అన్వేషించండి

TG Ration Cards: రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్, వారికి చివరి అవకాశం

Telangana Ration Cards | రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఈకేవైసీ పూర్తి చేసుకోని వారికి చివరి అవకాశం కల్పించారు.

Ration Card eKYC in Telangana | హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ కేవైసీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. వాస్తవానికి మార్చి 31 తేదీ వరకే ఈ కేవైసీ పూర్తి చేసుకునేందుకు గడువు ముగిసింది. కేంద్ర ప్రభుత్వం మరో నెల పొడిగింపు ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఊరట కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. 

రేషన్ కార్డుదారులకు సబ్సిడీ పంపిణీలో పారదర్శకత నిర్ధారించడంతో పాటు అనర్హులకు కార్డుల ఏరువేతపై కేంద్రం ఫోకస్ చేస్తుంది. జాతీయ ఆహార భద్రత చట్టం(NFSA) కింద రేషన్ కార్డుదారులకు పలు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉచిత బియ్యం అందిస్తున్నాయని తెలిసిందే. మార్చి 31లోగా ఈకేవైసీ పూర్తి చేయని వారికి రేషన్ కార్డులు రద్దు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. కానీ సర్వర్లు ప్రాబ్లమ్ ఉండటం, లబ్దిదారులకు ప్రభుత్వ ప్రయోజనాలు, సంక్షేమం దూరం కావొద్దని భావించి కేంద్రం ఏప్రిల్ వరకు ఈకేవైసీకి గడువు ఇచ్చింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ నెలాఖరులోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. 

ఇదే లాస్ట్ ఛాన్స్...
కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ (e-KYC) పూర్తి చేసుకునేందుకు గతంలో పలుమార్లు గడువు పొడిగించింది. ఇటీవల ఏప్రిల్ 30 తేదీ వరకు ఈకేవైసీకి గడువు ఇచ్చింది. ఈకేవైసీ ప్రక్రియ కోసం డెడ్ లైన్ పొడిగించడం ఇది నాలుగోసారి అని, ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్న వారికి ఇక భవిష్యత్తులో e-KYCకి గడువు పొడిగింపు ఉందని కేంద్రం స్పష్టం చేసింది. పారదర్శకత కోసం, అక్రమాలు అరికట్టేందుకు చేసే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడం లబ్ధిదారుల నిర్లక్ష్యమని అధికారులు అంటున్నారు. ఏప్రిల్ 30 తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేసుకున్న రేషన్ కార్డుదారులు మాత్రమే ప్రయోజనాలు పొందనున్నారు. తరువాత ఈకేవైసీ పూర్తి చేసుకోని రేషన్ కార్డు దారులకు బియ్యం, సహా రేషన్ సరుకులు అందించరు. అలాంటి రేషన్‌కార్డులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.

ఈకేవైసీ ఇలా ఈజీగా పూర్తి చేసుకోండి

ఈ ఈకేవైసీ ప్రక్రియను డీలర్లను సంప్రదించి పూర్తి చేయవచ్చు. గడువు ముగుస్తుందని మార్చి నెలాఖరులో రేషన్ షాపులకు క్యూ కట్టడం, ఆన్ లైన్ పోర్టల్ లో ప్రయత్నించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో ప్రభుత్వం మరో నెలల రోజులు ఈకేవైసీ గడువు పొడిగించింది. రేషన్ షాపులు, ఆధార్ కేంద్రాలు లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లను సంప్రదించి e-KYC ప్రక్రియను సులభంగా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి తేదీ వరకు ఎదురుచూడకుండా వీలు చూసుకుని, సాధ్యమైనంత త్వరగా రేషన్‌కార్డు దారులు ఈకేవైసీ పూర్తి చేసుకుని కార్డు రద్దు అవకుండా, లేక రేషన్ సరుకులు నిలుపుదల చేయకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. ఎంత బిజీగా ఉన్నా తప్పకుండా ఈకేవైసీ ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరులోగా చేసుకుని లబ్ధిదారులు కేంద్రం, రాష్ట్రం అందిస్తున్న ప్రయోజనాలను పొందాలని సూచించారు.

తెలంగాణలో సన్న బియ్యం..
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈ నెల నుంచి సన్న బియ్యం అందిస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టారని తెలిసిందే. కొత్త రేషన్ కార్డులకు సైతం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని.. అప్లికేషన్లు పరిశీలించి జారీ చేస్తూనే ఉంటామన్నారు. రెండు రకాలుగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది ప్రభుత్వం. ఇదివరకే ఉన్న వారి కార్డులను సైతం అప్ డేట్ చేసి ఏటీఎం, పాన్ కార్డు తరహాలో ఉండే కార్డులను అందజేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget