అన్వేషించండి

Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్

Bus Plant: మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్ ప్లాంట్ ను నారా లోకేష్ ప్రారంభించారు. ఏపీపై మళ్లీ పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతోందన్నారు.

Ashok Layland Plant:  బ్రాండ్ “బాబు” తిరిగి వచ్చారు, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చిందని నారా లోకేష్ అన్నారు.  విజయవాడ సమీపంలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ ప్లాంటును మంత్రి లోకేష్ చేతులమీదుగా ప్రారంభించారు. తొలుత మంత్రి లోకేష్ అశోక్ లేలాండ్ తయారు చేసిన డబుల్ డెక్కర్ బస్సులో ప్లాంటు వద్దకు విచ్చేసారు. ప్లాంటు ఆవరణలో మొక్క నాటిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్లాంటును ప్రారంభించారు. తర్వాత అశోక్ లేలాండ్ సంస్థ తయారు చేసిన ఎం ఎస్ ఆర్టీసి బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. 

తయారీ రంగంలో ఏపీని అగ్రభాగాన నిలిపే ప్రయత్నాలు

మల్లవల్లిలో అశోక్ లేలాండ్ అత్యాధునిక బస్సు తయారీ కర్మాగారం ప్రారంభోత్సవానికి ఈరోజు ఇక్కడ ఉండటం ఒక గౌరవం గా భావిస్తున్నాను. 2023 ఆగస్టు 24న నా పాదయాత్ర సందర్భంగా నేను మల్లవల్లికి వచ్చినపుడు అశోక్ లేలాండ్‌ను తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చాను. అది నేడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. అశోక్ లేలాండ్, హిందూజా గ్రూపునకు చెందిన పెద్దలు, పరిశ్రమ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులకు నా అభినందనలు. దేశచరిత్రలో మరే ఇతర రాజకీయ పార్టీ ప్రకటించని విధంగా అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చాం. మీరు సృష్టించే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగానికి మరో 4 పరోక్ష ఉద్యోగాలు తోడై రాష్ట్రాభివృద్ధికి ఊతమిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక పునరుజ్జీవనానికి చిహ్నంగా మార్చేందుకు మీవంటి వారి భాగస్వామ్యం మాకు శక్తినిస్తుంది. స్థిరమైన అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం. ప్రకాశవంతమైన, పచ్చని, స్థిరమైన రేపటి  భవితవైపు ముందుకు సాగుదాం. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చెందుతున్న పెట్టుబడులకు గమ్యస్థానంగా, తయారీరంగంలో అగ్రగామిగా నిలుపుదామని పిలుపునిచ్చారు. 

గత ప్రభుత్వ చర్యలకు పారిపోయిన పరిశ్రమలు
 
2019 నుండి 2024 వరకు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది, దీనివల్ల వ్యాపారాలు సజావుగా నడవడమే కష్టమైంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (PPA) రద్దు వంటి తిరోగమన విధానాలు రాష్ట్రంలో అనిశ్చితిని సృష్టించాయి, అనేక కంపెనీలను వేధించడంతో వారు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు. ఎపిలో అత్యధిక పన్ను చెల్లింపుదారుల్లో ఒకరైన అమర రాజా వంటి ప్రఖ్యాత పెట్టుబడిదారులు, లులు వంటి పెద్ద సంస్థలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నాయి. జాకీ వంటి కంపెనీలు కూడా రాష్ట్రం నుండి పొరుగురాష్ట్రాలకు తరలివెళ్లాయి.  దురదృష్టవశాత్తు గతపాలనలో నష్టపోయిన పారిశ్రామిక సంస్థల్లో అశోక్ లేలాండ్ కూడా ఒకటి. 1360 ఎకరాల్లో 2014-19 నడుమ టిడిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన మల్లవల్లి పారిశ్రామిక పార్కును వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసింది. మేము ఒప్పందాలు చేసుకున్న 450 కంపెనీల్లో చాలావరకు గత వైసీపీ పాలకుల  వేధింపుల కారణంగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాలేదన్నారు. 

పారిశ్రామిక వేత్తల్లో  విశ్వాసానికి చర్యలు

అశోక్ లేలాండ్ కు కేటాయించిన 75 ఎకరాల్లో 40 ఎకరాల్లో ప్లాంటును అభివృద్ధి చేశారు. ఈ ప్లాంట్ ఏటా 4,800 బస్సులను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది అశోక్ లేలాండ్ నిబద్ధతను సూచిస్తుంది. ఈ ప్లాంట్ ద్వారా లభించే ఉపాధి అవకాశాలపై నేను ఆనందిస్తున్నాను. మొదటిదశలో 600 ఉద్యోగాలు,  రెండో దశలో 1,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇది పరిసర ప్రాంతాలను శక్తివంతం చేయడమేగాక సామాజిక-ఆర్థిక వృద్ధి పెంపుదలకు దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారుచేయడం అనేది మా ప్రభుత్వ ముఖ్య లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ లభించే ఉద్యోగాలు కేవలం సంఖ్య కాదు, అవి జీవనోపాధిని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చి బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాదిగా నిలుస్తాయన్నారు. క్లీనర్ టెక్నాలజీలు, స్థిరమైన పద్ధతులను స్వీకరించడం ద్వారా అశోక్ లేలాండ్ ఒక బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తోంది. ఆర్థిక వృద్ధి, పర్యావరణ బాధ్యత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనడాన్ని ఇది సూచిస్తుంది.  50 కంటే ఎక్కువ దేశాల్లో విస్తరించి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య వాహన పరిశ్రమలకు అశోక్ లేలాండ్ మార్గదర్శకంగా నిలుస్తోందని ప్రశంసించారు.  

ఎపిలో పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు

ప్రభుత్వపరంగా వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి స్థిరమైన విధానాలతో మేం ముందుకు సాగుతున్నాం. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి పరిశ్రమదారుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడంపై దృష్టి సారించాం. ఫలితంగా ఆర్సెలర్ మిట్టల్, BPCL, TCS, NTPC, LG, టాటా పవర్ వంటి ప్రధాన సంస్థలు గత తొమ్మిది నెలల్లో ₹7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టడానికి ముందుకు వచ్చాయన్నారు. . వీటిద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ పెట్టుబడులు కేవలం పారిశ్రామిక వృద్ధి, వ్యాపార వేగాన్ని సూచించడమేగాక ఆంధ్రప్రదేశ్‌లో నవశకం ప్రారంభాన్ని సూచిస్తున్నాయన్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Smita Sabharwal: వివాదంలో స్మితా సభర్వాల్ - కారు అద్దె పేరుతో రూ.61 లక్షలు తీసుకున్నారని ఆరోపణల !
వివాదంలో స్మితా సభర్వాల్ - కారు అద్దె పేరుతో రూ.61 లక్షలు తీసుకున్నారని ఆరోపణల !
Telangana Roads: HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
Warangal Crime News: మైనర్లకు గంజాయి అలవాటు చేసి వ్యభిచారం  - వరంగల్‌లో కీచకుల ముఠా అరెస్ట్ - ఎన్ని దారుణాలంటే?
మైనర్లకు గంజాయి అలవాటు చేసి వ్యభిచారం - వరంగల్‌లో కీచకుల ముఠా అరెస్ట్ - ఎన్ని దారుణాలంటే?
Rythu Bharosa Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
Embed widget