Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేశారా? డెడ్‌లైన్ దగ్గరపడుతోంది!
Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకోవడానికి డెడ్‌లైన్ దగ్గర పడింది. ఇప్పటికే ఒకసారి పొడిగించిన ప్రభుత్వం మరోసారి పొడించే అవకాశం లేదని చెబుతోంది.

Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కోసం అప్లై చేశారు. డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం చేసి స్వయం ఉపాధి అవకాశాల కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఇప్పటికే కొందరు దరఖాస్తు చేయగా మరికొందరు అనేక అనుమానాలతో దరఖాస్తులకు దూరంగా ఉంటున్నారు. అయితే దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి ఆరువేల కోట్ల బడ్జెట్‌తో తీసుకొచ్చిన ఈ పథకం గేమ్‌ఛేంజర్‌గా ఉపయోగపడనుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తూ దరఖాస్తులు ఎక్కువ వచ్చేలా ప్రోత్సహిస్తోంది. యువత ఎక్కువమంది పాల్గొనేలా చేస్తోంది.
ఈ రాజీవ్ యువ వికాసం పథకం అప్లే చేయడానికి రేషన్ కార్డు ఉంటే చాలని అధికారులు చెబుతున్నారు. రేషన్ కార్డు లేని వాళ్లు ఆదాయ ధ్రువపత్రంతో ఆధార్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటితోపాటు పాన్ కార్డు, పాస్‌పోర్టు ఫొటోలు, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు అవసరం ఉంటుంది.
మార్చి 15న తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వారం రోజుల వ్యవధిలోనే లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. దీంతో రాజీవ్ యువ వికాసం పథకం గడువును ఏప్రిల్ 14, 2025 వరకు పొడిగించింది. అంతే కాదు ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు నియమాలను సడలించారు. రేషన్ కార్డులకు ప్రత్యామ్నాయంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించేందుకు ఓకే చెప్పారు. ముందు చెప్పిన రూల్స్ ప్రకారం రేషన్ కార్డు కచ్చితంగా ఉండాలని చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి రేషన్ కార్డు లేని వాళ్లు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించ వచ్చని తెలిపారు.
రాజీవ్ యువ వికాసం పథకం ఎలా అప్లై చేయాలి?
అధికారిక వెబ్‌సైట్ https://tgobmms.cgg.gov.in/ కు వెళ్లి అక్కడ అవసరమైన వివరాలు నింపి డాక్యుమెట్స్ సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసి కూడా అధికారులకు సమర్పించవచ్చు. దరఖాస్తులను ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలి.
రాజీవ్ యువ వికాసం పథకం ఏం చేస్తారు?
ఇష్టమైన వచ్చిన వృత్తుల్లో ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. దీని కోసం ప్రభుత్వమే రుణం అందిస్తుంది. ఇందులో నాలుగు రకాల స్కీమ్స్ ఉంటాయి. మొదటిది 50 వేల రూపాయల స్కీమ్. ఇందులో రుణం తీసుకున్న వాళ్లకు వంద శాతం రాయితీ ఉంటుంది. రెండోది లక్ష రూపాయల స్కీమ్ ఈ స్కీమ్‌లో చేరిన వారికి 90శాతం రాయితీ ఉంటుంది. తర్వాత రెండు లక్షల స్కీమ్ నాలుగు లక్షల స్కీమ్ ఉంది. ఆఖరి స్కీమ్‌లో నాలుగు లక్ష రుణం తీసుకుంటే 60 శాతం వరకు రాయితీ ఇస్తారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి ఎవరు అర్హులు?
ఇందులో చేరడానికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువత ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లై చేయాలనుకునే గ్రామీణ అభ్యర్థులకు వార్షిక ఆదాయం లక్షన్నర కంటే తక్కువ ఉండాలి. పట్టణాల్లో అయితే రెండు లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్లు అర్హులు. స్క్రూట్నీ అయిన తర్వాత ఎంపికైన వారికి టైలరింగ్, డ్రైవింగ్, వ్యవసాయం, డైరీ ఫామ్, పౌల్ట్రీ లాంటి వాటిలో ఉపాధి పొందవచ్చు.
మొదటి దశలో రాజీవ్ యువ వికాసం పథకం విస్తరించిన తర్వాత వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకొని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ పెంచడంతోపాటు కొత్త వర్గాలను, వృత్తులను చేర్చే అవకాశం ఉంది. టెక్-ఆధారిత వెంచర్‌లు ఇందులో ఇంక్లూడ్ చేయనున్నారు. ఇందులో ప్రైవేటు సంస్థలను కూడా భాగం చేయబోతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

