SSMB 29: రాజమౌళి బోనులో నుంచి బయటపడ్డ సింహం... వెకేషన్ మోడ్‌లో మహేష్ బాబు... పండుగాడా మజాకా
SSMB 29 : 'ఎస్ఎస్ఎంబీ 29' కోసం మహేష్ బాబు పాస్ పోర్ట్ ను లాగేసుకుని, సింహాన్ని బోనులో బంధించినట్టు జక్కన్న ఫోజులిచ్చారు. ఇప్పుడు మహేష్ ఆ పాస్ పోర్ట్ ను తెచ్చుకొని మళ్లీ వెకేషన్ మోడ్ లోకి వెళ్లిపోయారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగజం రాజమౌళి కాంబినేషన్లో 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావడంతో తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ కనిపించారు. ఈ మేరకు ఓ వీడియోలో ఆయన తన పాస్ పోర్ట్ ను జక్కన్న నుంచి వెనక్కి తెచ్చుకున్నట్టు చూపించడం వైరల్ గా మారింది. గతంలో మహేష్ బాబు పాస్ పోర్ట్ ను లాగేసుకుని, ఆయనని బోన్లో సింహంలా బంధించినట్టు జక్కన్న ఓ వీడియోను వదిలారు. ఇప్పుడు మహేష్ తన పాస్ పోర్ట్ ను వెనక్కి తెచ్చుకున్నాను అంటూ హింట్ ఇవ్వడం విశేషం.
బోన్ లో నుంచి బయటపడ్డ సింహం
రాజమౌళితో మహేష్ బాబు సినిమా అనగానే అసలు వీరిద్దరికీ పొంతన ఎలా కుదురుతుంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే జక్కన్న ఓసారి పట్టుకున్నాడు అంటే సినిమా పూర్తయ్యే వరకు వదిలిపెట్టడు. మరోవైపు మహేష్ బాబు తరచుగా వెకేషన్ లకు వెళుతూ ఉంటారు. రీసెంట్ గా రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు జక్కన్న తనకు కావలసిన కంటెంట్ నటుడి నుంచి వచ్చే వరకు పులస తీస్తాడు. అలాంటిది 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ ఎలా పట్టాలెక్కుతుందో చూడాలని అందరూ ఈగర్ గా వెయిట్ చేశారు. అనుకున్నట్టుగానే జనవరిలో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను మొదలుపెట్టి, శరవేగంగా పూర్తి చేశారు జక్కన్న.
అయితే అంతకంటే ముందే మహేష్ బాబు వారానికోసారి విదేశాలకు వెళ్తూ తరచుగా ఎయిర్పోర్టులో దర్శనమిచ్చేవారు. ఈ నేపథ్యంలోనే జక్కన్న ఆయన నుంచి పాస్ పోర్ట్ లాగేసుకున్నాను అంటూ ఓ అప్డేట్ ఇచ్చారు. అందులో సింహాన్ని బోన్ లో బంధించాను అన్న విధంగా ఆయన ఫోటోలకి ఫోజులిచ్చారు. అంటే మహేష్ బాబు ట్రిప్పులకు వెళ్లకుండా పాస్ పోర్ట్ లాగేసుకొని, సినిమా కోసం ఇక్కడే బంధించారన్నమాట. నిజానికి అప్పట్లో ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుండడం, మహేష్ బాబు వెకేషన్ లు ఎక్కువ అవుతుండడంతో పాస్ పోర్ట్ లాగేసుకోమని మీమ్స్ వేశారు అభిమానులు. జక్కన్న కూడా అలాగే చేశారు. ఇక తాజాగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావడంతో మహేష్ బాబుకి రాజమౌళి ఫ్రీడం ఇచ్చినట్టు తెలుస్తోంది. సెకండ్ షెడ్యూల్ కి కాస్త బ్రేక్ రావడంతో మహేష్ బాబు తన పాస్ పోర్ట్ ని రాజమౌళి నుంచి తీసుకొని, ఎంచక్కా విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నట్టు తాజాగా వీడియోలో కనిపించారు. ఈ మేరకు తాజాగా ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు పాస్ పోర్ట్ తో దర్శనం ఇచ్చారు.
Also Read: ట్రోలింగ్ తట్టుకోలేక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్... చిట్టి పికిల్స్ లేడీ షాకింగ్ డెసిషన్
మహేష్ బాబు వెళ్తోంది అక్కడికేనా?
ఈ నేపథ్యంలోనే అసలు వెకేషన్ కోసం మహేష్ బాబు ఎక్కడికి వెళ్తున్నారు అన్న విషయం ఇంకా తెలియ రాలేదు. కానీ ప్రస్తుతం గౌతమ్ విదేశాల్లో చదువుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఫ్యామిలీ అంతా అక్కడికే వెళ్లి, వెకేషన్ ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇక రెండవ షెడ్యూల్ మొదలయ్యేలోపు జక్కన్న రెండు నిమిషాల వీడియోతో అప్డేట్ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.





















