Horoscope Today: ఈ రాశులవారి కెరీర్లో పురోగతి ఉంటుంది..వివాదాల నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంటారు
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 21 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మేష రాశివారు చికాకుగా ఉంటారు. మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ప్రవర్తన విమర్శలు ఎదుర్కొనేలా చేస్తుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది.
వృషభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. పెద్దలను గౌరవించండి. పని ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ గురించి ఆలోచిస్తారు. మీ పనితీరుని మార్చుకోవాల్సి ఉంటుంది
మిథున రాశి
వివాదాలు తీరి ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం మీకు లభిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు. సృజనాత్మక రచనలపై మనసు లగ్నం అయి ఉంటుంది. వినోద ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి వ్యాపారులు నూతన పరిచయాలతో వ్యాపార విస్తరణ ప్లాన్ చేస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో అనవసర వాదనకు దిగొద్దు. ఇనుము వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. నూతన ప్రేమ సంబంధాలు పెళ్లి దిశగా అడుగు పడతాయి.
సింహ రాశి
ఈ రోజు మానసికంగా అలసిపోతారు. తగిన విశ్రాంతి తీసుకునేందుకు ప్లాన్ చేసుకోండి. మీ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాలి. ఉద్యోగం, వ్యాపారం మీ పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు . విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ వహించాలి.
కన్యా రాశి
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలకు సమయం కేటాయిస్తారు. ఓ శుభవార్త వింటారు. వ్యక్తిగత వ్యాపారాల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో సంతోషం ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. నూతన పరిచయాలు లాభిస్తాయి.
తులా రాశి
ఈ రోజు మీరు ఏదో విషయంలో బాధపడతారు. పిల్లలపై శ్రద్ధ తీసుకోండి. వాతావరణంలో మార్పుల ప్రభావం మీ ఆరోగ్యంపై ఉంటుంది. అప్పులు చేయొద్దు. ఉద్యోగంలో పని విషయంలో నిర్లక్ష్యం వద్దు.
వృశ్చిక రాశి
మీ ప్రతిభను మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించండి. ఆగిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయి. ఈ రోజు మీ దినచర్య క్రమశిక్షణతో ఉంటుంది. అన్ని రచనలు ఎటువంటి అవరోధం లేకుండా పూర్తవుతాయి. కెరీర్‌లో మంచి అవకాశం పొందే అవకాశం ఉంది.
ధనస్సు రాశి
ఈ రోజు మీకు బలహీనంగా ఉంటుంది. కొత్త సంబంధాల గురించి ఇబ్బంది ఉండవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో అదనపు సమయం కేటాయించాల్సి రావొచ్చు.అనవసర పోటీకి దిగొద్దు. వ్యాపారంలో మార్పులు చేర్పులు ఇప్పుడు చేయడం సరికాదు. కోపం తగ్గించుకోవాలి
మకర రాశి
మకర రాశివారికి ఈరోజు నూతన పరిచయాలు ఏర్పడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. ప్రభుత్వ అధికారుల సహాయంతో, అవసరమైన పని సకాలంలో జరుగుతుంది. దీని కారణంగా మీ విశ్వాసం పెరుగుతుంది.
కుంభ రాశి
ఈ రోజు మీరున్న రంగంలో అదనపు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇంట్లో క్రమశిక్షణ సరిగా ఉండదు. చట్టపరమైన వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించి గొప్ప ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.
మీన రాశి
ఈ రాశివారు విమర్శలకు కుంగిపోవద్దు. మీ పనిలో ఎవరి జోక్యాన్ని సహించకండి. వివాహం గురించి ఆందోళన చెందుతారు. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

