NTR: 'ఆయన ఓ గొప్ప నటుడు, మంచి టీమ్ మేట్' - ఎన్టీఆర్‌తో 'వార్ 2'పై బాలీవుడ్ హీరో హృతిక్ ఏమన్నారంటే?
War 2 Movie: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన ఓ గొప్ప నటుడని.. మంచి టీమ్ మేట్ అని అన్నారు. వార్ 2 ఆగస్ట్ 14న రిలీజ్ అవుతుందని తెలిపారు.

Hrithik Roshan About NTR: తనకు ఇష్టమైన నటుడు ఎన్టీఆర్ (NTR) అని బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) అన్నారు. వీరిద్దరూ కలిసి 'వార్ 2' సినిమాలో నటించగా.. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న హృతిక్ ఎన్టీఆర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే, వార్ 2 గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
'మా సినిమా అద్భుతంగా వచ్చింది'
'వార్ 2' (War 2) సినిమా షూటింగ్ ఒక పాట మినహా అంతా పూర్తైందని హృతిక్ రోషన్ తెలిపారు. ఎన్టీఆర్ తన ఇష్టమైన సహనటుడు.. గొప్ప యాక్టర్ అని చెప్పారు. 'ఎన్టీఆర్ మంచి టీమ్ మేట్. మా సినిమా అద్భుతంగా వచ్చింది. ఆగస్ట్ 14న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' దీంతో ఈవెంట్‌లో ఆడియన్స్ అంతా ఫుల్ ఖుష్ అయిపోయారు. సినిమా రిలీజ్‌పై కూడా మరోసారి క్లారిటీ వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: రాజమౌళి బోనులో నుంచి బయటపడ్డ సింహం... వెకేషన్ మోడ్‌లో మహేష్ బాబు... పండుగాడా మజాకా
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం 'వార్'. స్పై థ్రిల్లర్ తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా 'వార్ 2' (War 2) చిత్రం తెరకెక్కుతోంది. ఒకరు బాలీవుడ్ స్టార్, మరొకరు టాలీవుడ్ టాప్ హీరో కాంబో కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఏజెంట్ పాత్రలన్నింటి కంటే ఈ మూవీలో ఆయన రోల్ డిఫరెంట్‌గా ఉండనున్నట్లు సమాచారం. గతంలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్‌లు ఏజెంట్ పాత్రలో నటించి మంచి విజయం అందుకున్నారు. ఎన్టీఆర్ కూడా అలానే బాలీవుడ్ ఫస్ట్ మూవీలో మంచి విజయం అందుకోవాలని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఆకాంక్షిస్తున్నారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అదే రోజు రజనీ కాంత్ 'కూలీ' కూడా..
'వార్ 2' మూవీ రిలీజ్ రోజునే సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' (Coolie) మూవీ కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించగా గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ రూపొందింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 14నే ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు టీం తెలిపింది. ఈ మూవీలో నాగార్జున నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నారు. ఉపేంద్ర, సౌబిన్, శ్రుతిహాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఓ కీలక రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఒకే రోజు రెండు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

