APPSC Group -2 Results : ఏపీ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు విడుదల- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
APPSC Group -2 Results : ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. 905 ఉద్యోగాలకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. మొత్తం

APPSC Group -2 Results: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ఏప్రిల్ 4న విడుదల చేసింది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలకు సంబంధించి మొత్తం 2517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇందులో సాధారణ కోటా కింద 2168 మంది ఉండగా.. స్పోర్ట్స్ కోటా కింద 370 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరి నుంచి ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేశారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. ఫలితాలతోపాటు మెయిన్స్ పరీక్షల తుది ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ అందుబాటులో ఉంచింది. ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీని కమిషన్ విడుదల చేసింది.
గ్రూప్-2 మెయిన్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
Note: స్పోర్ట్స్ కోటా కిందక ఎంపికైన 370 మందిలో, 2168 మంది రెగ్యులర్ అభ్యర్థుల జాబితాలోని వివిధ కేటగిరీలలో ఇరవై ఒక్క (21) మంది అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం తాత్కాలికంగా ఎంపిక చేశారు.
గ్రూప్- మెయిన్స్ ఆన్సర్ కీలు..
- Final Key in Question Paper Format for Paper-I Series-A
- Final Key in Question Paper Format for Paper-II Series-A
- Final Key in Question Paper Format for Paper-I Series-B
- Final Key in Question Paper Format for Paper-II Series-B
- Final Key in Question Paper Format for Paper-I Series-C
- Final Key in Question Paper Format for Paper-II Series-C
- Final Key in Question Paper Format for Paper-I Series-D
- Final Key in Question Paper Format for Paper-II Series-D
గ్రూప్-2 నోటిఫికేషన్‌లో రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. వాటిని ఏపీపీఎస్సీ పట్టించుకోలేదు. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. దీనిపై పోరాటం ఉద్ధృతం చేసిన అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో ప్రక్రియ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే కోర్టుల్లో ఈ కేసులు వీగిపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించింది. పరీక్షకు రెండు రోజుల ముందు నుంచి తమ ఆందోళన మరింత తీవ్రం చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ వరకు ఈ ఆందోళన ఉద్ధృతం అయ్యాయి. పరీక్షకు ఒక్క రోజు ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల విన్నపాన్ని మన్నించి పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి సూచనలు చేసింది. దీంతో పరీక్ష ముందు రోజు హైడ్రామా నడిచింది. పరీక్ష వాయిదాకు ప్రభుత్వం ఓకే చెప్పినప్పటికీ ఏపీపీఎస్సీ మాత్రం తన పట్టు వీడలేదు. అప్పటికే ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందున ప్రభుత్వ ఆదేశాలను పాటించలేమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. దీంతో అనుకున్నట్టుగానే పరీక్షను నిర్వహించింది. ఆ ఫలితాలను ఏప్రిల్ 4న అర్థరాత్రి విడుదల చేసింది.
ఏపీలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో గతేడాది (2024) ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87.17 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో మొత్తం 905 గ్రూప్-2 పోస్టులకుగాను 4,83,535 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 4,04,037 (87.17%) మంది పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు. గ్రూప్-2 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారికి తర్వాత దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. అయితే గతేడాది జూన్ లేదా జులైలో మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. అభ్యర్థుల వినతుల మేరకు పరీక్ష వాయిదావేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 897 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి 2023, ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు అదనంగా మరో 8 పోస్టులను చేర్చడంతో మొత్తం పోస్టుల సంఖ్య 905కి చేరింది. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి జవనరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు గతేడాది ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేశారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 23న మెయిన్ పరీక్ష నిర్వహించారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరిగాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు.




















