Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్‌ఎస్‌ఆర్(మెడికల్) పోస్టులు- ఈ అర్హతలుండాలి
Indian Navy Jobs: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR Medical Assistant) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Indian Navy Agniveer Notification: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్ చిల్కాలో (02/2025-సెప్టెంబర్, 02/2026-జులై బ్యాచ్) శిక్షణ ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 29న ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశాలోని ఐఎన్‌ఎస్ చిల్కా(INS Chilka)లో 02/2025-సెప్టెంబర్, 02/2026-జులై నెలలో శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని వివిధ విభాగాల్లో విధుల్లో నియమిస్తారు. ఎంపికైనవారికి రూ.21,700- రూ.69,100 వేతనం ఉంటుంది. ఇతర భత్యాలు అదనంగా ఉంటాయి.
వివరాలు..
* అగ్నివీర్ - సీనియర్ సెకండరీ రిక్రూట్ (SSR Medical Assistant)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్(10+2) ఉత్తీర్ణులై ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు, స్త్రీలు 157 సెం.మీ. ఉండాలి.
వయోపరిమితి:
ఎస్‌ఎస్‌ఆర్ (మెడికల్) 02/2025 బ్యాచ్: అభ్యర్థులు 01.09.2004 - 29.02.2008 మధ్య జన్మించి ఉండాలి.
ఎస్‌ఎస్‌ఆర్ (మెడికల్) 02/2026 బ్యాచ్: అభ్యర్థులు 01.07.2005- 31.12.2008 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.550.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: స్టేజ్-1 (INET- ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ CBT), స్టేజ్-2 (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాతపరీక్ష, మెడికల్ పరీక్ష) ద్వారా ఎంపికచేస్తారు.
స్టేజ్- సీబీటీ పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు(ఒక గంట). ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. కాగా పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.
శిక్షణ వివరాలు: అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశాలోని ఐఎన్‌ఎస్ చిల్కా(INS Chilka)లో 02/2025-సెప్టెంబర్, 02/2026-జులై నెలలో శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని వివిధ విభాగాల్లో విధుల్లో నియమిస్తారు.
జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700- రూ.69,100. ఇతర భత్యాలు అదనంగా ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
⏩ స్టేజ్-1 (INET- ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ CBT)
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.03.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 10.04.2025.
➥ ఫీజు చెల్లింపు తేదీలు: 29.03.2025.- 10.04.2025.
➥ దరఖాస్తు సవరణ తేదీలు: 14.04.2025. – 16.04.2025.
➥ స్టేజ్-1 (INET): మే 25.
➥ స్టేజ్ I(INET) ఫలితాల ప్రకటన: మే 25.
⏩ స్టేజ్ 2– ఎస్‌ఎస్‌ఆర్(మెడికల్) 02/2025
➥ షార్ట్‌లిస్టింగ్ & కాల్ అప్ లెటర్‌ల జారీ: జూన్ 25.
➥ స్టేజ్ 2– ఎస్‌ఎస్‌ఆర్(మెడికల్) 02/2025: జులై 25.
➥ శిక్షణ ప్రారంభం: సెప్టెంబర్ 2025.
⏩ స్టేజ్ 2– ఎస్‌ఎస్‌ఆర్(మెడికల్) 02/2026
➥ షార్ట్‌లిస్టింగ్ & కాల్ అప్ లెటర్‌ల జారీ: మే 26.
➥ స్టేజ్ 2– ఎస్‌ఎస్‌ఆర్(మెడికల్) 02/2025: మే 26.
➥ శిక్షణ ప్రారంభం: జులై 26.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

