అన్వేషించండి

NASA SpaceX Crew 10 Launch: సునీతా విలియమ్స్ టీంను తీసుకొచ్చే పనిలో నాసా-నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్  

NASA SpaceX Crew 10 Launch : అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది నాసా- స్పేస్‌ఎక్స్‌. నింగిలోకి ఫాల్కన్ 9 రాకెట్ దూసుకెళ్లింది.

NASA SpaceX Crew 10 Launch : ఎలోన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ శనివారం ఉదయం 4:33 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి క్రూ-10 మిషన్‌ను పంపించింది. నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ను తీసుకొచ్చేందుకు ఈ క్రూ-10 మిషన్‌ లాంచ్ చేశారు. మరికొందరు వ్యోమగాములను ISSకి తీసుకువెళుతోందీ మిషన్. ఇప్పుడు వెళ్లిన వాళ్లంతా క్రూ-9 స్థానంలో ఉన్న వారిని రీప్లేస్ చేస్తారు. వారితోపాటు ఎనిమిది నెలలకుపైగా అంతరిక్షంలో చిక్కుకున్న NASA వ్యోమగాములు సునీతా విలియమ్స్,  బుచ్ విల్మోర్ ను భూమిపైకి తీసుకొస్తారు. 
ఊహించని విధంగా అంతరిక్షంలో ఎక్కువ కాలం చిక్కుకున్న విలియమ్స్, విల్మోర్‌ను భూమికి తీసుకురావడంలో ఈ మిషన్ చాలా కీలక పాత్ర పోషించనుంది. NASA అండ్‌ SpaceX శుక్రవారం (స్థానిక సమయం) కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-10 రాకెట్‌తో డ్రాగన్ అంతరిక్ష నౌకను ప్రయోగించాయి.

క్రూ-9 ISSలో తన పనిని పూర్తి చేసిందని, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఆర్బిటింగ్‌ ప్రయోగశాలలో ఎక్కువ కాలం గడిపారని ఇటీవల నాసా పేర్కొంది. ఈ సమయంలో 150 ప్రత్యేకమైన శాస్త్రీయ ప్రయోగాలు చేసినట్టు వెల్లడించారు. 900 గంటలకుపైగా వారి పరిశోధనల్లో నిమగ్నమయ్యారని తెలిపింది. ప్రయోగాలు పూర్తి చేసిన విలియమ్స్, విల్మోర్  గతేడాది సెప్టెంబర్‌లో  నుంచి తిరిగి వస్తారని అంతా భావించారు. కానీ అది వీలుకాలేదు. దీంతో వారు మరికొంత కాలం ఐఎస్‌ఎస్‌లో ఉండాల్సి వచ్చింది.   

బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ద్వారా విలియమ్స్, విల్మోర్ జూన్ 2024లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ మిషన్ దాదాపు ఎనిమిది రోజుల్లోనే పూర్తి అవుతుందని ప్లాన్ చేసుకున్నారు. కానీ స్టార్‌లైనర్ సరిగా పని చేయకపోవడంతో ఆ గడువు పొడిగిస్తూ వచ్చారు. ముందు నాలుగు నెలలు అనుకున్నారు. కానీ ఇంకా ఆ గడువు పెంచుతూ వచ్చారు.  నాసా తన సిబ్బంది లేకుండానే అంతరిక్ష నౌకను తిరిగి తీసుకురావాలని భావించారు. భద్రతా కారణాల దృష్ట్యా స్టార్‌లైనర్ నిలిచిపోయింది. ఇప్పుడు నాసా స్పేస్‌ఎక్స్ క్రూ ద్వారా డ్రాగన్ అంతరిక్ష నౌకలోని వ్యోమగాములను తిరిగి తీసుకురావాలని నిర్ణయించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

