అన్వేషించండి

Sunita Williams Latest News: సునీతా టీమ్‌కు నిజంగా పునర్జన్మే- భూమ్మీదకు రావాలంటే ఇన్ని గండాలు దాటాలా!

Sunita Williams Latest News: సునీత భూమ్మీదకు వచ్చేందుకు నాసా ముహూర్తం ఫిక్స్ చేసింది. అయితే సునీతా విలియమ్స్ టీం భూమి మీదుకు వచ్చేందుకు జరిగే ప్రక్రియ మాత్రం చాలా డేంజర్‌. అదేంటో ఇక్కడ చూద్దాం. 

Sunita Williams Latest News: తొమ్మిదినెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన నాసా ఆస్ట్రానాట్, మన భారతీయ మూలాలున్న మహిళ సునీతా విలియమ్స్ అండ్‌ టీమ్‌ మరికొన్ని గంటల్లోనే భూమి మీదకు రానున్నారు. మంగళవారం ఉదయం 8.15కు వాళ్లు రిటర్న్‌ జర్నీ షురూ అవుతుంది. అంతరిక్షం నుంచి భూమి మీదకు వాళ్ల జర్నీ 15 గంటలకుపైగానే ఉంటుంది. 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ మోసుకొచ్చిన క్రూ10 తెచ్చిన డ్రాగన్ క్యాప్సూల్‌లోనే క్రూ 9 తిరిగి భూమి మీదకు రానున్నారు. క్రూ 9లో మొత్తం నలుగురు ఉంటారు. సునీతా విలియమ్స్‌తో పాటు స్పేస్‌లో చిక్కుకుపోయిన బుచ్ విల్ మోర్, నిక్ హేగ్, రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్.  ఈ నలుగురిని భూమ్మీదకు తీసుకొచ్చే ప్రక్రియ చాలా పెద్దది. ఇది దశల వారీగా జరుగుతుంది. అవేంటో డీటైల్డ్‌గా చూద్దాం.
1. హేచ్ క్లోజింగ్ (Hatch Closing)
హేచ్ క్లోజింగ్ అంటే ఏం లేదు సింపుల్‌గా చెప్పుకోవాలంటే చుట్టాలను బయటకు పంపించి తలుపులు వేసుకోవటం లాంటిది అన్నమాట. ఇన్నాళ్ల పాటు స్పేస్‌లో గడిపిన సునీతా విలియమ్స్ ఇంకా ముగ్గురు ఆస్ట్రోనాట్స్‌కు కొత్తగా వెళ్లిన సైంటిస్టులు డోర్ క్లోజ్ చేసి టాటా చెప్పేస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీళ్ల క్యాప్సూల్‌ అటాచ్‌ అయ్యి ఉంటుంది. దీన్ని సాంకేతికంగా డాకింగ్ అంటారు. ఈ క్యాప్సూల్‌ను అన్ డాకింగ్ అంటే విడగొట్టే ముందు ఈ హ్యాచ్ క్లోజింగ్ అనే ప్రక్రియ చేపడతారు. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి డాకింగ్ అయ్యి ఉన్న క్యాప్సూల్ లోపలికి భూమ్మీదకు రావాల్సిన ఆస్ట్రోనాట్స్ వెళ్లిపోతారు. అలా వెళ్లిన తర్వాత ఇంటర్ నేషనల్ నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉండాల్సిన వాళ్లు వీళ్లకు బైబై చెప్పేస్తారు. అనంతరం డోర్ క్లోజ్ చేసే ప్రక్రియ ప్రారంభిస్తారు. 

ఇలా డోర్ క్లోజ్ చేసే ప్రక్రియలో చాలా పనులు మ్యాన్యువల్‌గానే చేస్తారు. తలుపు వేసి అది బాగా లాక్ పడిందో లేదో చెక్ చేస్తారు. మీటర్స్ అన్నీ చూసుకుని అంతా ఓకే అనుకున్న తర్వాతే సిగ్నల్ ఇస్తారు. హ్యాచ్ క్లోజింగ్ కంప్లీటెడ్ అని కమాండ్ ఇస్తారు. ఇలా చేసేటప్పుడు ప్రతి ఇంచ్‌ను చాలా జాగ్రత్తగా పనిశీలిస్తారు. 

పొరపాటున ఏదైనా ఎక్కడైనా లీక్ అయ్యిందా ఇటు ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ అటు డాక్ అయ్యి ఉన్న క్యాప్సూల్‌లో ఉన్న మనుషులు అంతా ప్రమాదంలో పడతారు. అందుకే ఈ ప్రక్రియను చాలా అంటే చాలా జాగ్రత్తగా చేపడతారు. జాగ్రత్తగా అణువణువూ ఓకే అన్న తర్వాతే హ్యాచ్ క్లోజింగ్ టాస్క్ కంప్లీట్ అవుతుంది. సునీతా విలియమ్స్ వాళ్ల విషయంలో కూడా 18వ తేదీ ఉదయం 8.15కి ఈ హ్యాచ్ క్లోజింగ్ టాస్క్ ప్రారంభం అవుతుంది.

