IPL 2025 Mumbai Indians Analysis: ఆరో టైటిల్ పై గురి.. బ్యాటింగ్, బౌలింగ్ లో బలంగా ముంబై.. బుమ్రా దూరం కావడం ఆందోళనకరం.. హార్దిక్ కెప్టెన్సీపై అందరి దృష్టి
గతేడాది జరిగిన మెగావేలంలో కీలక ఆటగాళ్లను తీసుకుని, జట్టు బాగా బలంగా మారింది.అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. దీంతో ఆరో టైటిల్ సాధించి రికార్డులకెక్కాలని ఉవ్విళ్లూరుతోంది.

IPL 2025 MI VS CSK Updates: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. టోర్నీలో తొలిసారిగా ఐదు టైటిల్స్ సాధించిన జట్టు ముంబై. అయితే గతేడాది కొన్ని వివాదాలతో చెత్త ప్రదర్శన నమోదు చేసింది. టోర్నీ పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచి, అట్టడుగు ప్లేస్ తో విమర్శలపాలైంది. అయితే ఈసారి బౌన్స్ బ్యాక్ అయ్యి, ఆరో టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది. ముఖ్యంగా గతేడాదితో పోలిస్తే కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై అభిమానుల్లో పాజిటివ్ నెస్ నెలకొనడం ప్లస్ పాయింట్. అలాగే గతేడాది జరిగిన మెగావేలంలో కీలక ఆటగాళ్లను తీసుకుని, జట్టు బాగా బలంగా మారింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. దీంతో ఆరో టైటిల్ సాధించి రికార్డులకెక్కాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే, బ్యాటర్లంతా జాతీయ, అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు. ఓపెనింగ్ రోహిత్ శర్మ , విల్ జాక్స్ బరిలోకి దిగుతారు. కొన్నిసార్లు ర్యాన్ రికెల్టన్ ను కూడా పరిక్షించవచ్చవు. వన్ డౌన్ లో టీ20 స్టార్ సూర్య కుమార్ యాదవ్, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలతో చాలా పటిష్టంగా ఉంది. జార్ఖండ్ క్రిస్ గేల్ గా పేరుగాంచిన రాబిన్ మిన్జ్ వికెట్ కీపర్ బ్యాటర్ గా బరిలోకి దిగుతాడు. వీళ్లంతా హిట్టింగ్ పేరొందిన వాళ్లు కావడం విశేషం.
బౌలింగ్ పటిష్టం..
బౌలింగ్ లోనూ ముంబై చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడం మైనస్ పాయింట్. తను కొన్ని మ్యాచ్ లకు దూరమవుతాడని ఇప్పటికే అప్డేట్ వచ్చింది అయితే దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, మిషెల్ శాంట్నర్ లతో పటిష్టంగా ఉంది. ఇక స్పెషలిస్టు స్పిన్నర్ లేకపోవడం కాస్త మైనస్ పాయింట్. ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ గా శాంట్నర్ బరిలోకి దిగుతాడు. ఇక కర్ణ్ శర్మ, ముజీబుర్ రహ్మాన్ ఉన్నప్పటికీ వాళ్లంతా ఫామ్ లో లేరు. వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆఫ్గాన్ ప్లేయర్ అల్లా ఘజన్ ఫర్ గాయంతో టోర్నీకి దూరం కావడం చాలా ఇబ్బందిగా మారింది. ఇక సౌతాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్ స్థానంలో ఆల్ రౌండర్ కార్బిన్ బోష్ ను జట్టులోకి తీసుకుంది.
సత్తా చాటుతారా..?
ఈ సీజన్ లో రాణించడం కొంతమంది ప్లేయర్లకు కీలకంగా మారింది. ముఖ్యంగా ఓపెనర్ గా సత్తా చాటి జట్టులో పాతుకుపోవాలని జాక్స్ భావిస్తున్నాడు. అలాగే వికెట్ కీపర్ బ్యాటర్ గా తన మార్కు చూపించి, జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని రాబిన్ యోచిస్తున్నాడు. అలాగే బుమ్రా గైర్హాజరీలో సత్తా చాటాలని దీపక్ భావిస్తున్నాడు. వేలంలో అన్ సోల్డుగా మిగిలి లక్కు కలిసొచ్చి, ముంబై టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముజీబ్.. ఈ అవకాశాన్ని రెండు చేతులా గ్రాబ్ చేసుకోవాలని యోచిస్తున్నాడు. అలాగే సీనియర్ స్పిన్నర్ కర్ణ్ శర్మ కం బ్యాక్ కోసం చూస్తున్నాడు. ఇక ఈ సీజన్ లో కనీస ప్లే ఆఫ్స్ కు చేరడం ముంబైకి తప్పనిసరి, లేకపోతే అన్ని వేళ్లు కెప్టెన్ హార్దిక్ వైపే చూపిస్తాయి. టీమ్ కు ఐద టైటిల్స్ అందించిన రోహిత్ స్థానంలో వచ్చిన హార్దిక్,, ముంబైకి నాయకుడికా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఈసారి కూడా ఫెయిలైతే, తన సారథ్యం గల్లంతవడం ఖాయం. ఇక ఐపీఎల్లో ముంబై ప్రస్థానంలో చెన్నైలో మొదలవబోతోంది. తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ తో చేపాక్ స్టేడియంలో ఈనెల 23న ఆడుతుంది.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవన్ (అంచనా): రోహిత్ శర్మ, విల్ జాక్స్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), కార్బిన్ బోష్, రాబిన్ మింజ్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్, కర్ణ్ శర్మ.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

