అన్వేషించండి

Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?

Telangana News: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు కేంద్రం పచ్చజెండా ఊపుతుందా. బీసీ రిజర్వేషన్లు పెంచితే అది తేనె తుట్టె కదిపినట్లేనా? ఇతర రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్‌ వస్తే కేంద్రం నుంచి సమాధానం ఏంటీ?

Telangana Latest News: బీసీ రిజర్వేషన్ బిల్లు శాసన సభలోను, శాసన మండలిలో ఆమోదం పొందింది. ఇక బీసీ రిజర్వేషన్లు పెరగనున్నాయి. ఇప్పటి దాకా విద్య ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో బీసీలకు 29 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. దాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన నిర్వహించింది. ఈ గణనలో 56.36 శాతం బీసీలు రాష్ట్రంలో ఉన్నట్లు తేలింది. ఈ మేరకు బీసీలకు 42 శాతానికి రిజర్వేషన్ల పెంచుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సంబంధింత బిల్లులకు చట్ట సభలు ఆమోద ముద్ర వేశాయి. అంటే ఇక నుంచి విద్యా సంస్థల్లో, ప్రభుత్వ నియామకాల్లో, అదే రీతిలో పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పోరేషన్ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల ఫలాలు బీసీలకు దక్కనున్నాయి. ఇంతటితో పని పూర్తి అయినట్లు కాలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలోని చట్ట సభలు బిల్లుకు ఆమోద తెలిపి కేంద్రానికి పంపనుంది.

పార్లమెంట్‌లో ఓకే అయితేనే..
దేశంలో రిజర్వేషన్ల పెంచాలన్నా, తగ్గించాలన్నా, ఆయా కులాల జాబితాను మార్చాలన్నా రాష్ట్రాలకు అధికారం లేదు. ఈ అంశం కేంద్ర జాబితాలోది. కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. ఇక చట్ట సభల ఆమోదం పొందిన ఈ రిజర్వేషన్ల పెంపు బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ఆ బిల్లును పార్లమెంట్ మూడింట రెండు వంతుల మెజార్టీతో ఆమోదించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. అలా మించితే రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ -9లో చేర్చాలి. ఈ రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్ పెంచి ఇస్తే ప్రస్తుతం ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10 శాతం కలుపుకుంటే మొత్తం 67 శాతానికి చేరుకుంటుంది. ఇది సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకం. అలా సవరణ చేయాలంటే అందుకు సరైన కారణాలు వెల్లడించారు. అందుకు తగిన గణాంక సమాచారం  అందుబాటులో ఉంటే అప్పుడు తగిన కారణాలతో రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువగా పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఈ కారణలతోనే రేవంత్ సర్కార్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి లీగల్‌గా ఎదుర్కునే రీతిలో పటిష్టంగానే బీసీ గణన చేపట్టింది. సమగ్ర కుటుంబ సర్వే తర్వాతనే బీసీ లెక్కలను తెల్చి చెప్పింది. ఆ తర్వాత చట్టసభల్లో ఈ బిల్లులకు ఆమోద ముద్ర పడింది. ఇక ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పెంపు బంతి కేంద్రం కోర్టులో పడేసింది. పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మద్దతు ఇస్తే రాజ్యాంగ సవరణ వీలవుతుంది. అప్పుడే రాష్ట్రంలో పెంచిన బీసీ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి.

మోడీ సర్కార్ మరి బీసీ రిజర్వేషన్లకు పచ్చ జెండా ఊపుతుందా..?
కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందే బీసీ గణన చేపడతామని చెప్పింది. బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ముఖ్యనేత రాహూల్ గాంధీ చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో ఇదే ప్రస్తావించారు. అందుకు అనుగుణంగా రేవంత్ సర్కార్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే దేశవ్యాప్త కులగణన విషయంలో మోదీ సర్కార్ సానుకూలంగా స్పందిస్తుందా అన్నది వేచి చూడాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీసీలంతా ఐక్యంగా ఉండాలని, బీసీ లెక్కలు అవసరం లేదన్న రీతిలో మోదీ నర్మగర్భంగా తన అభిప్రాయాన్ని వెళ్లడించారు. ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంపు బిల్లుకు ఆమోద ముద్ర వేస్తే అది కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఓ అస్త్రంగా మారనుంది. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించినందుకు మేం బీసీలకు మేలు చేసేలా రిజర్వేషన్లు పెంచామని, పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టింది చేసి చూపించామని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. అలా బీసీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు దగ్గరయ్యే అవకాశం లేకపోలేదు. ఇలా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండేలా మోదీ సర్కార్ తెలంగాణ బీసీ రిజర్వేన్ల పెంపు బిల్లుకు సానుకూలంగా స్పందిస్తుందా లేదా చూడాలి.

బీసీ ఉచ్చులో బీజేపీ ఇరుక్కుంటుందా..?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే తేనె తుట్ట కదిపినట్లే. ఇదే రీతిలో అన్ని రాష్ట్రాల నుంచి రిజర్వేషన్ల పెంచాలన్న డిమాండ్లు వస్తాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఈ సమస్య ఎదురుకావచ్చు.  ఒక వేళ ఈ రిజర్వేషన్ల బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండా పక్కన పెడితే బీసీ వ్యతిరేక పార్టీగా బీజేపికి తెలంగాణలోను, దేశవ్యాప్తంగా ముద్రపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి డిమాండ్లే ఏపీ నుంచి, ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చే అవకాశం ఉంది. వారిని కాదని కేంద్రంలో బలహీనంగా ఉన్న బీజేపీ పార్టీ నిర్లయం తీసుకోలేని పరిస్థితి. ఒక వేళ తీసుకుంటే ఆ సక్సెస్ తన ఖాతాలో పడుతుందా లేక మొదటి నుంచి బీసీ రాగం వినిపించిన కాంగ్రెస్ ఖాతాలో పడుతుందా అన్న డైలమా కమలనాథుల్లో లేకపోలేదు. రానున్న రోజుల్లో ఈ బీసీ ఉచ్చు నుంచి బీజేపీ ఎలా తప్పుకుంటుందో వేచి చూడాలి. అయితే తెలంగాణలోని రాజకీయ పార్టీలను తీసుకుని ప్రధానికి కలవాలని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ రిజర్వేషన్ల బిల్లు ఎందాక ముందుకు సాగి ఆచరణలోకి వస్తుందో మాత్రం వేచి చూడాలి.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Embed widget