SINGLE Movie Release: వేసవిలో శ్రీ విష్ణు 'సింగిల్' రిలీజ్... కేతికా శర్మ హీరోయిన్‌గా నటించిన సినిమా
Sree Vishnu and Kethika Sharma Movie: శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన సింగిల్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు అయింది. ఇందులో ఆయన సరసన కేతికా శర్మ, ఇవాన హీరోయిన్లుగా నటించారు.

నితిన్ 'రాబిన్ హుడ్' సినిమాలో స్పెషల్ సాంగ్ 'అదిదా సర్‌ప్రైజ్' కారణంగా హీరోయిన్ కేతిక శర్మ (Ketika Sharma) వైరల్ అవుతోంది. స్పెషల్ సాంగ్ సంగతి ఓకే... మరి హీరోయిన్ రోల్స్ పరిస్థితి ఏమిటి? ఆవిడ కథానాయికగా సినిమాలు ఏమీ లేవా? అంటే... శ్రీ విష్ణు 'సింగిల్' ఉంది. తాజాగా ఆ సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేశారు.
మే 9న థియేటర్లలోకి శ్రీ విష్ణు సింగిల్!
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'హ్యాష్ ట్యాగ్ సింగిల్' (#Single). ఇందులో కేతికా శర్మ ఒక హీరోయిన్. 'లవ్ టుడే' ఫేమ్ ఇవానా మరొక హీరోయిన్. గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ సంస్థతో కలిసి విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
𝗠𝗶𝘁𝗿𝗮𝗱𝗿𝗼𝗵𝗶𝘀 are everywhere☺️
— Sree Vishnu (@sreevishnuoffl) March 20, 2025
And we all have that one friend in our gang, tag that friend from your gang with #Single 🫵
Coming this MAY with an ENTERTAINMENT MAYhem 😎✌️#SingleMovie @TheKetikaSharma @i__ivana_ #AlluAravind @caarthickraju #VidyaKoppineedi… pic.twitter.com/8aeeX3uvh6
'హ్యాష్ ట్యాగ్ సింగిల్'కు 'నిను వీడని నీడను నేనే' ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీ విష్ణు రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు. పగటిపూట కేర్ ఫ్రీ ఫ్రెండ్, రాత్రి వేళల్లో రొమాంటిక్ వ్యక్తిగా కనిపించనున్నారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించే వినోదాత్మక చిత్రంగా 'సింగిల్' రూపొందినని ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది.
Also Read: ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
#Single Movie Cast And Crew: శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా, 'వెన్నెల' కిషోర్ నటిస్తున్న ఈ సినిమాకు కూర్పు: ప్రవీణ్ కెఎల్, డైలాగ్స్: భాను భోగవరపు - నందు సవిరిగాన, కళా దర్శకత్వం: చంద్రిక గొర్రెపాటి, కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం, ఛాయాగ్రహణం: ఆర్ వెల్‌రాజ్, సంగీతం: విశాల్ చంద్ర శేఖర్, నిర్మాణ సంస్థలు: గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్, నిర్మాతలు: విద్యా కొప్పినీడి - భాను ప్రతాప - రియాజ్ చౌదరి, సమర్పణ: అల్లు అరవింద్, రచన - దర్శకత్వం: కార్తీక్ రాజు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