2. అన్‌ డాకింగ్‌(Un Docking)
క్యాప్సూల్‌కి వెళ్లిపోయిన తర్వాత సునీతా విలియమ్స్ అండ్‌ టీమ్‌ అన్‌డాకింగ్ చేసేయటానికి ఉండదు. దానికి చాలా టైమ్ పడుతుంది. కింద వీళ్లు దిగాల్సిన ప్లేస్ అండ్ కో ఆర్డినేట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అన్ డాకింగ్ జరగాలి. రెండోది వీళ్లున్న క్యాప్సూల్‌లో కూడా ఏదైనా టెక్నికల్ గ్లిచెస్‌లో ఉన్నాయా లేదా అని చూస్తారు. చెక్ లిస్ట్ పెట్టుకుని అన్నీ ఫర్‌ఫెక్ట్‌గా చెక్ చేస్తారు. దీనికి దాదాపుగా మూడు గంటల టైమ్ తీసుకుంటారు. అందుకే 8.15 కి క్యాప్సూల్‌లోకి వెళ్లిపోయినా 11.15 గంటలకు కానీ అన్ డాకింగ్ ప్రక్రియను మొదలుపెట్టరు. అంతా ఓకే అనుకున్న తర్వాత డ్రాగన్ క్యాప్సూల్ ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అన్ డాక్ అవుతుంది.

3. డియోర్బిట్ బర్న్(Deorbit Burn)
ఇప్పుడు క్యాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయినా కూడా అలా భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. దాదాపుగా 15గంటల పాటు ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సునీతా విలిమయ్స్ టీం ఉన్న క్యాప్సూల్ భూమి కక్ష్యలోకి ప్రవేశించాలి. భూమ్మీద క్యాప్సూల్‌ ఎక్కడ దిగాలో కో ఆర్డినేట్స్ సెట్ చేసుకుని వాతావరణం బాగుందా లేదా చూసుకుని ఈ ప్రక్రియ ప్రారంభించారు. అన్నీ బాగున్నాయని అనుకుంటే భూమి కక్ష్యలోకి ప్రవేశించేందుకు క్యాప్సూల్‌ను బర్న్ చేస్తారు. దీంతో సునీతా విలియమ్స్‌ ఉన్న డ్రాగన్ క్యాప్సూల్ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.

4. స్ప్లాష్‌ డౌన్(Splash Down)
భూమి కక్ష్యోలోకి ప్రవేశించిన తర్వాత ఆ క్యాప్సూల్‌ను భూమికి ఉండే గ్రావిటీ లాక్కునే ప్రయత్నం చేస్తుంది. గ్రావిటీ ఆధారంగా ముందుగానే ఫిక్స్ చేసుకున్న కో ఆర్డినేట్స్‌ను అనుసరించి క్యాప్సూల్ అమాంతం భూమిపై పడుతుంది. క్రాష్ ల్యాండింగ్ కాకూడదు కాబట్టి క్యాప్సూల్ జాగ్రత్తగా దిగేలా పారూష్యూట్స్ ఓపెన్ అవుతాయి. అతి జాగ్రత్తగా సముద్రంలో క్యాప్సూల్ దిగేలా ప్లాన్ చేస్తారు. దీన్నే స్పేస్ సైన్స్‌లో స్ప్లాష్ డౌన్ అంటారు. 

ధడేల్ మని పడిన క్యాప్సూల్‌లో నుంచి ఆస్ట్రో నాట్స్ నలుగురిని బయటకు తీసుకువచ్చేందుకు అప్పటికే అక్కడ షిప్స్ అండ్ బోట్స్‌లో రెడీగా నాసా స్విమ్మర్లు, డాక్టర్లు, అధికారులు ఇలా చాలా మంది రెడీగా ఉంటారు. వాళ్లంతా వెళ్లి ఈ నలుగురు క్యాప్సూల్ ఓపెన్ చేసి బయటకు లాగుతారు. అలా తొమ్మిది నెలల తర్వాత సునీతా విలియమ్స్‌ అండ్ టీం భూమ్మీద ఉన్న వారిని పలకరిస్తారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు
హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు  
Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు  - వైసీపీ నేత శ్యామలపై కూడా
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు - వైసీపీ నేత శ్యామలపై కూడా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | భూమ్మీద దిగనున్న సునీతా విలియమ్స్..ముహూర్తం అప్పుడే | ABP DesamNikhil on Swayambhu Movie Update | కొంపల్లిలో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన నిఖిల్ | ABP DesamAR Rahman Wife Saira Rahman | ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సైరా రెహ్మాన్ | ABP DesamNASA Space X Crew 10 Docking Success | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు
హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు  
Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు  - వైసీపీ నేత శ్యామలపై కూడా
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు - వైసీపీ నేత శ్యామలపై కూడా
Chandrababu: గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
Sunitha And Wilmore Latest News: సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే ముహూర్తం ఫిక్స్‌
సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే ముహూర్తం ఫిక్స్‌
Reverse Digital Arrest: డిజిటల్ అరెస్టు చేసి బుక్కయిపోయాడు - ఈ స్కామర్ బుక్కయిన వైనం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు !
డిజిటల్ అరెస్టు చేసి బుక్కయిపోయాడు - ఈ స్కామర్ బుక్కయిన వైనం తెలిస్తే నవ్వకుండా ఉండలేరు !
TTD News:  శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలు - తిరుమలలో ధర్నా చేసిన బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్
శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలు - తిరుమలలో ధర్నా చేసిన బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్
Embed widget