Sunita Williams : అంతరిక్షంలో 9నెలల జీవితం- ఇండియన్ బ్లడ్ ధీర వనిత సునీతా విలియమ్స్ జర్నీ గురించి తెలుసా?
Sunita Williams Return Latest News: గుజరాత్ నుంచి అంతరిక్షం వరకు వెళ్లిన సునీతా పాండ్య బయోగ్రఫీ గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఆమె అంతరిక్షంలో చేసిన చిలిపి పనులు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Sunita Williams Return Latest News:ఆడవాళ్లకు ఓపిక సహనం ఎక్కువ అంటారు కదా.. అందునా భారతీయ స్త్రీలు రియల్లీ స్ట్రాంగ్ ఫైటర్స్ అంటారు కదా. అందుకు గుడ్ ఎగ్జాంపుల్ సునీతా విలియమ్స్. వారం రోజుల పని కోసం స్పేస్‌కి వెళ్తే అనుకోకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది నెలల పాటు స్పేస్‌లోనే చిక్కుకుపోయారు. అసలు ప్రిపేర్ అయ్యి ఉండరు దీనికి. కానీ మెంటల్‌గా ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్ కాబట్టే సునీతా విలిమయ్స్ ఈ రోజు మనకందరికీ చాలా ప్రౌడ్‌గా మారిపోయారు. అంతరిక్షం నుంచి ప్రయాణం ప్రారంభించిన సునీతా విలియమ్స్ టీం బుధవారం వేకువజామున భూమ్మీదకు దిగనబోతున్నారు. ఈ సునీతా విలియమ్స్ అసలు ఎవరు.. ఈమెకు భారత్‌కు ఉన్న సంబంధం ఏంటీ. అసలు ఆమె బయోగ్రఫీ ఏంటో ఓ సారి చూసేద్దాం.
1965 సెప్టెంబర్ 19న సునీతా విలియమ్స్ అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో యూక్లిడ్‌లో జన్మించారు. సునీతా విలియమ్స్ తండ్రి పేరు డా. దీపక్ పాండ్యా..ఆయనది గుజరాత్‌లోని మెహ్సానా ప్రాంతం. స్వతహాగా న్యూరో అనాటమిస్ట్ అయిన దీపక్ పాండ్యా గుజరాత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయారు. స్లొవేకియా దేశానికి చెందిన బొన్నీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికీ జన్మించిన అమ్మాయే సునీతా పాండ్యా.
యూఎస్ నేవల్ అకాడమీ 1987లో ఫిజిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన సునీతా పాండ్యా. ఫ్లోరిడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్మెంట్‌లో 1995లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక అమెరికన్ నేవీలో హెలికాఫ్టర్ పైలెట్‌గా తన కెరీర్ ప్రారంభించారు. 30 రకాల ఎయిర్ క్రాఫ్ట్స్‌ను నడిపిన అనుభవాన్ని సంపాదించారు. ఫెడరల్ మార్షల్ అయిన మైఖేల్ జే విలియమ్స్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని సునీతా పాండ్యా కాస్త సునీతా విలియమ్స్‌గా మారారు. పెళ్లైనా కెరీర్‌ను వదిలిపెట్టకుండా తనను తను ప్రూవ్ చేసుకుని 1998లో నాసాలో జాయిన్ అయ్యారు సునీతా విలియమ్స్. కల్పనా చావ్లా తర్వాత నాసాలో చేరిన రెండో భారతీయ మూలాలున్న మహిళగా రికార్డు సృష్టించారు సునీతా విలియమ్స్.
2006లో తొలిసారిగా అంతరిక్ష ప్రయాణం చేసిన సునీతా విలియమ్స్… ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లి 195 రోజులు ఉండి వచ్చారు. అప్పటికీ అతి ఎక్కువ కాలం అంతరిక్షంలో గడిపిన తొలి మహిళగా సునీతా విలియమ్సే రికార్డు సృష్టించారు. స్పేస్‌లో మారథాన్ రన్ చేసి ఆ రికార్డును తన పేరు మీద రాసుకున్నారు సునీతా విలియమ్స్.
2012లో రెండోసారి ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన సునీత... మళ్లోసారి 127 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపారు. మూడు సార్లు స్పేస్ వాక్ చేయటంతో పాటు 50 గంటల పాటు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు.
ప్రస్తుతం మూడోసారి ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన సునీతా అనుకోకుండా ఈసారి తొమ్మిది నెలల పాటు స్పేస్ స్టేషన్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈసారి ఏకంగా 322 రోజులు ఉండిపోవటంతో మొత్తం 622 రోజుల పాటు స్పేస్‌లో గడిపిన మహిళగా రికార్డు సృష్టించారు సునీత. పెగ్గీ వాట్సన్ అనే మహిళా ఆస్ట్రోనాట్ పలు దఫాలుగా స్పేస్‌లో 675 రోజులు గడిపారు. ఆమె తర్వాత రెండో మహిళా ఆస్ట్రోనాట్‌గా సునీత పేరు మీదే రికార్డు ఉంది.
సునీతా విలియమ్స్ స్పేస్‌లోకి వెళ్లేముందు తన ఐపాడ్ నిండా లతా మంగేష్కర్ పాటలు అప్‌లోడ్ చేసుకొని వెళ్లారు. ఆ పాటలు వింటూ పిచ్చ పిచ్చగా డ్యాన్స్ చేయటం ఆమెకున్న అలవాటు. అంతేకాదు ఇండియన్ డిష్ అయిన ఆలూ సమోసాను స్పేస్‌లో తయారు చేయటానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారట సునీత. బంగాళదుంప గాలిలో తేలిపోతుండటం వల్ల సమోసాలోకి స్టఫ్ చేయలేకపోయారు. స్పేస్‌లో గిటార్ వాయించటం.. పొరపాటున మెషీన్ వైర్‌లో చేతులు పెట్టి షాక్ కొట్టించుకోవటం చాలా చిలిపి పనులే ఉన్నాయి సునీత స్పేస్ కెరీర్‌లో.
సునీతా ఎప్పుడూ ఒకటే మాట చెబుతారు. హ్యాపీగా ఉండండి..కష్టపడి పనిచేయండి..ఓడిపోతామనే భయం వద్దు అంటారు. జీవితం కూడా అంతరిక్షం లాంటిదే ఓసారి తేలుతూ ఉంటాం. ఓసారి కిందకు జారిపడిపోతూ ఉంటాం. కానీ మళ్లీ మనం నింగిలోకి దూసుకువెళ్లే రోజు వస్తుంది ఆ రోజు కోసం ఓపికగా వెయిట్ చేయాలి అంటూ ఇన్‌స్పైర్ చేస్తుంటారు సునీతా విలియమ్స్. సో తొమ్మిది నెలల తర్వాత ఆమె భూమి మీదకు తిరిగి వస్తున్న సందర్భంగా ఇండియా తరపున వెల్కమ్ బ్యాక్ చెబుదాం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

