Tirupati Latest News: ఉచిత బస్ స్కీమ్ కోసం వైసీపీ వినూత్న నిరసన- చంద్రబాబు వీడియోలు చూపి టికెట్ లేకుండా ప్రయాణం
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎప్పుడు నుంచి అమలు చేస్తారని వైసీపీ నిరసన తెలిపింది. టికెట్ లేకుండా ప్రయాణం చేసి ఆందోళన చేపట్టింది.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి. దీని కోసం రాష్ట్రంలోని మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ కూటమి ప్రభుత్వం ఈ పథకంపై దాటివేత ధోరణి అవలంభిస్తోంది. దీన్నే నిలదీస్తూ వైసీపీ వినూత్న ఆందోళన చేపట్టింది. పథకకం ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రశ్నించింది.
తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉచిత బస్సు విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని నిరసన తెలిపారు. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కారు. కండాక్టర్ టికెట్ అడిగితే చంద్రబాబు వీడియోలు ప్రదర్శించారు.
ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియోను కండాక్టర్‌కు చూపపించారు. టికెట్ అడిగితే నా పేరు చెప్పండి చంద్రబాబు చేప్పే వీడియోను మహిళలు, మేయర్ శిరీష చూపించడంతో అందరూ షాక్ అయ్యారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్చార్జి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులో వినూత్న నిరసన తెలిపారు. వాళ్ల మాటలు విన్న కండక్టర్ ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రాలేదని స్పష్టం చేశారు.
తిరుపతిలో భూమన అభినయ్ మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు కోసం వినూత్న నిరసన#YSRCP #YSJagan #freebus #fakepromise # pic.twitter.com/iqqYemxfWE
— Bhumana Abhinay Reddy (@Bhumana_Abhinay) March 19, 2025
కండక్టర్ చెప్పినా వైసీపీ నేతలు టికెట్లు తీసుకోకుండా, బస్ దిగకపోవడంతో అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సును తిరుపతి ఎస్వీ యునివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భూమన అభినయ్ రెడ్డి, మేయర్ శిరీష, టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ర్ట ఉపాధ్యక్షురాలు గీత యాదవ్, మహిళా విభాగం నాయకురాలను అదుపులోకి తీసుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

