CM Chandrababu: అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు, 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్: చంద్రబాబు
అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించాలన్నారు.

Mega Global Medicity project in Amaravati | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు (Chandrababu) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఏపీ సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖలపై సీఎం చంద్రబాబు శుక్రవారం నాడు సమీక్షించారు. దేశంలోనే వైద్య రంగంలో ఏపీని నెంబర్ వన్‌గా నిలపాలని, అధికారులు అందుకు ప్లాన్ చేయాలని సీఎం సూచించారు.
వైద్య ఆరోగ్యశాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టును అమరావతిలో ఏర్పాటు చేయాలి. అందుకోసం ప్లాన్ సిద్ధం చేయండి. ప్రపంచ దేశాలు మన వద్దకు వచ్చేలా ప్రాజెక్టు డిజైన్ చేయాలి. ఏపీలోని 175 నియోజకవర్గాలకుగానూ కేవలం 70 చోట్ల మాత్రం 100 బెడ్స్ ఆస్పత్రులు ఉన్నాయి. మిగతా 105 చోట్ల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణం చేపట్టాలి. పీపీపీ విధానంలో ఈ ఆస్పత్రిలో నిర్మాణానికి ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వం సబ్సిడీ అందించాలి.
వర్చువల్ విధానంలో వైద్య సేవలు
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో మెరుగైన వైద్య సేవలు కల్పించేలా ప్రణాళికను సిద్ధం చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లాంటి వాటిలో డాక్టర్లు అందుబాటులో లేని సమయంలో పర్చువల్ విధానం లో పేషంట్లకు ప్రాథమిక సేవలు అందేలా చర్యలు. రాష్ట్రంలో కొత్తగా 13 డ్రగ్ డి ఎడిషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న డి అడిక్షన్ సెంటర్లను 32 కోట్ల రూపాయలతో బలోపేతం చేయాలని’ చంద్రబాబు సూచించారు.
కొత్తగా 8 డయాలసిస్ కేంద్రాలు
విజయనగరం, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో డయాలసిస్ యంత్రాల పెంచాలన్నారు. విజయనగరం జిల్లాలో కొత్తగా 8 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు చేయాలని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకురాగా అందుకు ఆయన అంగీకరించారు. నిడదవోలు, కొవ్వూరు సీహెచ్‌సీల మెరుగైన సౌకర్యాలు, వసతుల కల్పనకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కుప్పంలో టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (TCS) డెవలప్ చేసిన డిజిటల్ నెట్‌వర్క్ సెంటర్ ఏర్పాటు అప్‌డేట్స్ పై సైతం సమీక్షించారు. పీపీపీ విధానంలో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల (Medical colleges) నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి సత్యకుమార్ సమీక్షలో సీఎం చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలు, రాష్ట్రంలో కొత్త నమోదవుతున్న వ్యాధుల వివరాలను, వాటి తీవ్రత, తాజాగా నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు.
Also Read: YS Sharmila : అసలు విషయం వదిలేస్తున్నారు, నచ్చినట్టు వాడుకుంటున్నారు- మీడియాపై షర్మిల ఆగ్రహం






















