Horoscope Today: ఈ రాశులవారు అప్పులు ఇవ్వొద్దు , తీసుకోవద్దు - మీకు పెట్టుబడులు కలిసొస్తాయ్!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 20 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ అనవసర చర్చల్ని తగ్గించుకుంటే మంచిది. సహనం లేకపోవడం వల్ల ముఖ్యమైన అవకాశాలు కోల్పోతాయి. పిల్లల పెంపకంపై శ్రద్ధ వహించండి. మీరు ఆటలపై ఆసక్తి చూపిస్తారు..( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
వృషభ రాశి
నూతన ప్రాజెక్టులు చేపట్టేందుకు ఈ రోజు మంచిది. అయితే అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించండి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. మీ ఉత్పత్తుల నాణ్యతపై శ్రద్ధ వహించండి. ప్రేమ వ్యవహారాలు పెళ్లి దిశగా అడుగేస్తాయి. (వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
మిథున రాశి
ఈ రోజు మీ మాటతీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇంటా బయటా గౌరవం కోల్పోతారు. మీ దినచర్యలో కొత్త మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. ప్రత్యర్థులు మీ వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తారు. కొత్త వ్యాపార భాగస్వామ్యానికి రోజు శుభప్రదమైనది. (మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కర్కాటక రాశి
ఈ రోజు మీ కార్యాచరణ బావుంటుంది. ఉద్యోగం చేసేవారు ఉన్నతాధికారులతో సమన్వయంతో ఉండాలి. సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మానసిక ఒత్తిడి , గందరగోళం నుంచి బయటపడతారు. (కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
సింహ రాశి
ఈ రోజు మీరు నూతన వ్యాపారం ప్రారంభించవచ్చు. మీ తెలివితేటలు అవగాహనను ప్రశంసిస్తారు. మీ ప్రణాళికలను ఎవరి ముందు బహిర్గతం చేయొద్దు. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. (సింహరాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కన్యా రాశి
ఈ రోజంతా మీరు చాలా బిజీగా ఉంటారు. గందరగోళ విషయాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో ప్రయోజనాలను పొందుతారు. మార్కెటింగ్ రంగంలో ఉండేవారికి లాభం. ( కన్యారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
తులా రాశి
ఈ రోజు ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు, మీరు అప్పు తీసుకోవద్దు. మీ విశ్వాసం , ధైర్యం తగ్గుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాలలో నిర్లక్ష్యంగా ఉండకండి.
వృశ్చిక రాశి
మీరు ఈ రోజు పనిని సమయానికి పూర్తి చేస్తారు. పాత స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. అధిక రక్తపోటు సమస్యను అధిగమిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య పరస్పర సామరస్యం చాలా బాగుంటుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు ఒకేసారి చాలా పనులు చేయాల్సి ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే ప్రయత్నంలో మీ ఆసక్తుల విషయంలో రాజీ పడకండి. తగినంత నిద్ర అవసరం. మానసిక ప్రశాంతత ఉండకపోవడంతో ఏకాగ్రత తగ్గుతుంది.
మకర రాశి
ఈ రోజు నూతన పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో ప్రత్యేక పురోగతి సాధించే అవకాశం ఉంది. యువత ప్రేమ ప్రతిపాదనలను పొందవచ్చు. మీ జీవిత భాగస్వామిని సంప్రదించండి. మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది.
కుంభ రాశి
ఈ రోజు మీరు సహోద్యోగులకు సహాయపడతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. మీ సమయం చాలావరకు స్వీయ -నిర్ణయాధికారంలో గడుపుతారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన సమస్యలపై చర్చిస్తారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలున్నాయి
మీన రాశి
ఈ రోజు కార్యాలయంలో మీ గౌరవం మరింత పెరుగుతుంది. కానీ చాలా కష్టపడిన తర్వాత మాత్రమే ఫలితాలు పొందుతారు. రోజంతా బిజీగా ఉంటారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు. మా మాటతీరు మెచ్చుకోలుగా ఉంటుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

