అన్వేషించండి
Brahmamudi Serial Today March 19th Episode Highlights: అతిగా ఆశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు.. యామిని కుట్రకి కావ్య చెక్ పెడుతుందా - బ్రహ్మముడి మార్చి 19 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: రాజ్ ని రామ్ గా మార్చేసింది యామిని. రాజ్ చచ్చిపోయాడని ఇంట్లో అందరూ నమ్ముతున్నా కావ్య మాత్రం తను తిరిగివస్తాడంటోంది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇవే...

Brahmamudi Serial March 19th Episode
1/9

రాజ్ కి కర్మకాండలు జరిపిస్తుంటే కావ్య వచ్చి అడ్డుకుంటుంది. నా భర్త బతికే ఉన్నాడని ఏడుస్తుంది. ఇందిరాదేవి, అపర్ణ, రుద్రాణి అందరూ చెప్పినా వాదిస్తుంది కావ్య
2/9

స్వప్న, అప్పు కూడా కావ్యను అడ్డుకోవడంతో..మీరుకూడా నన్ను నమ్మడం లేదా? ఆయన బతికే ఉన్నారు నేను కళ్లారా చూశాను నా భర్త నాకు తెలియదా? ఆ స్పర్శనాకు తెలియదా? ఎందుకు ఎవరూ నమ్మడం లేదని ఏడుస్తుంది.
3/9

కావ్యను లోపలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారంతా. ఆవేశంగా అందర్నీ తోసేసిన కావ్య.. నా పసుపు కుంకుమలు తుడిచేసే హక్కు ఎవ్వరికీ లేదు.. నా ఐదో తనాన్ని తీసేసే హక్కు నేను ఎవరికీ ఇవ్వడం లేదంటుంది.
4/9

పసుపు కుంకాలు తీయాలా వద్దా అనేది నీ ఇష్టం..కానీ నా కొడుక్కి తిలోదకాలు వదలకపోతే అది మమ్మల్ని జీవితాంతం దహించివేస్తుంది.. నీకు దండం పెడతాను ఈ తంతు జరగనివ్వు అంటుంది అపర్ణ. మీ కొడుకు నిజంగా బతికే ఉన్నాడు అత్తయ్యా అని ఏడుస్తుంది. ఏంటి అత్తయ్యా ఇది నిజమేనా మనమే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నామా అని ఇందిరాదేవిని అడుగుతుంది అపర్ణ.
5/9

కావ్య మాట నిజమైతే...రాజ్ ఇంటికి వచ్చేవాడు కదా, కావ్యను చూసి కూడా వదిలేశాడు అంటే అర్థం ఏంటి అని సుభాష్ అంటాడు. భ్రమలో ఉన్న కావ్యను హాస్పిటల్ కి తీసుకెళ్లండి అంటుంది రుద్రాణి. కళ్యాణ్ ...నువ్వు అప్పు హాస్పిటల్ కి తీసుకెళ్లండి అంటుంది ధాన్యలక్ష్మి.
6/9

అంతా కలసి నన్ను పిచ్చిదాన్ని చేయాలి అనుకుంటున్నారా అని బాధపడుతుంది కావ్య. నేను ప్రూవ్ చేసి చూపిస్తానంటూ రాజ్ ఫొటో తీసుకుని వెళ్లిపోతుంది
7/9

రాజ్ తనకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడంటూ ఇరిటేట్ అవుతుంది యామిని. ఏం చేస్తున్నాడని వైదేహి అడిగితే.. ఎవర్నో కాపాడాడు తన గురించే ఆలోచిస్తున్నాడని చెబుతుంది
8/9

రాజ్ ఆలోచిస్తే తలనొప్పి వస్తుంది కానీ గతం గుర్తుకు రాదుకదా అంటుంది..రాజ్ కాదు రామ్ అని ఫైర్ అవుతుంది యామిని .
9/9

బ్రహ్మముడి మార్చి 20 ఎపిసోడ్ లో... అక్కమాటపై నాకు నమ్మకం ఉంది కేసు రీఓపెన్ చేయిస్తా అంటుంది అప్పు. ఈ లోగా మా ఆయన్ని తీసుకొచ్చి అందరి ముందూ నిలబెడతా అంటుంది కావ్య. మరోవైపు కావ్యను చంపేందుకు ప్లాన్ చేస్తుంది రుద్రాణి
Published at : 19 Mar 2025 09:31 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
హైదరాబాద్
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion