈ వారం 'చామంతి' టాప్!
ఈ ఏడాది (2025)లో పదో వారం టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే... ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మొదటి స్థానంలో నిలిచే 'జగద్ధాత్రి' ఈసారి చిన్న మార్జిన్ కారణంగా టాప్ ప్లేస్ కోల్పోయింది. ఈ వారం 'చామంతి' మొదటి స్థానంలోకి వచ్చింది. ఆ సీరియల్ 7.08 టీఆర్పీ నమోదు చేసింది. దాని తర్వాత 7.05 టీఆర్పీతో 'జగద్ధాత్రి' రెండో స్థానంలో ఉంది.
Also Read: ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
'చామంతి', 'జగద్ధాత్రి' సీరియళ్లు 'జీ తెలుగు'లో మొదటి రెండు స్థానాల్లో ఉండగా... 6.81 టీఆర్పీ రేటింగ్ సాధించిన 'మేఘ సందేశం' మూడో స్థానంలో, 6.58 టీఆర్పీతో 'పడమటి సంధ్యారాగం' నాలుగో స్థానంలో, 5.77 టీఆర్పీతో 'అమ్మాయి గారు' సీరియల్ ఐదో స్థానంలో నిలిచాయి. మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... 'ఉమ్మడి కుటుంబం' (3.20), 'ప్రేమ ఎంత మధురం' (3.98), 'మా అన్నయ్య' (1.63), 'కలవారి కోడలు కనకమహాలక్ష్మి' (4.10), 'ముక్కు పుడక' (3.52), 'గుండమ్మ కథ' (3.68) టీఆర్పీ సాధించాయి.
ఈటీవీలో 'రంగుల రాట్నం' సీరియల్ 3.40 టీఆర్పీ రేటింగ్ సాధించింది. అది టాప్ ప్లేసులో ఉంది. 'మనసంతా నువ్వే' సీరియల్ (3.10), 'ఝాన్సీ' సీరియల్ (2.91), 'బొమ్మరిల్లు' సీరియల్ (2.73), 'శతమానం భవతి' (1.94),'రాధా మనోహరం' (1.13), 'కాంతార' (1.03) టీఆర్పీ సాధించాయి. జెమిని టీవీలో ఒక్క సీరియల్ కూడా ఒకటి కంటే ఎక్కువ టీఆర్పీ సాధించలేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

