అన్వేషించండి
Gunde Ninda Gudi Gantalu March 19th Episode Highlights: దొంగతనం చేసి దొరికిపోయిన ఓవరాక్షన్ చంద్ర కాంతం .. బాల్ బాలు కోర్టులోకి వచ్చేసింది - గుండె నిండా గుడి గంటలు మార్చి 19 ఎపిసోడ్ హైలెట్స్!
Gunde Ninda Gudi Gantalu March 19th Episode: చెల్లెలి వేడుక కోసం బాలు 24 గంటలు డ్రైవింగ్ చేసి డబ్బులు సమకూరుస్తాడు. మౌనిక అత్తింటివారు మాత్రం బాలు ఇంట్లో ఉండకూడదంటారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Gunde Ninda Gudi Gantalu March 19th Episode Highlights
1/10

బాలుని అవమానించేందుకు కాళ్లుకడమని చెబితే పెద్ద కొడుకు ఉన్నాడుగా అంటూ మీనా ఇరికిస్తుంది. అవన్నీ గుర్తుచేసుకుని రగిలిపోతుంటాడు సంజయ్. వాడిని ఎందుకు ఇంట్లో ఉండినిచ్చావ్ అని తండ్రి అంటే..వాడిని ఏడిపిస్తేనే కదా కిక్ అంటాడు సంజయ్.
2/10

వాడిని నువ్వు ఒక్కరోజు ఇంట్లో లేకుండా చేయాలి అనుకున్నావ్..కానీ నేను వాడిని ఏకంగా ఇంట్లోంచి గెంటేయడానికి అంటుంది సంజయ్ అత్త చంద్రకాంతం. ఈ ఫంక్షన్ జరగనివ్వకుండా నేను చూసుకుంటా అంటుంది.
3/10

ప్రభావతి వచ్చి లోపలకు పిలిస్తే..ఇదేనా మర్యాద అంటూ మళ్లీ నోరుపారేసుకుంటుంది చంద్రకాంతం. ఎలాంటి కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావురా.. చివరకు నిన్ను పూలకొట్టులో పెట్టి అమ్మేస్తారేమో అంటుంది. ఇంతకీ పుస్తెల తాడు కొన్నారా అంటుంది
4/10

పుస్తెలతాడు మాయం చేస్తే ఫంక్షన్ ఆగిపోతుందని ప్లాన్ చేస్తుంది చంద్రకాంతం. నిన్ను కాదని లేచిపోయి పిల్ల ఎవరు అని అడిగితే.. నేనే అంటూ కౌంటర్ ఇస్తుంది శ్రుతి. కోట్ల ఆస్తిని వదులుకుని ఈ కొంపలో పడ్డావ్ అంటూ సెటైర్స్ వేస్తుంది.
5/10

మా గురించి తెలిసే మీ తమ్ముడు సంబంధాన్ని కలుపుకోవాలని వచ్చారు మా అంతట మేం మీ వెనకాల పడలేదు అంటాడు సత్యం. ఈ గొడవ ఎక్కడకు దారితీస్తుందో అని కంట్రోల్ చేయాలని మౌనికను తీసుకెళ్లి రెడీ చేయమంటుంది.
6/10

మౌనిక వెళ్లి చాలాసేపు అయింది అన్నీ చెప్పేస్తుందేమో నువ్వు వెళ్లు అని సంజయ్ ని పంపిస్తాడు నీలకంఠం. అదే సమయానికి శృతి, మీనా ఇద్దరూ మౌనికను ఆరాతీస్తారు. అప్పుడే వస్తాడు బాలు.
7/10

నువ్వు ఇంకా ఇక్కడున్నావేంటి అన్నయ్యా.. నా అత్తింటివారి మాటంటే లెక్కలేదా అని ఫైర్ అవుతుంది. అంతా షాక్ అవుతారు. నా భార్య నా మాట వింటుందనే నమ్మకంతో వెళ్లిపోతాడు సంజయ్
8/10

కారు EMI కట్టలేదంటూ ఓనర్ వచ్చి బాలుతో గొడవపడతాడు. ఇదే అవకాశంగా మేం డబ్బు కడతాం అని నీలకంఠం అంటాడు. వద్దనేస్తాడు బాలు.. నా ఇంటి విషయం నేను చూసుకుంటా అంటాడు. ఆడపిల్లను ఇచ్చాం అనే కారణంగా మీ అక్క ఎంత అవమానిస్తున్నా భరిస్తున్నాం అంటాడు సత్యం
9/10

బాలుని బయటకు వెళ్లిపోమని చెబుతాడు సత్యం. నేను కంట్రోల్ లోనే ఉంటాను అంటాడు బాలు. భోజనాల టైమ్ లో కూడా అవమానించడమే పనిగా పెట్టుకుంటుంది చంద్రకాంతం.
10/10

గుండె నిండా గుడి గంటలు మార్చి 20 ఎపిసోడ్ లో.. పుస్తెలతాడు కనిపించలేదని టెన్షన్ పడుతూ ఉంటారు. మన గదిలోకి చివరిగా వెళ్లింది ఎవరు అని బాలు అడిగితే చంద్రకాంతం అత్తయ్య అని చెబుతుంది మీనా...
Published at : 19 Mar 2025 10:02 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
హైదరాబాద్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion