అన్వేషించండి

Iran Attack Videos: ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో టెన్షన్ టెన్షన్ - గగనతలం మూసివేత - వైరల్ అవుతున్న వీడియోలు

Iran Attack : ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్‌లపై వరుసగా దాడులు చేస్తోంది. అన్ని దేశాల తమ గగనతలాలను క్లోజ్ చేసి పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి.

Iran carrying series of attacks:  మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు అదుపుతప్పి గల్ఫ్ దేశాలన్నింటికీ పాకాయి. ఇరాన్ తనపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ గ్రేట్ రివెంజ్ ను ఉధృతం చేస్తూ, గల్ఫ్ రీజియన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వందలాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.  

ముఖ్యంగా ఖతార్‌లోని అల్-ఉదైద్ ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయంపై క్షిపణులు పడటంతో ఆయా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. తమ భూభాగాలను అమెరికా దాడులకు వేదికగా ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ఇరాన్ హెచ్చరికలతో గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు  అప్రమత్తమయ్యాయి.   

 గల్ఫ్ దేశాల్లోని ప్రధాన నగరాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దుబాయ్, అబుదాబి, దోహా వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు విమాన సర్వీసులను రద్దు చేసి, గగనతలాన్ని మూసివేసాయి. క్షిపణి దాడుల భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా, ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. అనేక దేశాలు తమ రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసి, ఇరాన్ క్షిపణులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కువైట్, యూఏఈలలో ఉన్న అమెరికా స్థావరాల సమీపంలో భారీ పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.  

ఆర్థికంగా కూడా ఈ ప్రభావం గల్ఫ్ దేశాలపై తీవ్రంగా ఉంది. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన  హోర్ముజ్ జలసంధి ని ఇరాన్ తన నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండటంతో, చమురు ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.  ఇప్పటికే సౌదీ అరేబియా,  జోర్డాన్ వంటి దేశాలు ఇరాన్ , అమెరికా మధ్య తటస్థంగా ఉండాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, యుద్ధ మేఘాలు తమ దేశాల సరిహద్దులను తాకడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

ప్రస్తుతం గల్ఫ్ రీజియన్‌లో ఉన్న లక్షలాది మంది వలస కార్మికులు, ముఖ్యంగా భారతీయుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అనేక మంది భారతీయులు ఇరాన్ దాడులు జరుగుతున్న ప్రాంతాలకు సమీపంలోనే ఉండటంతో, వారిని స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Strait of Hormuz Crisis: హర్ముజ్ జలసంధి మూసివేత.. సంక్షోభంతో భారత్‌లో ముడిచమురు ధరలకు రెక్కలు!
హర్ముజ్ జలసంధి మూసివేత.. సంక్షోభంతో భారత్‌లో ముడిచమురు ధరలకు రెక్కలు!
United Nations On Iran crisis: ఇరాన్ పై దాడులను ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోవడం లేదు, UNO స్థాపన ఉద్దేశ్యం ఏంటీ?
ఇరాన్ పై దాడులను ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోవడం లేదు, UNO స్థాపన ఉద్దేశ్యం ఏంటీ?
Does insurance apply in wars: యుద్ధ నష్టాలకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా- ఈ నిజాలు తెలిస్తే షాకే !
యుద్ధ నష్టాలకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా- ఈ నిజాలు తెలిస్తే షాకే !
Iran vs Israel: టెహ్రాన్‌పై దాడికి నేనే ఆదేశించా.. ఇరాన్ అణుశక్తిగా మారకుండా అడ్డుకుంటాం: ట్రంప్
టెహ్రాన్‌పై దాడికి నేనే ఆదేశించా.. ఇరాన్ అణుశక్తిగా మారకుండా అడ్డుకుంటాం: ట్రంప్
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vemulawada Dargah History: వేములవాడ ఆలయంలో 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గా తరలింపుపై వివాదమేంటీ? కోర్టు ఏం చెప్పింది
వేములవాడ ఆలయంలో 800 ఏళ్ల చరిత్ర ఉన్న దర్గా తరలింపుపై వివాదమేంటీ? కోర్టు ఏం చెప్పింది
United Nations On Iran crisis: ఇరాన్ పై దాడులను ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోవడం లేదు, UNO స్థాపన ఉద్దేశ్యం ఏంటీ?
ఇరాన్ పై దాడులను ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోవడం లేదు, UNO స్థాపన ఉద్దేశ్యం ఏంటీ?
Bengal Assembly Elections 2026 : బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
Kesineni Chinni vs MLA Kolikapudi: కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
Hyderabad Traffic Diversion: అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ లోని US consulate రోడ్ మూసివేత
అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ లోని US consulate రోడ్ మూసివేత
Sabarimala Issue: అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
Iran-Israel War : ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
Embed widget