అన్వేషించండి
Brahmamudi Serial Today March 20th Episode Highlights: కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది.. ఒకరి కోసం మరొకరు వెతుకుతున్న రాజ్ కావ్య - బ్రహ్మముడి మార్చి 20 ఎపిసోడ్ హైలెట్స్!
Brahma Mudi Serial Today Episode: రాజ్ ని రామ్ గా మార్చేసింది యామిని. రాజ్ చచ్చిపోయాడని ఇంట్లో అందరూ నమ్ముతున్నా కావ్య మాత్రం తను తిరిగివస్తాడంటోంది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇవే...

Brahmamudi Serial March 20th Episode
1/10

రాజ్ పదే పదే అదే అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు..వెంటనే ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలి అంటుంది యామిని. రాజ్ ని మరోసారి హాస్పిటల్ కి తీసుకెళ్లాలి..అప్పుడే ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయాలి అంటుంది
2/10

ఇంతలో రాజ్ రావడంతో షాక్ అవుతుంది యామిని..అంతా వినేశాడేమో అని కంగారుపడుతుంది. నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లడం గురించి మట్లాడుకుంటున్నాం అంటారు. ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయాలి అనుకుంటాడు రాజ్
3/10

రాజ్ దూరమయ్యాడు..కావ్య ప్రవర్తన ఇలా ఉంది..ఏం చేయాలో అర్థంకావడం లేదని బాధపడుతుంది అపర్ణ. జీవితంలో అన్నీ చూసిన మీరే ఇలా అయిపోతే..ఏమీ చూడని ఆ కావ్య ఏమవుతుంది? అందుకే ఇలా పిచ్చిదైపోయింది, మనమే నెమ్మదిగా సర్దిచెప్పాలి అంటుంది
4/10

ఇంట్లో అంతా అంతలా చెబుతున్నా నువ్వు వినవేంటి అని క్లాస్ వేస్తుంది స్వప్న. నేను నా మనసు చెప్పిందే నమ్ముతాను అంటుంది కావ్య. ఎంత చెప్పినా అర్థంకాదా అని కావ్యను కొట్టబోతుంది స్వప్న...ఇంతలో ఎంట్రీ ఇస్తుంది అప్పు
5/10

కాసేపు మనం కావ్య అక్కలా ఆలోచిద్దాం. పెద్ద ఆఫీసర్లతో మాట్లాడి కేసు రీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాను అంటుంది అప్పు. అయితే ఈ సారి ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయాన్ని కావ్య ఒప్పుకోవాలి అని కండిషన్ పెడుతుంది స్వప్న. ఈ లోగానే నేను మా ఆయన్ని తీసుకొచ్చి అందరి ముందు నిలబెడతాను అంటుంది
6/10

కావ్య అంత గట్టిగా చెబుతోందంటే నిజంగా రాజ్ బతికే ఉన్నాడా అంటాడు రాహుల్. ఆ పిచ్చిది ఏదో చెబుతుంటే నువ్వు నమ్ముతున్నావా అంటుంది రుద్రాణి . వాడిపై ప్రేమ వల్ల అలా వాగుతోందని కొట్టిపడేస్తుంది రుద్రాణి
7/10

రాజ్ దూరమయ్యాడు.. కంపెనీకి నువ్వు వెళ్లాలంటే కావ్య అడ్డుగా ఉంది. ఆ సీట్ నీ కు సొంతం కావాలంటే కావ్యను అడ్డు తొలగించాలి అంటుంది. అంతా దానికి పిచ్చి పట్టింది అంటున్నారు కాబట్టి..దాన్ని నిజంగా పిచ్చిదాన్ని చేయాలి అంటుంది
8/10

మర్నాడు ఉదయం హాల్లో రాజ్ ఫొటో పెట్టి దీపం వెలిగిస్తుంది రుద్రాణి. ఇందిరాదేవి వచ్చి ఆపుతుంది కానీ రుద్రాణి డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఎవరే అన్నా రాజ్ కి చేయాల్సిన కర్మలు నేను చేస్తాను అంటుంది
9/10

దీపం వెలిగిస్తుండగా కావ్య వచ్చి చేయి పట్టుకుంటుంది. మా ఆయన బతికే ఉన్నాడని చెబుతుంటే అర్థం కావడం లేదా అని రుద్రాణి గొంతు పట్టుకుంటుంది కావ్య. ఇంట్లో వాళ్లు ఎంత ఆపినా ఆగదు
10/10

బ్రహ్మముడి మార్చి 21 ఎపిసోడ్ లో... కావ్య గురించి యామిని, రాజ్ గురించి కావ్య..హాస్పిటల్లో ఎంక్వైరీ చేస్తారు. డాక్టర్ క్యాబిన్లో రాజ్ ని చూస్తుంది కావ్య
Published at : 20 Mar 2025 08:58 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
హైదరాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion