Sunita Williams Crew 9 Dragon Capsule Splash Down | భూమిపైకి క్షేమంగా సునీతా విలియమ్స్ | ABP Desam
తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు సునీతా విలియమ్స్ విజయవంతంగా భూమిని చేరుకున్నారు. సునీతా విలియమ్స్ తో పాటు క్రూ9 కి చెందిన మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో ఉన్న డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా సముద్ర తీరంలో సేఫ్ ల్యాండ్ అయ్యింది. పారాచూట్లతో సముద్రంలోకి దిగుతున్న డ్రాగన్ క్యాప్సూల్స్ చూసి నాసా, స్పేస్ ఎక్స్ సంస్థ సైంటిస్టులు సంబరాలు చేసుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి అన్ డాక్ అయ్యాక దాదాపు 17 గంటల పాటు భూమి కక్ష్యలో ప్రయాణించి ఆ తర్వాత డీఆర్బిట్ బర్న్ ద్వారా భూమి కక్ష్యలోకి ప్రవేశించారు. నిర్దేశిత ప్రదేశంలో స్ప్లాష్ డౌన్ అయ్యేలా ముందే ఏర్పాటు చేసుుకన్న కో ఆర్డినేట్స్ కి అనుగుణంగానే డ్రాగన్ క్యాప్స్సూల్ భూమిపై దిగింది. పారాచూట్స్ తెరుచుకుని డ్రాగన్ క్యాప్స్సూల్ దిగగానే నాసా, స్పేస్ ఎక్స్ సైంటిస్టులు, ఉద్యోగులు సంబరాల్లో మునిగిపోయారు. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సునీతా విలియమ్స్ మరో ముగ్గురూ ఆస్ట్రోనాట్లు సేఫ్ గా భూమిపైకి చేరుకోవటంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్లైంది.





















