Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
బీసీసీఐ రూల్స్ పుణ్యమా అని విజయ్ హజారే ట్రోఫీ 2025 లో తొలిరోజే సెంచరీల మోత మోగింది. గ్రూప్ సీ లో భాగంగా సిక్కింతో ముంబై కి జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ లో మ్యాచ్ జరగగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ని ఫుల్ గా ఖుషీ చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సిక్కిం 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 236పరుగులే చేయగలిగింది. కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లతో రాణించాడు. ఫలితంగా 237పరుగుల ఛేజింగ్ కోసం దిగిన ముంబై..సిక్కిం బౌలర్లను రప్పా రప్పా ఆడించింది. చిన్న కుర్రోడు ఆంగ్ క్రిష్ రఘువంశీతో కలిసి ఓపెనింగ్ కి దిగిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ...సెంచరీతో చెలరేగిపోయాడు. రోహిత్ శర్మను చూద్దామని తరలివచ్చిన వేలాది అభిమానులతో కిక్కిరిసిన స్టేడియంలో ఫ్యాన్స్ ను మైమరిచిపోయేలా సెంచరీతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్ శర్మ. 94 బాల్స్ లో 18 ఫోర్లు 9 సిక్సర్లతో 155 పరుగులు చేశాడు రోహిత్ భాయ్. ఫలితంగా 237పరుగుల టార్గెట్ ని కేవలం 2 వికెట్లు నష్టపోయి 30 ఓవర్లలోనే ఛేజింగ్ చేసేసిన ముంబై 8వికెట్ల తేడాతో మొదటి మ్యాచ్ ను గెలుచుకుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మ్యాన్ ది మ్యాచ్ గా నిలిచాడు.





















