అన్వేషించండి

Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!

Sunita Williams: అంతరిక్షం నుంచి మంగళవారం ఉదయం బయల్దేరిన సునీతా విలియమ్స్‌ ఈ వేకువజామున నేలను ముద్దాడారు. ఈ ప్రయాణం కోసం నాసా చాలా పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది.

Sunita Williams: తొమ్మిది నెలలకుపైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్,  బుచ్ విల్మోర్ ఎట్టకేలకు స్వదేశానికి తిరిగి వచ్చారు. నాసా ప్రకారం, వారి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక IST ఉదయం 10:35 గంటలకు ISS నుంచి అన్‌డాక్ అయింది. బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అయింది.  

భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడం అంతరిక్ష ప్రయాణంలో అత్యంత కీలకమైన దశల్లో ఒకటి. అంతరిక్ష నౌక వాతావరణంలోకి వచ్చినప్పుడు అది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. వాటిలో 7,000 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని నాసా తెలిపింది. ల్యాండింగ్‌కు ముందు హైపర్‌సోనిక్ వేగాన్ని తట్టుకునేలా అంతరిక్ష నౌకను రూపొందించాలి. వ్యోమగామిగా బయటకు చూస్తే అదో ఫైర్‌ వాల్‌లా కనిపిస్తుంది.  

NASA ఎలా సిద్ధమైంది
సునీతా విలియమ్స్ తిరిగి వచ్చే క్యాప్యూల్‌ భూమికి సురక్షితంగా తిరిగి వచ్చి సురక్షితంగా ల్యాండ్ అవ్వడంలో NASA ఎంట్రీ సిస్టమ్స్, టెక్నాలజీ విభాగం కీలక పాత్ర పోషించింది. కాలిఫోర్నియాలోని అమెస్ రీసెర్చ్ సెంటర్ ఈ టెక్నాలజీలో 1961 నుంచి చాలా అడ్వాన్స్‌గా ఉంది. హీట్ షీల్డ్‌లు, పారాచూట్‌లు, అధునాతన సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించారు. వీటి సహాయంతో NASA ఇంజనీర్లు అంతరిక్ష నౌక మండుతున్న ప్రాంతాలను తట్టుకొని నిలబడే పరిష్కారాలు కనుగొన్నారు.  

రీఎంట్రీ టెక్నాలజీస్

హీట్ షీల్డ్‌లు:- క్యాప్సూల్‌కు ఉండే హీట్ షీల్డ్‌లు చుట్టూ ఉండే వేడిని గ్రహిస్తాయి. దాన్ని బయటకు పంపేస్తాయి. అవ్‌కోట్ (అపోలో మిషన్‌లు, ఓరియన్ క్రూ క్యాప్సూల్‌లో ఉపయోగించేది), ఫినాలిక్-ఇంప్రెగ్నేటెడ్ కార్బన్ అబ్లేటర్ (PICA) వంటి పదార్థాలు వేడి వాతారణం క్యాప్సూల్‌పై పడకుండా చూస్తాయి. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ కోసం ప్రత్యేకంగా వెర్షన్ PICA-X ను అభివృద్ధి చేశారు. 

ఆర్క్ జెట్ టెస్టింగ్:- అంతరిక్షం నుంచి వచ్చేటప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణాన్ని అమెస్ ఆర్క్ జెట్ కాంప్లెక్స్‌లో క్రియేట్ చేస్తారు. ముఖ్యంగా ఉష్ణోగ్రత విషయంలో సూర్యుని ఉపరితలం కంటే ఎక్కువ రెట్లు ఉండే ప్లాస్మా వద్ద ఉష్ణ కవచాలు ఉంచుతారు. అక్కడ తట్టుకున్న తర్వాత వాటిని క్యాప్సూల్‌కు అమరుస్తారు.  

కంప్యూటర్ సిమ్యులేషన్స్:- మిషన్‌లను ప్రారంభించే ముందు సాంకేతిక సవాళ్లు అంచనా వేయడానికి  వాటిని పరిష్కరించడానికి సూపర్ కంప్యూటర్ల మోడల్ రీఎంట్రీ డైనమిక్స్ ఉపయోగపడతాయి. 

