Tilak Varma Retired out | LSG vs MI మ్యాచ్ లో అతి చెత్త నిర్ణయం
లక్నో సూపర్ జెయింట్స్ మీద గెలవాలంటే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 204 పరుగుల టార్గెట్ ను ఫినిష్ చేయాలి. క్రీజ్ లో హార్దిక్ పాండ్యా ఇంకా తిలక్ వర్మ ఉన్నారు. 19వ ఓవర్ ఐదో బంతికి కూడా పడిపోయింది. ఇక మ్యాచ్ గెలవాలంటే 7 బంతుల్లో 24 పరుగులు చేయాలి అని. ఈలోగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ విషయాన్ని తిలక్ వర్మకు చేరవేశాడు. అదే నువ్వు రిటైర్ అవుట్ అవ్వాలి అని. అసలు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి తిలక్ వర్మ 23 బంతుల్లో 2 ఫోర్లు కొట్టి 25 పరుగులు చేశాడు. వాస్తవానికి అది పర్లేదు అనిపించే స్కోరే ఎందుకంటే ఓవర్లు కరిగిపోతున్న కొద్దీ తిలక్ లాంటి ప్లేయర్స్ లో ఉన్న హిట్టర్ బయటకు వ స్తాడు. అలాంటిది తిలక్ వర్మకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంకా టీమ్ మేనజ్మెంట్. రిటైర్ అవుట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సో తిలక్ రిటైర్ అవుట్ అయ్యితే మిగిలిన 7 బంతుల్లోనే 24 పరుగులు చేయాలి కాబట్టి. వచ్చినోడు భారీ సిక్సర్లు కొడతాడనేది ఆలోచన కావచ్చు. సరే అని తిలక్ జాలి మొహం పెట్టుకుని పెవిలియన్ వైపు వెళ్లాడు. కానీ తిలక్ బదులు ఎవరు వచ్చారో తెలుసా మిచెల్ శాంట్నర్. ఇంతటి టఫ్ సిచ్యుయేషన్ లో కనీసం ఎవడో హార్డ్ హిట్టర్ ను తీసుకోకుండా శాంట్నర్ ని పంపితే మనోడు వచ్చి 2 బాల్స్ లో 2 కొట్టి స్ట్రైకింగ్ ని నువ్వే ఆడుకో అని హార్దిక్ కు ఇచ్చేశాడు. పాండ్యా ఓ సిక్స్ కొట్టి ఆశలు రేపినా...టార్గెట్ ఎక్కువ కావటంతో ఏం చేయలేకపోయాడు. 12పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది. సరిగ్గా ఇదే పాయింట్ పై మాజీ క్రికెటర్లు ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్ లాంటి క్రికెటర్లంతా అసలు తిలక్ ను ఆపి శాంట్నర్ ను పంపించటం ఏంటని పాండ్యా పై ఫైర్ అవుతున్నారు. కెరీర్ మొత్తం చూసుకున్నా కూడా 150 కి దగ్గర దగ్గర స్ట్రైక్ రేట్ ఉన్న తిలక్ వర్మ లాంటి ఆటగాడిని కాదని శాంటర్న్ ను దింపటం పెద్ద తప్పు అని కామెంట్స్ చేస్తున్నారు. అసలు తిలక్ రిటైర్ అవుట్ అవ్వాలనే నిర్ణయాన్ని పాండ్యానే తీసుకున్నాడా..లేదా టీమ్ మేన్మెజ్మెంట్ చెప్పిందా. ఇంత యంగ్స్టర్ అయిన కుర్రాడిని లాస్ట్ ఇయర్ మూడు హాఫ్ సెంచరీలతో అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చిన కుర్రాడిని కాదనుకుని ఒక్క మ్యాచ్ లో స్లోగా ఆడుతున్నాడని స్పాట్ లో రిటైర్ అవుట్ అయ్యేలా చేసి మ్యాచ్ ఓడిపోవటంతో పాటు..తిలక్ వర్మను అవమానించారని ముంబై ఫ్యాన్స్ ఆవేదన్ వ్యక్తం చేస్తున్నారు.





















