Sunita Williams Return to Earth Mission: బైబై ISS- సునీతా విలియమ్స్ భూమ్మీదకు తిరుగు ప్రయాణం మిషన్ ప్రారంభం - Live Video
Sunita Williams Earth Mission Live | 9 నెలలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి భూమీ మీదకు తిరిగి వస్తున్నారు.

Sunita Williams And Wilmore Latest News: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు తిరిగొచ్చే మిషన్ ప్రారంభమైంది. ఆమెతో పాటు బుచ్ విల్మోర్ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్–10 స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమ్మీదకు తిరిగి వస్తున్నారు. అయితే 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తరువాత సునీత, విల్మోర్ భూమి మీదకు తిరిగి వచ్చే మిషన్ ప్రారంభం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కేవలం వారం, పది రోజులు అనుకుని స్టార్ లైనర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్లిన సునీత, విల్మోర్ ఆస్ట్రోనాట్స్ టీమ్ అక్కడే చిక్కుకుపోయింది. ఇటీవల క్రా డ్రాగన్ 10 డాకింగ్ సక్సెస్ కావడంతో వీళ్లు భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమం అయింది.
ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్ సంస్థ స్పేస్ ఎక్స్, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సంయుక్త ప్రయోగంతో సునీతా విలియమ్స్, మరో ముగ్గురు వ్యోమగాములు భూమి మీదకు తిరిగొచ్చే మిషన్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ ప్రక్రియను నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. క్రూ డ్రాగన్–10 వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ నేటి ఉదయం 8.15కు మొదలైంది. కానీ ఈ ప్రక్రియతో పాటు అన్ డాకింగ్ జరగడం లాంటివి పూర్తయి ఐఎస్‌ఎస్ నుంచి క్యాప్సుల్ విడివడే ప్రక్రియ ఉదయం 10.35కు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత లైవ్ అనేది ఆడియోకు పరిమితం కానుంది.
ఈ మిషన్ సక్సెస్ అయితే బుధవారం తెల్లవారుజాము 2.41 గంటలకు వ్యోమనౌక భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుందని నాసా తెలిపింది. తెల్లవారుజామున దాదాపు 3.30 గంటలకు ఫ్లోరిడా తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ క్యాప్సూల్ దిగుతుంది. స్టార్ లైనర్ తో వెళ్లి ఐఎస్ఎస్ లో 9 నెలలు చిక్కుకున్న సునీతా, విల్మోర్ ఎట్టకేలకు భూమిని చేరతారు. వెంటనే నాసా టెక్నీషియన్స్, స్విమ్మర్స్ నలుగురు ఆస్ట్రోనాట్స్‌ను క్యాప్సూల్ నుంచి వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీస్తారు. వారిని నాసా సెంటర్‌కు తరలించి అవసరమైన వైద్య చికిత్స అందించనున్నారు.
నలుగురు వ్యోమగాములు వీరే..
గత ఏడాది జూన్ లో స్టార్ లైనర్ లో వెళ్లి ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తో పాటు గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన మరో ఇద్దరు వ్యోమగాములు అలెగ్జాండర్ గుర్బనోవ్ (రష్యా), నిక్ హేగ్ (అమెరికా) సైతం స్పేస్ ఎక్స్ డ్రాగన్10 స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమి మీదకు తిరిగి వస్తున్నారు.
స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రోజులు, వారాలు కాదు ఏకంగా 9 నెలలపాటు సునీత, విల్మోర్ ఐఎస్ఎస్ లో ఉండిపోయారు. రిపేర్ చేసినా ప్రయత్నాలు సక్సెక్ అవకపోవడంతో స్టార్ లైనర్ ఖాళీగానే సెపె్టంబర్ 7న భూమికి తిరిగొచ్చింది. రిస్క్ తీసుకోవద్దని భావించిన నాసా స్టార్ లైనర్‌ను ఖాళీగానే తిరిగి రప్పించింది. చివరకు స్పేస్ ఎక్స్ తో కలిసి డ్రాగన్ క్రూ 10తో సక్సెస్ సాధించి, నలుగురు వ్యోమగాములను భూమి మీదకు తెస్తుంది. ప్రపంచమంతా ఈ అరుదైన ఘట్టాన్ని వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

