CSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP Desam
ఎల్ క్లాసికో అంటే ఎల్ క్లాసికోనే. లేదంటే అసలు 120 అయినా దాటుతుందా అనుకున్న ముంబై 155 కొట్టడం..ఆ ఏముందిలో చెన్నై ఉఫ్ అని ఊదేస్తుంది అనుకుంటే లాస్ట్ ఓవర్ వరకూ మ్యాచ్ ను తీసుకువెళ్లటం ఇది కదా రెండు బడా జట్లు తలపడితే వచ్చే మజా. అచ్చం అలాంటి మజాను ఇచ్చిన చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ లో సీఎస్కే 4వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్
156 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయటానికి బరిలోకి దిగిన సీఎస్కే చాలా త్వరగానే రాహుల్ త్రిపాఠీ వికెట్ కోల్పోయినప్పుడు క్రీజ్ లోకి వచ్చాడు కెప్టెన్ గైక్వాడ్. నిలదొక్కునేందుకు పెద్దగా టైమ్ తీసుకోకుండానే తనదైన స్టైల్ లో క్లాసిక్ షాట్స్ తో రెచ్చిపోయాడు. 26 బాల్స్ లోనే 6 ఫోర్లు 3 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు గైక్వాడ్. యంగ్ స్టర్ విఘ్నేశ్ పుత్తూర్ బౌలింగ్ లో పొరపాటున అయిపోయాడు కానీ చాలా మంచి ఇన్నింగ్స్ కెప్టెన్ రుతురాజ్ నుంచి కనిపించింది.
2. రచిన్ బ్రో మాస్
న్యూజిలాండ్ తర్వాత సెకండ్ హోం అంటే సీఎస్కే అన్నట్లుండే రచిన్ రవీంద్ర తన ఛాంపియన్స్ ట్రోఫీ ఫామ్ ను ఐపీఎల్ కు పట్టుకొచ్చేశాడు. గత ఐపీఎల్లో అంతగా రాణించలేకపోయాడన్న విమర్శలను తిప్పికొడుతూ ఈ రోజు మ్యాచ్ లో చెన్నైను గెలిపించేందుకు చివరికంటూ పోరాడింది రచిన్ రవీంద్రనే. 45బాల్స్ లో 2ఫోర్లు 4 సిక్సర్లతో 65పరుగులు చేసిన రచిన్..లాస్ట్ బాల్ కి సిక్సర్ బాది చెన్నై సూపర్ కింగ్స్ కి 4వికెట్ల తేడాతో విజయాన్ని కట్టబెట్టాడు.
3. యంగ్ గన్ విఘ్నేశ్ పుత్తూరు
మ్యాచ్ లో ముంబై ఓడిపోయినా కేరళ యంగ్ స్టర్ విఘ్నేశ్ పుత్తూరు స్పిన్ బౌలింగ్ మాత్రం అదుర్స్. 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన విఘ్నేశ్ మాత్రమే ఇచ్చి 3వికెట్లు తీశాడు. కెప్టెన్ గైక్వాడ్, ప్రమాదకర శివమ్ దూబే, దీపక్ హుడాల వికెట్లు తీసి చెన్నైను కాస్త కంగారు పెట్టాడు విఘ్నేశ్.
4. నూర్ &ఖలీల్ షో
ఈ మ్యాచ్ పై చెన్నై ఇంత పట్టు సాధించిందన్నా...ముంబై చతికిల పడటానికి కారణం సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్, స్పిన్నర్ నూర్ అహ్మద్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించగా.. ఇనీషియల్ ఓవర్స్ లో ఖలీల్ అహ్మద్ MI ని రఫ్పాడించాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టెన్ వికెట్లు తీసి ముంబైకి షాక్ ఇచ్చాడు ఖలీల్. చివర్లో బౌల్ట్ ను అవుట్ చేసి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరో వైపు ఆఫ్గాన్ చిన్నోడు నూర్ అహ్మద్ తన స్పిన్ బౌలింగ్ తో చెపాక్ లో ముంబైని తిప్పేశాడు. కెప్టెన్ సూర్య కుమార్, హిట్టర్ రాబిన్ మింజ్, సూపర్ స్టార్ తిలక్ వర్మ, నమన్ ధీర్ ఇలా నూర్ కీలక ఆటగాళ్లందరినీ డగౌట్ కు పంపి మ్యాచ్ ను చెన్నై చేతుల్లోకి తీసుకువచ్చేశాడు.
5. దీపక్ చాహర్ ఫినిషింగ్
కనీసం 120 అయినా దాటుతుందా అన్న డౌట్ ఉన్న ముంబైని...155 పరుగులు చేసిందంటే రీజన్ దీపక్ చాహర్. 15 బాల్స్ లోనే రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 పరుగులు చేసి ముంబైకి కాస్త గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు చెర్రీ. బౌలింగ్ లో రాహుల్ త్రిపాఠీని అవుట్ చేసినా..మ్యాచ్ మాత్రం చెన్నై తన్నుకెళ్లిపోయింది





















