Vijayasai Reddy CID: విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Vijaysai: విజయసాయిరెడ్డి కి సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. 25వ తేదీన విచారణకు రావాలని ఆదేశించింది.

CID issues notice to Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల ఇరవై ఐదో తేదీన విజయవాడ సీఐడీ ఆఫీసులో హాజరు కావాలని ఆశించారు. ఈ నెలలో ఇప్పటికే ఓ సారి విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. కాకినాడ పోర్టును బలవంతంగా లాక్కున్నారన్న కేసులో ఈ విచారణ జరిగింది. ఈ సారి ఆయనను లిక్కర్ కేసులో విచారించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే కాకినాడ పోర్టు కేసులో విజయసాయిరెడ్డి విచారణ
కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలపై పోర్టు యజమాని కేవీరావు ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ విచారణ జరుపుతోంది ఈ కేసులో విజయసాయిరెడ్డి ఏ2గా ఉన్నారు. అయితే తనకేమీ సంబంధం లేదని ఈ కేసులో కర్త , కర్మ క్రియ అంతా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని విజయసాయిరెడ్డి సీఐడీకి చెప్పారు. ఈ కేసులో ఆయన వద్ద నుంచి మరింత సమాచారం తీసుకోవడం కోసం నోటీసులు జారీ చేసి ఉంటారని భావిస్తున్నారు. అదే సమయంలో ఏపీలో అత్యంత భారీ స్కాంగా ప్రచారం జరుగుతున్న లిక్కర్ స్కాం విషయంోలనూ ఆయన గత విచారణ తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాంలో కూడా కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి అని చెప్పారు.
ఈ సారి లిక్కర్ స్కాంలో విచారణ చేస్తారా ?
లిక్కర్ స్కామ్ పై సీఐడీ ఇప్పటికే కేసులు నమోదు చేసింది. అయితే ఆ కేసుల్లో నిందితుడిగా విజయసాయిరెడ్డి ఉన్నారో లేదో స్పష్టత లేదు. టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ గురించి ఎక్కువగా ఆరోపణలు చేసేవారు. ఆ సంస్థ విజయసాయిరెడ్డికి అల్లుడు శరత్ చంద్రారెడ్డికి బినామీదని చెప్పేవారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ లెక్కలన్నీ తేల్చేస్తామనేవారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం తన అల్లుడి కంపెనీలతో తనకు సంబంధం లేదని అంటున్నారు. రాజ్ కసిరెడ్డినే అంతా చేశారని ఆరోపిపిస్తున్నాయి.
నిజాలుచెబితే లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపులు
విజయసాయిరెడ్డి ఒక వేళ లిక్కర్ స్కాంలో తనకు తెలిసినవన్నీ సీఐడీకి చెబితే సంచలనాత్మక స్టేట్ మెంట్ అవుతుంది. ఇప్పటికే సీఐడీ కీలక విషయాలను దర్యాప్తులో కనిపెట్టిందన్న ప్రచారం జరుగుతోంది. వివిద డిస్టిలరీల నుంచి సేకరించిన సమాచారంతో పాటు ఆయా డిస్టిలరీలు వందలకోట్ల లంచాన్ని బంగారం రూపంలో రాజకీయ నేతలుకు ఇచ్చాయని చెబుతున్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి విచారణ అత్యంత కీలకం కానుంది.
వైసీపీతో విబేధించిన తర్వాత విజయసాయిరెడ్డి విచారణలకు హాజరవుతున్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నానని చెబుతున్నా ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. జగన్ చుట్టూ ఉండే కోటరీ గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో సీఐడీ వరుసగా విచారణలకు పిలుస్తూండటం సంచలనంగా మారింది..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

