Arya 2 re-release: 'ఆర్య 2' రీరిలీజ్... 'పుష్ప 2' వివాదంతో సంధ్య థియేటర్ వద్ద భారీ భద్రత... పెద్ద ఎత్తున పోలీసుల పహారా
Arya 2 re-release : అల్లు అర్జున్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న 'ఆర్య 2' మూవీ ఈరోజు మరోసారి థియేటర్లలోకి వచ్చింది. 'పుష్ప 2' ఘటనను దృష్టిలో పెట్టుకుని సంధ్య థియేటర్ వద్ద భద్రతను ఏర్పాటు చేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'ఆర్య 2' మూవీ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రీరిలీజ్ అయ్యింది. ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు హౌస్ ఫుల్ కావడం విశేషం. ఇంత భారీ క్రేజ్ మధ్య 'ఆర్య 2' రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాదులోని సంధ్య థియేటర్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 'పుష్ప 2' ఇన్సిడెంట్ కారణంగా అధికారులు ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.
సంధ్య థియేటర్ దగ్గర పోలీసుల పహారా
'పుష్ప 2' మూవీ గత ఏడాది రిలీజై ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 మూవీ థియేటర్లలో మరోసారి సందడి చేయడానికి సిద్ధమవ్వడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. అనుకున్నట్టుగా ఈరోజు థియేటర్లలోకి వచ్చిన 'ఆర్య 2' మూవీకి భారీ రెస్పాన్స్ దక్కుతుంది. ఇక ఈ మూవీ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా 70mm, 35mm థియేటర్లలో కూడా రిలీజ్ అయింది. కానీ 'పుష్ప 2' మూవీ టైంలో జరిగిన దురదృష్టకర సంఘటనను దృష్టిలో పెట్టుకొని భారీ భద్రత మధ్య ఇక్కడ మూవీని రిలీజ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి థియేటర్ ప్రాంగణంలో పోలీసు సిబ్బంది మోహరించడం విశేషం. ఇప్పుడు ఏకంగా అక్కడ 30 మంది పోలీసులు పహారా కాస్తున్నట్టు సమాచారం. అలాగే అక్కడికి వచ్చే ఆడియన్స్ బ్యాగ్స్, వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: తప్పు చేశా... తిట్టినోళ్లు అందరికీ సారీ - దీనంగా ఫేస్ పెట్టి క్షమాపణలు కోరిన అలేఖ్య చిట్టి
ఇక 'ఆర్య 2' మూవీలో అల్లు అర్జున్ తో పాటు కాజల్ అగర్వాల్, నవదీప్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. 2009లో ఈ మూవీ ఫస్ట్ టైం థియేటర్లలోకి వచ్చింది. అప్పట్లో ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఏళ్లు గడుస్తున్న కొద్ది ఈ మూవీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. సినిమా రీ రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు యూత్. ఈరోజు రీరిలీజ్ అయిన ఈ మూవీ రికార్డు స్థాయిలో ఓపెనింగ్ రాబట్టే ఛాన్స్ ఉంది.
'పుష్ప 2' వివాదం ఏంటి?
'పుష్ప' అనే బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ గా రూపొందింది 'పుష్ప 2'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్న మరోసారి మెయిన్ లీడ్స్ గా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వెళ్లారు. అప్పటికే అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు చేరడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదకర సంఘటనలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ అక్కడికక్కడే కన్నుమూసింది. 9 ఏళ్ల ఆమె కుమారుడు ఇంకా కోలుకోలేదు. ఈ వివాదంలో అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

