Crime News: మైనర్ బాలికకు అబార్షన్... పీఎంపీ డాక్టర్ అరెస్ట్, ఎక్కడంటే..!
Telangana News | కొన్ని రోజుల కిందట మైనర్ బాలికకు అబార్షన్ చేసిన డాక్టర్ వివరాలు సేకరించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

Adilabad News | గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లాలో ఓ వాగులో అప్పుడే పుట్టిన ఓ పసికందు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, ఎట్టకేలకు నిందితున్ని అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం గురుజా గ్రామ శివారులోని వాగు వద్ద ఈనెల 11వ తేదీన ఉదయం పూట అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం లభ్యం కావడం తెలిసిందే.
స్థానికులు సమాచారం తెలపడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. కారకులను తెలుసుకొని నిందితుడిని పట్టుకున్నారు. మండలంలోని ఓ బాలికకు అబార్షన్ చేసిన కేసులో పిఎంపీ వైద్యుడు సూర్యవంశీ దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుడిహత్నూర్ మండలం గురిజ గ్రామంలో ఇటీవల పసికందు మృతదేహం లభ్యం అవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. 15 ఏళ్ల మైనర్ బాలికకు అబార్షన్ చేసినట్లు గుర్తించారు. దీంతో అతడి క్లినిక్ ను సీజ్ చేసి పీఎంపి వైద్యుడిని అరెస్ట్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నారు. పీఎంపీ వైద్యులు ఎవరు కూడా ఇలాంటి కేసులను డబ్బుల కోసం కక్కుర్తి పడి జీవితం పాడు చేసుకోకూడదని, ఎవరైనా ఇలాంటి చేష్టలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఉట్నూర్ ఏ.ఎస్పీ కాజల్ సింగ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా అవగాహన కల్పించడంతోపాటు ప్రతిరోజు క్షుణ్ణంగా గ్రామాలలో పోలీసింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవరైనా ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

