Viral News: పాము పగబట్టిందట - 103 సార్లు కాటువేసిందట- చిత్తూరు జిల్లా వ్యక్తి ప్రచారం
Viral News: సినిమాల్లో చూపించినట్టు పాములు పగబడతాయా? కానీ చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన కాటువేయడంలో పాము సెంచరీ కొట్టిందని ప్రచారం చేస్తున్నాడు.

Chittoor Latest News: చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తిపై తనపై పాము పగబట్టిందని చెబుతున్నారు. 18 ఏళ్ల వయసు నుంచి పాము కాటు వేస్తూనే ఉందని చెబుతున్నారు. ఒకట్రెండు సార్లు కాదు. ఏకంగా వందసార్లకుపైగా పగపట్టిందని చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన చెబుతున్న మాటలు లోకల్‌గా వైరల్ అవుతున్నాయి.
నిజంగానే పాములు పగబడతాయా... అంటే చాలా మంది లేదనే సమాధానం చెబుతారు. మరికొందరు ఏమో అని చెబుతారు. కానీ చిత్తూరు జిల్లాకు చెందిన బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మాత్రం పగబడతాయని కుండబద్దలు కొట్టి చెబుతున్నాడు. 47 ఏళ్ల ఆయన మూడు దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. పాము తనపై పగబట్టి ఎన్నిసార్లు కాటువేసినా తనకు ఏం కాలేదని సురక్షితంగా బయటపడుతున్నానని అంటున్నాడు.
సుబ్రహ్మణ్యం వినడానికి కాస్త వింతగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నా కుటుంబ సభ్యులు కూడా అదే నిజమని అంటున్నారు. నిరుపేద కూలీ సుబ్రహ్మణ్యానికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన చెప్పింది నిజమేనని సాక్ష్యం చెబుతున్నారు. ఇప్పటి వరకు పాము 103సార్లు కాటు వేసిందని చెబుతున్నాడు. కాటు వేసిన గుర్తులు కూడా చూపిస్తున్నాడు.
18 ఏళ్ల వయసులో తొలిసారి పాముకాటుకు గురయ్యారట సుబ్రహ్మణ్యం. ఇక్కడా అక్కడా అని కాదు ఆయన ఎక్కడకు వెళ్లినా సమీపంలో కచ్చితంగా పాము ఉండే ఉంటుందని భయపడుతున్నారు. ఏ సర్ప దోషం ఉందో తెలియదు కానీ పాములు మాత్రం తనపై పగతో రగిలి పోతూనే ఉన్నాయని వివరిస్తున్నాడు.
సుబ్రమణ్యం ఏ పొలంలో పనిచేస్తున్నా ఎక్కడ ఉన్నా అక్కడికి వెతుక్కుంటూ పాములు వచ్చేస్తున్నాయట. ఏకంగా వందసార్లకుపైగా నాగుపాముతోపాటు వివిధ రకాల విష సర్పాల కాటుకు వేసినట్టు సుబ్రమణ్యం వివరిస్తున్నాడు. అన్నిసార్లు కూడా ప్రాణాలతోనే బయటపడ్డానని చెబుతున్నాడు. పాము కాటుకు గురికావడం వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ కావడం కోలుకోని ఇంటికి రావడం జరుగుతుందట.
పెద్దపంజాణి మండలం శివాడి గ్రామ సమీపంలోని జెఎంజె మిషనరీ ఆసుపత్రిలో పాము కాటుకు చికిత్స తీసుకుంటున్నారట. నాటు వైద్యం కావడంతో ఎంతటి విష సర్పం కరిచినా మృత్యుంజయుడుగానే డిశ్చార్జ్ అవుతున్నానని చెబుతున్నాడు. పాముకాటు భయంతో కొన్ని పనులకు వెళ్లలేకపోతున్నని కుటుంబ పోషణ భారంగా మారుతుందని చెబుతున్నాడు. భార్య ఇద్దరు పిల్లలను పోషించడానికి అవస్థలు పడుతున్నాడట. మరోవైపు పాముకాటుకు గురైన ప్రతి సారి వైద్యం కోసం అయ్యే ఖర్చులు భరించలేకపోతున్నట్టు చెప్పాడు.
మొత్తానికి సుబ్రహ్మణ్యం చెప్పిన దాంట్లో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఊరి జనం కూడా కొందరు నిజమేని అంటున్నారు. మొత్తానికి చిత్తూరు జిల్లాలో ఈ వ్యక్తి వైరల్ అవుతున్నాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

