అన్వేషించండి
Bhanumathi Serial Today March 19th Episode 09 Highlights: ప్రపోజ్ చేద్దామని వచ్చి ఫైట్ చేసిన పార్థు.. ప్రేమ సంగతి ఎవరికి చెప్పకూడదో వాళ్లే చెప్పాడు - భానుమతి మార్చి 19ఎపిసోడ్ హైలెట్స్!
Bhanumathi Serial Today: చదువుకుని డాక్టర్ అవ్వాలని కలలు కనే భానుమతి.. తండ్రికోసం చదువు త్యాగం చేసిన పార్థు... ఇద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతోంది. భానుమతి మార్చి 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

bhanumathi Serial march 19th episode
1/9

అలాంటి దరిద్రుడి కూతుర్ని నేను ప్రేమించానని తెలిస్తే మానాన్న పెళ్లికి ఒప్పుకోడు అని బాధపడతాడు పార్థు. ముందు నువ్వు వెళ్లి నీ మనసులో మాట ఆ అమ్మాయికి చెప్పు అని పంపిస్తాడు
2/9

చదువు సంస్కారం లేదంటూ పెళ్లిచూపుల్లో పార్థుకి జరిగిన అవమానం తలుచుకుని బాధపడుతుంటాడు బలరాం. ఏం ఆలోచిస్తున్నారని శారద అడుగుతుంది. పార్థుకి అమ్మాయిని వెతకడం కష్టమే అని బాధపడతాడు
3/9

మీ కష్టాన్ని అర్ధం చేసుకున్నాడో ఏమో..పార్థు తనకు నచ్చిన అమ్మాయిని వెతుక్కున్నాడు అంటుంది. ఆ మాట విని బలరాం షాక్ అవుతాడు. సీతారాముల కళ్యాణానికి వచ్చి తన సీతను తానే వెతుక్కున్నాడంటూ గుడిలో తను చూసిన వివరాలు చెబుతుంది. ఆ అమ్మాయా... అవును గుర్తొచ్చింది చూడచక్కగా ఉంది అంటాడు
4/9

ఆ అమ్మాయిని చూసినప్పుడు ఏదో ఆనందం, ఆరాటం అన్నీ గమనించాను అంటూ చెబుతుంది. శారదను మెచ్చుకున్న బలరాం.. పార్థు ఆ అమ్మాయిని ఇష్టపడి ఉంటే మంచి జోడీ అనిపిస్తే తననే ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు బలరాం. ఆ అమ్మాయి ఎవో కనుక్కోండి అంటుంది శారద
5/9

కోటిగాడు, భానుమతి కూరగాయలు తీసుకొస్తుండగా అప్పులవాళ్లు వచ్చి కోటిని ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. భానుని కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పుడే హీరో ఎంట్రీ ఇచ్చి ఫైట్ చేల్తాడు
6/9

సూరిని పిలిచి అప్పులవాళ్లకు ఇవ్వాల్సిన లక్ష రూపాయలు పార్థు కడతాడు. భానుమతి వద్దు అనేస్తుంది కానీ.. వరమిచ్చేవాళ్లని ఆపకూడదు అంటాడు సూరి. వాళ్ల చేతిలో అవమానం పడేకన్నా నా నుంచి సహాయం తీసుకోవడం మంచిది అంటాడు పార్థు
7/9

మీ రుణం తీర్చుకుంటాను అంటుంది భాను.. ప్రపోజ్ చేస్తానని వచ్చి ఫైట్ చేశాను అంటాడు పార్థు. ఇదంతా దూరం నుంచి గమనిస్తుంది పార్థు మేనత్త శాంభవి. ఏదో ఉంది ఆ సంగతేంటో చూడాలి అనుకుంటుంది
8/9

ఇంటి బయట చీరలు అమ్ముకునేవాడు ఏదో వెతకడం గమనిస్తుంది భానుమతి. ఆ పని నానమ్మ కుమారి చేసిందని తెలుసుకుని ఆ చీరలు తీసుకొచ్చి ఇచ్చేస్తుంది.
9/9

భానుమతి మార్చి 20 ఎపిసోడ్ లో శక్తి తో తన ప్రేమ సంగతి చెబుతాడు పార్థు. మీ నాన్నకు చెప్పావా అంటే భయం వేస్తోంది నువ్వే ఒప్పించు అంటాడు. ఇక అధికారం నా చేతికి వచ్చే సమయం ఇదే అనుకుంటుంది శక్తి...
Published at : 19 Mar 2025 10:33 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion