Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Doctors attack patient : హిమాచల్ ప్రదేశ్ లో ఓ ఆస్పత్రిలో డాక్ట్ రోగిపై దాడికి పాల్పడ్డాడు. ఏదో విషయంలో ఇద్దరూ వాదన పెట్టుకోవడంతో ఈ ఘటన జరిగింది.

Himachal Pradesh doctors assault a patient: అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన పెషంట్ పై డాక్టర్లు దాడికి పాల్పడ్డారు. బాగోలేక వచ్చాడన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సిమ్లాలోని ప్రతిష్టాత్మక ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన వైద్య వర్గాల్లో, సామాన్య ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎండోస్కోపీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న అర్జున్ పన్వార్ అనే ఉపాధ్యాయుడిపై, అక్కడే పనిచేస్తున్న ఒక వైద్యుడు దాడికి పాల్పడటం సంచలనం సృష్టించింది. రోగులకు రక్షణగా ఉండాల్సిన చోట, వైద్యుడే భౌతిక దాడికి దిగడం అందర్నీ విస్మయానికి గురి చేసింది.
బాధిత ఉపాధ్యాయుడు అర్జున్ పన్వార్ అనారోగ్య కారణాలతో ఎండోస్కోపీ చేయించుకుని, ఆసుపత్రిలోని రికవరీ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మరో డాక్టరుకు, అర్జున్‌కు మధ్య ఏదో విషయంలో వాగ్వాదం మొదలైంది. ఈ వాదన కాస్తా ముదిరి చివరకు ఘర్షణగా మారింది. సదరు వైద్యుడు సహనం కోల్పోయి రోగిపై భౌతిక దాడికి దిగినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిపై ఇలాంటి దాడి జరగడంపై నిరసన వ్యక్తమవుతోంది.
SHOCKING INCIDENT AT HIMACHAL'S BIGGEST HOSPITAL! 😱
— The Modern Himachal (@I_love_himachal) December 22, 2025
Reports claim Arjun Panwar, a teacher from Kupvi (Shimla) working at the famous Aspire Institute Shimla, went to IGMC this morning for an endoscopy.
He was told to rest on a bed post-procedure... but another doctor said NO!… pic.twitter.com/syWMlQega7
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆసుపత్రి యంత్రాంగం మరియు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటన తీవ్రతను బట్టి దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. ఇప్పటికే ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజీని సేకరించిన అధికారులు, నిందితుడైన వైద్యుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వృత్తిపరమైన బాధ్యతను మరిచి ప్రవర్తించినందుకు సదరు వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
What’s happening in our State ?
— Adv. Homi Devang Kapoor (@Homidevang31) December 22, 2025
Shocking Video from IGMC,Shimla
A patient beaten by Doctor at IGMC Shimla
When those meant to heal turn violent, accountability is non-negotiable
Immediate action & accountability needed pic.twitter.com/S1XwrGd4Np
కొద్దిరోజుల క్రితం ఢిల్లీ విమానాశ్రయంలో విమానం ఆలస్యమైనందుకు ఒక ప్రయాణికుడు పైలట్‌పై దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో ఆసుపత్రిలో వైద్యుడే రోగిపై దాడి చేశారు. నిత్యం ఒత్తిడితో కూడిన విధుల్లో ఉండే వారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.





