ADEPT, HEEET:- HEEET (హీట్‌షీల్డ్ ఫర్ ఎక్స్‌ట్రీమ్ ఎంట్రీ ఎన్విరాన్‌మెంట్ టెక్నాలజీ) ADEPT (అడాప్టబుల్, డిప్లాయబుల్ ఎంట్రీ ప్లేస్‌మెంట్ టెక్నాలజీ) వంటి కొత్త రక్షణ కవచాలు మార్స్, వీనస్ వాతావరణానికి మించిన వెదర్ కండీషన్లు తట్టుకునేలా చేస్తారు. అంతరిక్ష నౌక రక్షణ పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నారు.  

గత అనుభవాల నుంచి పాఠాలు
అపోలో మూన్ మిషన్‌ల నుంచి మార్స్ సైన్స్ లాబొరేటరీ,  స్టార్‌డస్ట్ కామెట్ నమూనా రిటర్న్ మిషన్ వరకు గత మిషన్‌ల నుంచి NASA చాలా పాఠాలు నేర్చుకుంది. పునర్వినియోగించదగిన ఆర్బిటర్‌లను కలిగి ఉన్న స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ కూడా రీఎంట్రీ ఏరోడైనమిక్స్‌లో చాలా సహాయపడింది.  

2016లో స్థాపించిన అపోలో, ఛాలెంజర్, కొలంబియా లెసన్స్ లెర్న్డ్ ప్రోగ్రామ్ (ACCLLP), గత వైఫల్యాలు పునరావృతం చర్యలు తీసుకున్నారు. లోపాలు అధిగమించేలా వ్యవస్థను డెవలప్ చేశారు. అపోలో 13 మిషన్, ఆక్సిజన్ ట్యాంక్ పేలుడు సిబ్బంది మనుగడకు ముప్పు కలిగించినప్పుడు ఎమర్జెన్సీ ప్లానింగ్‌ సమస్య పరిష్కార ప్రాముఖ్యత నొక్కి చెప్పింది.  

NASA స్పేస్ షటిల్ ప్రోగ్రామ్
1981 నుంచి 2011 వరకు ఉన్న NASA స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ మానవ అంతరిక్ష ప్రయాణానికి పునర్వినియోగించదగిన ఉపయోగించిన మొదటిఅంతరిక్ష నౌక. ఈ నౌకాదళంలో కొలంబియా, ఛాలెంజర్, డిస్కవరీ, అట్లాంటిస్, ఎండీవర్ ఉన్నాయి, ఇవి ఏడుగురు వ్యోమగాములను, వివిధ పేలోడ్‌లను భూకక్ష్యలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడ్డాయి. 

షటిల్ రాకెట్ లాగా ఉపయోగపడి అంతరిక్షంలో పని చేసింది. గ్లైడర్ లా భూమికి తిరిగి వచ్చింది. ఇది ఉపగ్రహాలు తీసుకెళ్లడంలో, శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడంలో, హబుల్ స్పేస్ టెలిస్కోప్‌ను మరమ్మతు చేయడంలో, ISSని అసెంబుల్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. 135 మిషన్‌లను పూర్తి చేసింది. అదే టైంలో కానీ పెద్ద విషాదాలను కూడా ఎదుర్కొంది - 1986లో ఛాలెంజర్, 2003లో కొలంబియా ఫెల్యూర్ తర్వాత భద్రతాపరమైన చర్యలు తీసుకునేలా చేసింది.  

షటిల్‌లో ఆర్బిటర్ వాహనం, రెండు సాలీడ్‌ రాకెట్ బూస్టర్‌లు, వెలుపల ఇంధన ట్యాంక్ ఉంటాయి. ట్యాంక్ మినహా అన్ని భాగాలు రీ యూజ్ చేయవచ్చు. 2011లో షటిల్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత NASA కొత్త అంతరిక్ష ప్రయాణ సాంకేతికత, భాగస్వామ్యాలపై దృష్టి పెట్టింది. షటిల్ నుంచి నేర్చుకున్న పాఠాలు ఉపయోగించి భవిష్యత్ అన్వేషణ మిషన్లు అభివృద్ధి చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra 22 A Lands : ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra 22 A Lands : ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
Haq OTT Release Date: నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Embed widget