love story: ముహూర్తాన తెలిసిన నిజం - వరుడు కాదు.. వాడు అన్నయ్య! అప్పుడేంచేశారు?
ముహూర్తాన తెలిసిన నిజం - వరుడు కాదు.. వాడు అన్నయ్య! అప్పుడేంచేశారు?
America Iran Islamabad Talks: అమెరికా- ఇరాన్ శాంతి చర్చలు పాకిస్తాన్‌లోనే ఎందుకు జరుగుతున్నాయి? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటీ?
అమెరికా- ఇరాన్ శాంతి చర్చలు పాకిస్తాన్‌లోనే ఎందుకు జరుగుతున్నాయి? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటీ?
America Iran Peace Talks: అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వేళ ట్రంప్ హెచ్చరిక! మృతుల ఫొటోలతో పాకిస్థాన్ చేరుకున్న టెహ్రాన్ టీం!
అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వేళ ట్రంప్ హెచ్చరిక! మృతుల ఫొటోలతో పాకిస్థాన్ చేరుకున్న టెహ్రాన్ టీం!
Artemis-2 Mission: చందమామకు టాటా చెప్పి పసిఫిక్ తీరంలో ల్యాండ్ అయిన ఆర్టెమిస్‌-2
చందమామకు టాటా చెప్పి పసిఫిక్ తీరంలో ల్యాండ్ అయిన ఆర్టెమిస్‌-2

వీడియోలు

Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం
IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్
IPL 2026 KKR VS LSG Highlights | లక్నో సూపర్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 PBKS VS SRH Result Update: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆన్ ఫైర్.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో పంజాబ్ ఘ‌న‌విజ‌యం.. బౌల‌ర్ల వైఫ‌ల్యంతో స‌న్ బోల్తా
శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆన్ ఫైర్.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో పంజాబ్ కు ఘ‌న‌విజ‌యం.. బౌల‌ర్ల వైఫ‌ల్యంతో SRH బోల్తా
HYDRA Demolitions: రంగనాథ్ ప్రభుత్వ ఏజెంట్ అని విమర్శలు! అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న హైడ్రా కమిషనర్!
రంగనాథ్ ప్రభుత్వ ఏజెంట్ అని విమర్శలు! అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న హైడ్రా కమిషనర్!
Roja supports DMK: కాంగ్రెస్ కూటమికి తమిళనాడులో రోజా మద్దతు - జగన్ అనుమతించారా?
కాంగ్రెస్ కూటమికి తమిళనాడులో రోజా మద్దతు - జగన్ అనుమతించారా?
Telangana intermediate Results 2026: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు! వాట్సాప్‌లో రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి!
రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు! వాట్సాప్‌లో రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి!
Singer Mangli : లాయర్‌పై సింగర్ మంగ్లీ కంప్లైంట్ - బెదిరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ...
లాయర్‌పై సింగర్ మంగ్లీ కంప్లైంట్ - బెదిరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ...
America Iran Islamabad Talks: అమెరికా- ఇరాన్ శాంతి చర్చలు పాకిస్తాన్‌లోనే ఎందుకు జరుగుతున్నాయి? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటీ?
అమెరికా- ఇరాన్ శాంతి చర్చలు పాకిస్తాన్‌లోనే ఎందుకు జరుగుతున్నాయి? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటీ?
YS Sharmila on Mavigun: జగన్ పేరులో గన్ ఉంది .. అవినాష్ పేరులో వినాశనం ఉంది: MAVIGUNపై షర్మిల సెటైర్లు
జగన్ పేరులో గన్ ఉంది .. అవినాష్ పేరులో వినాశనం ఉంది: MAVIGUNపై షర్మిల సెటైర్లు
Car AC cooling coil: కారు కూలింగ్ కాయిల్స్‌ ఏం చేస్తే సేఫ్ ? లేకపోతే ఇంజిన్, కంప్రెసర్‌పై ఒత్తిడి తప్పదు
కారు కూలింగ్ కాయిల్స్‌ ఏం చేస్తే సేఫ్ ? లేకపోతే ఇంజిన్, కంప్రెసర్‌పై ఒత్తిడి తప్పదు
Embed widget