Akshaye Khanna: ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ 'మహాకాళి' - కీ రోల్‌లో బాలీవుడ్ హీరో అక్షయ్ ఖన్నా
Mahakali Movie: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తోన్న రెండో మూవీ 'మహాకాళి'. ఈ మూవీలో తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ ఖన్నా భాగమయ్యారు. ఈ సినిమా ఇండియన్ ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ.

Akshaye Khanna Is Set To Join Mahakali Movie Shooting: 'హనుమాన్' మూవీతో స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు ప్రశాంత్ వర్మ (Prashanth Varma). ఆయన దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తోన్న రెండో మూవీ 'మహాకాళీ' (Mahakali).
'మహాకాళీ'లో అక్షయ్ ఖన్నా
'మహాకాళి' మూవీ ఇండియన్ ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ. ఈ సినిమా షూటింగ్‌లో బాలీవుడ్ హీరో అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) త్వరలోనే భాగం కానున్నారు. ఈయన ఇటీవల విక్కీ కౌశల్ హీరోగా నటించిన 'ఛావా' (Chhaava) మూవీలో ఔరంగజేబు పాత్రలో నటించి మెప్పించారు. అక్షయ్ ఖన్నా ఎలివేషన్స్, నటన చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు 'మహాకాళి' మూవీలో ఆయన భాగం కాబోతున్నారు. ఈ ఫ్రాంచైజీలోని అన్ని చిత్రాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. 'హనుమాన్' వంటి భారీ సక్సెస్ తర్వాత మరో సూపర్ హీరో చిత్రం 'మహాకాళి' అవుతుందని మేకర్స్ తెలిపారు.
🔥BIGGGG NEWS🔥
— Tollywood Box Office (@Tolly_BOXOFFICE) April 5, 2025
Bollywood fame Akshay Khanna to join PCU with MAHAKALI under the direction of @PrasanthVarma 🥵#Mahakali - The next super hero film from the PCU will be made on a large scale 🤟#AkshayKhanna #prasanthvarma#RKDStudios#PVCU3 pic.twitter.com/JZWwuiXyH0
'మహాకాళి' సినిమాను ఆర్కేడీ స్టూడియోస్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తుండగా.. ఆర్కే దుగ్గల్ సమర్పిస్తున్నారు. ఇండియాలోనే RKD స్టూడియోస్ మూవీ నిర్మాణం, పంపిణీ, కొనుగోలు సంస్థ కాగా.. ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ మూవీకి ప్రశాంత్‌వర్మ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాల బ్యాక్ డ్రాప్‌గా ఈ మూవీ ఉండబోతోంది. ఇండియన్ ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో మూవీ అని.. యూనివర్స్‌లో మోస్ట్ ఫెరోషియస్ సూపర్ హీరో మూవీ అని మేకర్స్ అంటున్నారు.
Also Read: 'ఆయన ఓ గొప్ప నటుడు, మంచి టీమ్ మేట్' - ఎన్టీఆర్‌తో 'వార్ 2'పై బాలీవుడ్ హీరో హృతిక్ ఏమన్నారంటే?
టైటిల్‌తోనే హైప్
ఈ చిత్రానికి బెంగాల్ గొప్ప సాంస్కృతిక బ్యాక్ డ్రాప్ వున్న "మహాకాళి" అనే టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే మంచి హైప్ నెలకొంది. అద్భుత విజువల్స్, ఎమోషనల్ గ్రిప్పింగ్ స్టోరీతో ఉండబోతోందని తెలుస్తోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ సైతం ఆకట్టుకుంటోంది. ఓ అమ్మాయి తన తలను పులికి సున్నితంగా తాకినట్లు ఉండగా.. గుడిసెలు, దుకాణాలు కనిపిస్తూ ప్రజలు భయాందోళనకు గురవుతూ కనిపించారు. ఓ ఫెర్రిస్ వీల్ మంటల్లో ఉండగా.. బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్ మధ్యలో డైమండ్ లాంటి ఆకారం కనిపిస్తోంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా, శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్. ఇండియన్, ఫారిన్ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

