అన్వేషించండి

Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులు, వివరాలు ఇలా

Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Indian Navy Agniveer Notification: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో (02/2025-సెప్టెంబర్‌, 01/2026- ఫిబ్రవరి అండ్  02/2026-జులై బ్యాచ్‌) శిక్షణ ఉంటుంది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 29న ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిల్కా(INS Chilka)లో నవంబర్‌ నెలలో శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని వివిధ విభాగాల్లో విధుల్లో నియమిస్తారు. ఎంపికైనవారికి మొదటి సంవత్సరం నెలకు రూ.30,000, రెండో సంవత్సరం నెలకు రూ.33,000, మూడో సంవత్సరం నెలకు రూ.36,500, నాలుగో సంవత్సరం నెలకు రూ.40,000 వేతనంగా ఇస్తారు. ఇతర భత్యాలు అదనంగా ఉంటాయి. 

వివరాలు..

* అగ్నివీర్ - సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌ (SSR) 

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్‌(10+2) ఉత్తీర్ణులై ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 

వయోపరిమితి:  
ఎస్‌ఎస్‌ఆర్ 02/2025 బ్యాచ్‌: అభ్యర్థులు 01.09.2004 - 29.02.2008 మధ్య జన్మించి ఉండాలి. 
ఎస్‌ఎస్‌ఆర్ 01/2026 బ్యాచ్‌: అభ్యర్థులు 01.02.2005- 31.07.2008 మధ్య జన్మించి ఉండాలి. 
ఎస్‌ఎస్‌ఆర్ 02/2026 బ్యాచ్‌: అభ్యర్థులు 01.07.2005- 31.12.2008 మధ్య జన్మించి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.550.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: స్టేజ్-1 (INET- ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ CBT), స్టేజ్-2 (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాతపరీక్ష, మెడికల్ పరీక్ష) ద్వారా ఎంపికచేస్తారు. 

స్టేజ్- సీబీటీ పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు(ఒక గంట). ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. కాగా పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.

శిక్షణ వివరాలు: అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిల్కా(INS Chilka)లో 02/2025-సెప్టెంబర్‌, 01/2026- ఫిబ్రవరి అండ్ 02/2026-జులై నెలలో శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని వివిధ విభాగాల్లో విధుల్లో నియమిస్తారు.

జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం రూ.30,000, రెండో సంవత్సరం రూ.33,000, మూడో సంవత్సరం రూ.36,500, నాలుగో సంవత్సరం రూ.40,000 వేతనంగా ఇస్తారు. ఇతర భత్యాలు అదనంగా ఉంటాయి. 

ముఖ్యమైన తేదీలు..

⏩ స్టేజ్-1 (INET- ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ CBT)

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.03.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 10.04.2025.

➥ ఫీజు చెల్లింపు తేదీలు: 29.03.2025.- 10.04.2025.

➥ దరఖాస్తు సవరణ తేదీలు: 14.04.2025. – 16.04.2025.

➥ స్టేజ్-1 (INET): మే 25.

➥ స్టేజ్ I(INET) ఫలితాల ప్రకటన: మే 25.

⏩ స్టేజ్ 2– ఎస్‌ఎస్‌ఆర్‌ 02/2025

➥ షార్ట్‌లిస్టింగ్ & కాల్ అప్ లెటర్‌ల జారీ: జూన్ 25.

➥ స్టేజ్ 2– ఎస్‌ఎస్‌ఆర్‌(మెడికల్) 02/2025:  జులై 25.

➥  శిక్షణ ప్రారంభం:  సెప్టెంబర్‌ 2025.

⏩ స్టేజ్ 2– ఎస్‌ఎస్‌ఆర్‌ 01/2026

➥ షార్ట్‌లిస్టింగ్ & కాల్ అప్ లెటర్‌ల జారీ: అక్టోబర్ 25

➥ స్టేజ్ 2– ఎస్‌ఎస్‌ఆర్‌ 01/2026: నవంబర్/ డిసెంబర్ 25.

➥  శిక్షణ ప్రారంభం: ఫిబ్రవరి 26

⏩ స్టేజ్ 2– ఎస్‌ఎస్‌ఆర్‌ 02/2026

➥ షార్ట్‌లిస్టింగ్ & కాల్ అప్ లెటర్‌ల జారీ: మే 26.

➥ స్టేజ్ 2– ఎస్‌ఎస్‌ఆర్‌ 02/2026: మే 26.

➥  శిక్షణ ప్రారంభం: జులై 26.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH vs RR Top 5 players: ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
IPL 2025 SRH VS RR: రాజస్తాన్‌తో మ్యాచ్, టాస్ ఓడిన సన్‌రైజర్స్ కెప్టెన్- ఫస్ట్ బ్యాటింగ్ SRH, జట్టులోకి ప్యాకెట్ డైనమైట్
రాజస్తాన్‌తో మ్యాచ్, టాస్ ఓడిన సన్‌రైజర్స్ కెప్టెన్- ఫస్ట్ బ్యాటింగ్ SRH, జట్టులోకి ప్యాకెట్ డైనమైట్
Bandi Sanjay: జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP DesamSRH vs RR IPL 2025 Match Preview | రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ | ABP DesamFan Touched feet of Virat Kohli | KKR vs RCB మ్యాచ్ లో కొహ్లీపై అభిమాని పిచ్చి ప్రేమ | ABP DesamVirat Kohli vs KKR IPL 2025 | 18వ సారి దండయాత్ర మిస్సయ్యే ఛాన్సే లేదు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH vs RR Top 5 players: ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
IPL 2025 SRH VS RR: రాజస్తాన్‌తో మ్యాచ్, టాస్ ఓడిన సన్‌రైజర్స్ కెప్టెన్- ఫస్ట్ బ్యాటింగ్ SRH, జట్టులోకి ప్యాకెట్ డైనమైట్
రాజస్తాన్‌తో మ్యాచ్, టాస్ ఓడిన సన్‌రైజర్స్ కెప్టెన్- ఫస్ట్ బ్యాటింగ్ SRH, జట్టులోకి ప్యాకెట్ డైనమైట్
Bandi Sanjay: జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
NTR: 'దేవర'తో ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్ - జపాన్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఇక మాస్ జాతరే..
'దేవర'తో ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్ - జపాన్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఇక మాస్ జాతరే..
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజినికి బిగుస్తున్న ఉచ్చు.. ఏసీబీ కేసు నమోదు
Allu Arjun: అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?
అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?
IPL 2025 CSK VS MI Updates: ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
ఎల్ క్లాసికో పోరుకు రంగం సిద్ధం.. నేడు చెన్నైతో ముంబై ఢీ.. హార్దిక్ గైర్హాజరు.. అటు CSKలో దిగులు
Embed widget